Redmi TV జస్ట్ - 8000/-
Samsung Fridge 183 L జస్ట్ - 13000/-
LG వాషింగ్ మెషిన్ - జస్ట్ - 9000/-
Samsung phone at - 10000/-
realme Earbuds జస్ట్ - 900/-
Natural Remedies for Belly Fat – పొట్ట కొవ్వు తగ్గించుకోటానికి 10 ఆయుర్వేద చిట్కాలు
Natural Remedies for Belly Fat: పొట్టలో కొవ్వు అధికంగా పెరిగి , సహజంగా జీర్ణాశయం చుట్టూ ఎక్కువ పేరుకుని బయటకి పొడుచుకువచ్చి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపటం మీరు గమనించే ఉంటారు. ఈ పొట్టలో పేరుకునే అధిక కొవ్వు కేవలం ఊబకాయులు,వృద్ధులలో మాత్రమే కన్పించదు. ఈ కాలంలో అన్నివయస్సుల వారిలో ఈ సమస్య కన్పిస్తోంది.
బరువు కొలుచుకోవడానికి Weight Machine
అమెజాన్ ఆఫర్ – జస్ట్ 459 – Buy Now
అనేక శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఈ అధిక పొట్ట,దానిలోని అవయవ కొవ్వు నేరుగా ఎక్కువశాతం టైప్ 2 డయాబెటిస్ కి కారణమవుతోంది. అంతేకాక ఇది హృద్రోగ సమస్యలు,ఆస్తమా,అధిక బిపి, పిసిఒడి వంటి హార్మోనల్ సమస్యలకి ప్రధాన కారకం.
ఈ అధికపొట్ట బరువు వల్ల మోకాళ్ళపై ఒత్తిడి పెరిగి కీళ్ళనొప్పులు కూడా వస్తాయి. ఇలా ఇన్ని అనారోగ్యాలకు మూలకారణం కావటమే కాక, శారీరకంగా ఆకర్షణీయంగా కన్పించటానికి కూడా అడ్డు రావటంతో అధిక పొట్టను తగ్గించుకునే వివిధ మార్గాల వెతుకుదల అవసరం ఎంతో పెరిగింది.
ఆయుర్వేదం మరియు దాని సానుకూల సహకారం ఆధునిక వైద్య విధానంలో బేరియాట్రిక్స్ వంటి శాస్త్రాల సాయంతో ఊబకాయానికి అనేక రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చినా, ఆయుర్వేదం ఒకటే దానికి ప్రత్యామ్నాయం కాకపోయినా,ఖరీదు, వనరుల కొరత కారణంగా ప్రజలు ఎక్కువ దుష్ప్రభావాలు లేని సులభమైన జీవన విధాన మార్పులవైపే ఆసక్తి చూపిస్తున్నారు.
ఏ పద్ధతిలోనైనా కొవ్వుని కరిగించటంలో మొదటి అడుగు జీవనవిధానంలో మార్పు.ఇది కేవలం కొంతకాలానికి సంబంధించినది కాదు.జీవనకాల నిర్ణయం.ఆయుర్వేదం ప్రాచీన భారత వైద్యవిధానం. ఆయుర్వేదాన్ని ప్రతిచోటా ముఖ్యంగా వ్యాధినిరోధానికి సంబంధించిన వైద్యంగా గుర్తించినా అది జీవితంలోని ప్రతిదశలో పాటించాల్సిన జీవనవిధానాన్ని ఎక్కువ సూచిస్తుంది.
అందువల్ల జీవనవిధాన అసమతుల్యత వల్ల వచ్చే ఈ అధికపొట్ట,స్థూలకాయం వంటి సమస్యలకు తిరిగి సమతుల్య జీవనాన్ని సాధించటంలో ఆయుర్వేదం సహకరిస్తుంది. అంతేకాక ఆయుర్వేదంలో వాడే ఆహారపదార్థాలు,మూలికలు సహజంగా మన వంటింట్లోనో,పెరట్లోనో సులభంగా లభిస్తాయి. కాబట్టి ఆరోగ్యకర జీవన విధానాన్ని ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఇంటిలోనే సాధించే అవకాశం ఉంది.
తీపి పదార్థాలు: తీపి పదార్థాలు, కార్బొహైడ్రేట్లు పూర్తిగా తగ్గించండి. 2 చెంచాల తేనెను ప్రతిరోజూ పొద్దునే గ్రీన్ టీతో పాటు తీసుకోండి.
నీరు త్రాగండి: లేచినప్పటి నుంచి ప్రతి గంటకి ఒక గ్లాసు చొప్పున నీరు త్రాగండి. పొద్దున్న రెండు,రాత్రి ఒకటి చొప్పున పళ్ళు తినండి.
కరివేపాకు: కరివేపాకును ఆహారంలో కానీ,విడిగా మజ్జిగలో కానీ తీసుకోండి. కరివేపాకు చెడ్డ కొవ్వును తగ్గించి మంచి కొవ్వును పెంచటంలో సాయపడుతుంది.
త్రిఫల: త్రిఫలను చూర్ణంగా లేదా టాబ్లెట్ల రూపంలో ఐనా వాడండి. ఇది మంచి జీర్ణకారిణిగా, శరీరంలో విషపదార్థాలను తొలగించి శరీరాన్ని శక్తివంతం చేస్తుంది.ఎలాంటి వారైనా దీన్ని తీసుకోవచ్చు.
సోంఫు: సోంఫు (సోపు లేదా fennel,పెద్ద జీలకర్ర వంటి పదార్థం) ; ఇది వంటింట్లోనే దొరికే మరొక అద్భుత పదార్థం.ఇది అధికబరువును తగ్గిస్తుంది. కడుపును నిండుగా ఉండేట్లు చేసి ఆకలిని తగ్గిస్తుంది. కొవ్వును సహజంగా నిర్మూలించే పదార్థం. జీర్ణక్రియ,శ్వాసక్రియలను మెరుగ్గా పనిచేసేట్లు చేస్తుంది. అధికపొట్ట తొలగించుకోటానికి దీన్ని వేయించి తినవచ్చు లేదా అరస్పూను సోపును గోరువెచ్చని నీటితో రోజూ తీసుకోవచ్చు. ఒకటి రెండు వారాల్లో మీకు ఫలితం కన్పిస్తుంది.
మెంతులు: మెంతులు కొవ్వును కరిగించి శరీరంలో పీల్చుకునే శక్తి పెంచుతుంది. ముఖ్యంగా కాలేయంలో కొవ్వును కరిగిస్తాయి.
అవిసె గింజల: అవిసె గింజల వాడకాన్ని మీ పళ్లరసాల్లోనో,ఆహారంలోనో పెంచండి. ఎక్కువ ఫైబర్,ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండి తొందరగా కొవ్వును కరిగిస్తాయి.
ఆముదం నూనె: మీ కూరలను ఆముదం నూనె లేదా కొబ్బరినూనెతో వండుకోండి. ఆముదం త్వరగా బరువు తగ్గించటంలో సాయపడుతుంది.
దాల్చిన చెక్క: ఒక గ్లాసులో ఒక చెంచాడు దాల్చిన చెక్క పొడిని వేసి మరగబెట్టండి.ఆ నీటిని వడగట్టి అందులో ఒక చెంచాడు తేనె కలిపి ప్రతిరోజూ ఉదయం తాగండి. అధికపొట్టకి ఫలితం కన్పిస్తుంది.
వ్యాయామాలు: ఈ పైన చిట్కాలే కాక అధిక పొట్ట కరిగించుకోటానికి ఎక్కువ పీచుపదార్థాలు తీసుకుంటూ ఉండండి.మద్యానికి దూరంగా ఉండండి.మానసిక ఒత్తిడిని యోగా,ధ్యానంతో తగ్గించుకోండి. గుండె వేగాన్ని పెంచే ఏరోబిక్ వ్యాయామాలు చేస్తుండండి.తగినంత నిద్రపోండి.
Weight Loss Diet in Telugu – 7 రోజుల పాటు ప్రత్యేకమైన డైట్ ప్లాన్
Reasons for Belly Fat in Women and Men – పొట్ట రావడానికి కారణాలు
బరువు కొలుచుకోవడానికి Weight Machine
అమెజాన్ ఆఫర్ – జస్ట్ 459 – Buy Now
గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించ బడినది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. వీటిని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.