ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఓ నల్ల తుమ్మా, ఓ నల్ల తుమ్మా
పసిడి పూల కొమ్మ
నీవు లేక పల్లె చిరునామా లేదమ్మా
ఓ నల్ల తుమ్మా
గులకరాళ్ళ సౌక నేలైన మొలిసేవు
గుట్టలూ రాళ్లున్న గుబురుగా పెరిగేవు
కంచె లేకనే పెరిగి కంచె నీవయ్యేవు
మంచెపై కాపుకు దాపు నువ్వయ్యేవు
అయినా పెట్టిపోతల కొరకు
పెట్టి పోతల కొరకు… పెట్టుకోవు బెంగ
మేక పంచకముంటే
మేక పంచకముంటే… అదె నీకు సురగంగ
మేక పంచకముంటే… అదె నీకు సురగంగ
ఒళ్ళంతా ముల్లున్నా
ఒళ్ళంతా ముల్లున్నా ఒడి మెత్తనోయమ్మా
కొల్లలుగ పిట్టలకు టెన్ టూ ఫైవ్ కొలుపు నీవమ్మా
కాటుకా పూతలా నీ తనువు నలుపున్న
కాటుకా పూతలా నీ తనువు నలుపున్న
కడుపులో జాలోలె పసుపూరుతావమ్మా
చిగురాకులే గాని
చిగురాకులే గాని… కొప్పెంతొ సిక్కనా
నీ పసరిగాలి విసిరే పరిమళమే సక్కన
ఓ నల్ల తుమ్మా
సక్కనీ నీ తనువు… తలుపు సెక్కలకనువు
వంపుంటెనేమవి నాగలి దుంగలు
మెండైన మండలు… గుంటుకా దిండులు
బల్లలూ, మంచాలు… బండిరుసు గిర్రలు
తాటి గాలి పడగ బొంగరాల గిరక
లేత చెక్కిలి మెరిపించె ముక్కు పుడక
అంతా నాదనే నరుడు… ఆయువొదిలిన జనం
తనవారైనంగ పీనుగని చూసేను
కాని బల్లలూ, మంచాలు… బండిరుసు గిల్లలు
బొంగరాల గిరక… తాటి గాలి పడక
యద చెక్కిలిని మెక్కించే ముక్కు పుడక
నీవు ఆయువొదిలిన కొత్త అందమై బతికినవు
ఓ నల్ల తుమ్మా, ఓ నల్ల తుమ్మా
నీవు లేక పల్లె చిరునామా లేదమ్మా
ఓ నల్ల తుమ్మా
కవిపండితులు నిన్ను కానకపోయినా
ఈ కాపుదానపు కవనమెల్ల నీ రూపమే
సెరువు కట్టించిన రాజెవ్వడైతేమి
రాతి శాసనముపై రాజు పేరుండినా
నీ తుమ్మ వల్ల ఊరు తుమ్మలా రేవాయే
రాతి శాసనముపై రాజు పేరుండినా
యోదులు ఈరులు… రాజులును మత్తులని
రాసిన రాతలకు చెరిగిపోని పేరు
నీ తుమ్మ వనము వల్ల తుమ్మలా రేవాయే
ఇంటి పేరుతో నువ్వే
కుంట పేరుతో నువ్వే
కదురు కవ్వము మోట
కుదురు కవ్వము మోట
కదురు వెనక నువ్వే
ఓ నల్ల తుమ్మా, ఓ నల్ల తుమ్మా
నీవు లేక పల్లె చిరునామా లేదమ్మా
ఓ నల్ల తుమ్మా
ఉలి పనితనముతో టేకోలే సోకులుగా
ఈ కలికాలముకు ఒడ్ల బత్తయ్యే కానుకౌ
చెదికందిన ఒగరు నోట పరిమళమొళికి
పేరెన్నికాగల్ల వైద్యులకు తగ్గని కంపునోరు కూడా
కస్తూరి నూరించి కవులకు కవనానికి వస్తువైనవమ్మా
Lyrics | Rasamayi Balakishan |
Singer | Goreti Venkanna |
Album | Rasamayi Janapadam (Vol 2) |
Song Source | Telangana Folk Songs – Janapada Songs Telugu |