Menu Close

Nee Navvula Telladananni Lyrics In Telugu – Aadhi – నీ నవ్వుల తెల్లదనాన్ని లిరిక్స్

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Nee Navvula Telladananni Lyrics In Telugu – Aadhi – నీ నవ్వుల తెల్లదనాన్ని లిరిక్స్

SUBSCRIBE FOR MORE

నీ నవ్వుల తెల్లదనాన్ని… నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ…
నీ పెదవుల ఎరద్రనాన్ని… గోరింటాకే అరువడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ…
నీ కోకను సీతాకోక… నీ పలుకులు చిలకల మూక
నీ చూపును చంద్రలేఖ… నీ కొంగును ఏరువాక
బదులిమ్మంటు బ్రతిమాలాయి… ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
అసలివ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ…
నీ నవ్వుల తెల్లదనాన్ని… నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ…

నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని… మొగ్గలకైనా ఇవ్వద్దు
నా వైపే మొగ్గిన నీకైతే… అవి మొత్తం ఇవ్వచ్చు
నీ బాసల్లోని తియ్యదనాన్ని… తెలుగు భాషకే ఇవ్వద్దు
నాకోసం వేచే నీకైతే… అది రాసిగా ఇవ్వచ్చు
భక్తి శ్రద్ధ ఏదైనా… భగవంతునికే ఇవ్వద్దు
భక్తి శ్రద్ధ ఏదైనా… భగవంతునికే ఇవ్వద్దు
నీకే మొక్కే నాకే ఇవ్వచ్చూ… ఆ ఆ ఆఆ

నీ నవ్వుల తెల్లదనాన్ని… నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ…
నీ పెదవుల ఎరద్రనాన్ని… గోరింటాకే అరువడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ…

నీ అందం పొగిడే అవకాశాన్ని… కవులకు సైతం ఇవ్వద్దు
మరి నాకై పుట్టిన నీకైతే… అది పూర్తిగ ఇవ్వచ్చు
నీ భారం మోసే అదృష్టాన్నే… భూమికి సైతం ఇవ్వద్దు
నేనంటే మెచ్చిన నీకైతే… అది వెంటనే ఇవ్వచ్చు
నిను హత్తుకు పోయే భాగ్యాన్ని… నీ దుస్తులకైనా ఇవ్వద్దు
నిను హత్తుకు పోయే భాగ్యాన్ని… నీ దుస్తులకైనా ఇవ్వద్దు
నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చూ… ఆ ఆఆ ఆ

నీ నవ్వుల తెల్లదనాన్ని… నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
నీ పెదవుల ఎరద్రనాన్ని… గోరింటాకే అరువడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ

నా వాకిట ముగ్గులు నీకే… నా దోసిట మల్లెలు నీకే
నా పాపిట వెలుగులు నీకే… నా మాపటి మెరుపులు నీకే
ప్రాయం ప్రణయం ప్రాణం నీకే… ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా
బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా.. ..

Nee Navvula Telladananni Lyrics In Telugu – Aadhi – నీ నవ్వుల తెల్లదనాన్ని లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading