Menu Close

Nava Manmadhuda Song Lyrics In Telugu – Pelli Sandadi

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Nava Manmadhuda Song Lyrics In Telugu – Pelli Sandadi

నవమన్మధుడా, అతిసుందరుడా… నువ్వు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు… ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడా ప్రియమాధవుడా… నువ్వువలచిన ఆ ప్రియుడు
చెల్లీ ఎవరే అతగాడు… తుళ్ళే నీ వయసుకి జతగాడు

గోరు వెచ్చని ఊపిరే వేయి వేణువులూదగా
తొలిముద్దు… చిందించెనే
వీణ మీటిన తీరుగా… ఒళ్ళు ఝల్లని హాయిగా
బిగి కౌగిలందించెనే…
రతి రాగాలే శృతి చేసాడే… జత తాళాలే జతులాడాడే
తనువంత వింత సంగీతమేదో పలికే

అక్కా ఎవరే అతగాడు… ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడా ప్రియమాధవుడా… నువ్వువలచిన ఆ ప్రియుడు
చెల్లీ ఎవరే అతగాడు… తుళ్ళే నీ వయసుకి జతగాడు

వాడి చూపుల దాడితో… వేడి ఆవిరి రేపెనే
నిలువెల్ల తారాడెనే…
చాటుమాటుల చోటులో… ఘాటుకోరికలూపెనే
ఒడి చేరి తలవాల్చెనే…
జడ లాగాడే కవ్వించాడే… నడుమొంపుల్లో చిటికేశాడే
అధరాలతోనే శుభలేఖ రాసే మరుడే
చెల్లీ ఎవరే అతగాడు… తుళ్ళే నీ వయసుకి జతగాడు

నవమన్మధుడా అతిసుందరుడా…నువ్వు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు…ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడా ప్రియమాధవుడా… నువ్వు వలచిన ఆ ప్రియుడు

Like and Share
+1
3
+1
3
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading