అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
అసలైన విజయ దశమి
ఒక్కడిగా ఉన్న నీ స్వస్వరూపరమును తెలుసుకోవాలి. దీని ద్వారా ఒకటిని అధిగమించాలి. ఉన్నది ఒకటే, రెండవది లెదు ఇది తెలుసుకుంటే రెండుని అధిగమించాలి.
త్రిగుణములను అర్థం చేసుకొని వాటిలో ఉంటూ, వాటికి అంటుకుండా త్రిగుణాతీత స్థితిలో ఉంటే మూడుని అదిగమించవచ్చు.
అంతః కరణను శుద్ది చేసుకుంటూ, వాటి ద్వారా చతుర్విధ పురుషార్ధాలను సాధించుకోవాలి అప్పుడు నాలుగు ని అధిగమించాలి.
ప్రపంచంలో ఉన్న పంచ భూతములును అర్థం చేసుకొని వాటితో సమన్వయముతో జీవించకలిగితే, అప్పుడు ఐదు ని అధిగమించాలి.
ఇక మనలో దాగి ఉన్న ఆరు శత్రువులు ఉన్నారు కదా, అవే కామాధులు. వీటిని జయించిన నాడు మనం ఆరు ని అధిగమించాలి.
సప్త వ్యసనములను జయించి, సప్త చక్రముల పై ఆదిపత్యం ద్వారా ఏడుని అధిగమించాలి.
అష్ట విదాత్మకమైన ప్రకృతిని అర్థం చేసుకుని వాటి సహకారాన్ని తీసుకొంటు జీవించుకోవాలి. ఇలా ఎనిమిది ని అధిగమించాలి.
ఈ సృష్టి యావత్తు పరమాత్మ తో కూడిన అష్ట విధ ప్రకృతి అంటే మొత్తం తొమ్మిది. ఇది అర్థం చేసుకుంటే తొమ్మిదిని అధిగమించాలి.
ఇలా అన్ని సాధిస్తే మనకి విజయం లభించినట్లే, అదే నిజమైన విజయ దశమి.