Menu Close

Nalla Mabbullona Lyrics in Telugu – Telugu Folk Song – మరిచే పోయావా

Nalla Mabbullona Lyrics in Telugu – Telugu Folk Song – మరిచే పోయావా

మరిచే పోయావా… నువ్వు మారే పోయావా…
ఒంటరి చేశావా… నన్ను వదిలేసి వెళ్ళావా… || 2 ||

ఎవ్వరు లేని ఏకాకిలాగ… మిగిలానే ఓ పిల్లా…
అందమైన నా జీవితమంతా… ఆగమయ్యిందే నీ వల్ల
గుండెను పొడిచేటి ముళ్ల పొదలో… నేను చిక్కుకున్ననే ఓ పిల్లా

జన్మలోన లేని దుఃఖమంత నన్ను… బాధ పెడుతూ ఉందే ఈ వేళ
ఉలుకు లేని పలుకు లేని మూగవానినే… నీ ప్రేమలోన మునిగి నేను మోసపోతినే
కనులు రెండు ఉన్నా… నేను గుడ్డి వాడినే
నీ మనసులోని విషాన్ని… చూడలేకపోతినే…

మరిచే పోయావా… నువ్వు మారే పోయావా…
ఒంటరి చేశావా… నన్ను వదిలేసి వెళ్ళావా…

నీ వేలు పట్టుకొని… రేయంతా పగలంతా
అరికాళ్ళు అరిగేలా వెనకే తిరిగానే… నీ నీడ చూసుకొని…
ఇలలోన కలలోన… నాతోడు నువ్వంటు ఎంతో మురిసానే

నన్నేమి చేశావో ఏ చోట నేనున్నా… నీ జ్ఞాపకాలే మనసంతా
కన్నీటి సంద్రంలో కరిగిపోతూ ఉన్న… కనికరించరాదే కూసంత…

నల్ల మబ్బులోన… తెల్లంగ మెరిసేటి సందామామ…
నా గొంతుకు బిగిసిన… ఉరితాడునే తెంపి వెళ్లిపోవమ్మా…
సెట్టు కొమ్మలల్ల కూ అని కూసేటి కోయిలమ్మ
నా గూటిలోకి చేరి… ఓ ప్రేమ పాటను పాడవేలమ్మ

రావే రావే పిల్ల… నువ్వు రావే రావే పిల్లా…
రావే రావే పిల్ల… నువ్వు రావే రావే పిల్లా…
రావాలని ఆశ ఉంటె రాకపోదువా…ఆ ఆ
నువ్వు చేరాలన్న కోరిక ఉంటే చేరలేకపోదువా..!

మరిచే పోయావా… నువ్వు మారే పోయావా…
ఒంటరి చేశావా… నన్ను వదిలేసి వెళ్ళావా…

నాలోని ప్రాణమంతా… నీలోనే దాచాను
నీతోనే ఉన్నాను నిన్నే విడలేకా…
నాలోని ఊపిరంతా… నీకే అర్పించాను
నీ కొరకై ఏడ్చాను నువ్వే జతలేకా…

నేనున్నా లేకున్నా… ఏ చోట నువ్వున్నా…
నీ సంతోషాన్నే కోరుతున్నా…
నా మీద నీకైనా… ఏ ప్రేమ లేకున్నా…
నీ రాకకై నే వేచి ఉన్న…

కొండకోనల్లోన హాయిగ తిరిగేటి రామచిలుకమ్మా
నీలాంటి బతుకున్న నాకింక శోకము లేకపోవున్నమ్మా…
గాయాలపాలైన రాగాన్ని పలికించే వేణువమ్మా…
నా కంటెకు తగిలిన గాయానికేమందు చెప్పి పోవమ్మా…

రావే రావే పిల్ల… నువ్వు రావే రావే పిల్లా…
రావే రావే పిల్ల… నువ్వు రావే రావే పిల్లా…
రావాలని ఆశ ఉంటె రాకపోదువా…ఆ ఆ
నువ్వు చేరాలన్న కోరిక ఉంటే చేరలేకపోదువా..!

మరిచే పోయావా… నువ్వు మారే పోయావా…
ఒంటరి చేశావా… నన్ను వదిలేసి వెళ్ళావా.. ..

Nalla Mabbullona Lyrics in English – Telugu Folk Song – మరిచే పోయావా

Mariche Poyaava… Nuvvu Maare Poyaava
Ontari Cheshaava… Nannu Vadhilesi Vellaava…||2||

Evvaru Leni Ekaakilaaga… Migilaane Oo Pillaa…
Andhamaina Naa Jeevithamainthaa… Aagamayyindhe Nee Valla
Gundenu Podicheti Mulla Podhalo… Nenu Chikkukunnane Oo Pillaa…

Janmalona Leni Dhukhamantha Nannu… Baadha Peduthu Undhe Ee Vela
Uluku Leni Paluku Leni Moogavaanine…
Nee Premalona Munigi Nenu Mosapothine…
Kanulu Rendu Unnaa… Nenu Guddi Vaadine
Nee Manasuloni Vishaanni… Choodalekapothine…

Mariche Poyaava… Nuvvu Maare Poyaava
Ontari Cheshaava… Nannu Vadhilesi Vellaava…

Nee Velu Pattukoni… Reyanthaa Pagalanthaa
Arikaallu Arigelaa Venake Thirigaane… Nee Needa Choosukoni
Ilalona Kalalona… Naa Thodu Nuvvantu Entho Murisaane

Nannemi Cheshaavo Ye Chota Nenunnaa…
Nee Gnapakaale Manasantha….
Kanneeti Sandramlo Karigipothu Unna…
Kanikarincharaadhe Koosantha…

Nalla Mabbulona… Thellanga Meriseti Sandhaamaama…
Naa Gonthuku Bigisina… Uri Thaadu Thempi Vellipovammaa…
Settu Kommalalla KOO ani Kooseti Koyilamma
Naa Gootiloki Cheri… Oo Prema Paatanu Paadavelamma…

Raave Raave Pilla… Nuvvu Raave Raave Pillaa…
Raave Raave Pilla… Nuvvu Raave Raave Pillaa…
Raavaalani Aasha Unte Raakapodhuvaa… Aa Aa
Nuvvu Cheraalanna Korika Unte Cheralekapodhuvaa..!

Mariche Poyaava… Nuvvu Maare Poyaava
Ontari Cheshaava… Nannu Vadhilesi Vellaava…

Naaloni Praanamanthaa… Neelone Dhaachaanu
Neethone Unnaanu Ninne Vidalekaa…
Naaloni Oopirantha… Neeke Arpinchaanu
Neekorakai Edchaanu Nuvve Jathalekaa…

Nenunnaa Lekunnaa… Ye Chota Nuvvunnaa…
Nee Santhoshaanne Koruthunnaa…
Naa Meedha Neekainaa… Ye Prema Lekunnaa…
Nee Raakakai Ne Vechi Unna…

Kondakonallona Haayiga Thirigeti Raamachilukammaa
Neelaanti Bathukunna Naakinka Shokamu Lekapovunnammaa
Gaayaalapaalaina Raagaanni Palikinche Venuvammaa…
Naa Kanteku Thagilina Gaayaanikemandhu Cheppi Povammaa…

Raave Raave Pilla… Nuvvu Raave Raave Pillaa…
Raave Raave Pilla… Nuvvu Raave Raave Pillaa…
Raavaalani Aasha Unte Raakapodhuvaa… Aa Aa
Nuvvu Cheraalanna Korika Unte Cheralekapodhuvaa..!

Mariche Poyaava… Nuvvu Maare Poyaava
Ontari Cheshaava… Nannu Vadhilesi Vellaava.. ..

మరిచే పోయావా లవ్ లెటర్ – Nalla Mabbullona Love Letter

ఓ ప్రియా..! కడలల్లే వేచిన నా కనులలోకి అలవై వచ్చి కలలా మిగిలిపోయావు. కనిపించని నా హృదయంలో వినిపించని శబ్దమై, నిశ్శబ్ద మేఘాల నుండి ఆరని అగ్ని పిడుగుల్ని కురిపించావు. సమస్తం నీవే అనుకున్న నా జీవితమిప్పుడు అస్తమయమై పోయింది. వేదాలు తెలియని నా ప్రాణం వేధనతో వేగిపోతున్నది. వేయి జన్మలు ఒక్కటై నా జన్మకు ప్రాణం పోసినా, నువ్వు లేని ఈ జన్మ క్షణం కూడా వద్దు అంటుంది. నువ్వు నడుస్తున్నప్పుడు నీ పాదాలను రక్షించడానికి చెప్పునై నీతోనే ఉంటాను. నిన్ను కాపాడటానికి నీడనై నీవెనకే తిరుగుతుంటాను. నువ్వు నన్ను మర్చిపోయావేమో కానీ, నా జ్ఞాపకాలు మాత్రం నీతోనే ఉన్నాయి. ఎందుకంటే, నా ప్రేమ ఇలా వచ్చి అలా వెళ్లే వాగు లాంటిది కాదు. నిరంతరం నిలిచిపోయే సముద్రం లాంటిది. నీ దృష్టిలో అది ఇంకిపోయి ఉండవచ్చు, నా దృష్టిలో మాత్రం ఉప్పెనై నిరంతరం పొంగుతూనే ఉంటుంది. కాలం మనల్ని దూరం చేసిందని కారణాలు చెప్పను, విధి మనల్ని విడదీసిందని అబద్ధాలు చెప్పలేను. కానీ ఎందుకో, నీ మౌనాన్ని సహించలేని నా మనసు మరణం పొందుతుంది.. ..

Nalla Mabbullona Lyrics in Telugu – Telugu Folk Song – మరిచే పోయావా

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading