Nee Navvula Telladananni Lyrics In Telugu – Aadhi – నీ నవ్వుల తెల్లదనాన్ని లిరిక్స్
SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL
నీ నవ్వుల తెల్లదనాన్ని… నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ…
నీ పెదవుల ఎరద్రనాన్ని… గోరింటాకే అరువడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ…
నీ కోకను సీతాకోక… నీ పలుకులు చిలకల మూక
నీ చూపును చంద్రలేఖ… నీ కొంగును ఏరువాక
బదులిమ్మంటు బ్రతిమాలాయి… ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
అసలివ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ…
నీ నవ్వుల తెల్లదనాన్ని… నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ…
నీ నవ్వుల తెల్లదనాన్ని… నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ…
నీ పెదవుల ఎరద్రనాన్ని… గోరింటాకే అరువడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ…
నీ అందం పొగిడే అవకాశాన్ని… కవులకు సైతం ఇవ్వద్దు
మరి నాకై పుట్టిన నీకైతే… అది పూర్తిగ ఇవ్వచ్చు
నీ భారం మోసే అదృష్టాన్నే… భూమికి సైతం ఇవ్వద్దు
నేనంటే మెచ్చిన నీకైతే… అది వెంటనే ఇవ్వచ్చు
నిను హత్తుకు పోయే భాగ్యాన్ని… నీ దుస్తులకైనా ఇవ్వద్దు
నిను హత్తుకు పోయే భాగ్యాన్ని… నీ దుస్తులకైనా ఇవ్వద్దు
నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చూ… ఆ ఆఆ ఆ
నీ నవ్వుల తెల్లదనాన్ని… నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
నీ పెదవుల ఎరద్రనాన్ని… గోరింటాకే అరువడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
నా వాకిట ముగ్గులు నీకే… నా దోసిట మల్లెలు నీకే
నా పాపిట వెలుగులు నీకే… నా మాపటి మెరుపులు నీకే
ప్రాయం ప్రణయం ప్రాణం నీకే… ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా
బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా.. ..
Nee Navvula Telladananni Lyrics In Telugu – Aadhi – నీ నవ్వుల తెల్లదనాన్ని లిరిక్స్