ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Moral Stories in Telugu Text – ఎవరిది ఈ పాపం ..?
Moral Stories in Telugu Text
భారత దేశాన ఓ సుసంపన్నమైన రాజ్యం, ఆ రాజ్యానికి రాజు చాలా మంచి వాడు, సేవాగుణం కలవాడు. ఆయన ప్రతి రోజూ పేద బ్రాహ్మణులకు మద్యాహ్న భోజనం వండించి పెట్టేవాడు.
ఒక రోజు యధావిధిగా భోజనం వండించే ఏర్పాట్లు చేస్తున్నాడు. అదే సమయం లో ఆకాశం లో ఎగురుతున్న ఒక గద్ద కాళ్ళతో పట్టుకున్న పాము నోటినుండి విషం వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నం బేసిన్ లో పడింది. అది ఎవరూ గమనించలేదు.
ఆభాగం ఒక బ్రాహ్మణుడు తిన్నాడు. అది తినడం వలన అతడు చనిపోయాడు. ఈ వార్త రాజుగారికి చేరింది. ఆయన చాలా దుఃఖించాడు. మేలు చెయ్యబోతే ఇలా కీడు జరిగింది అని ఆయన చింతించాడు.
ఇప్పుడు బ్రాహ్మణుడు చనిపోవడానికి కారణం ఎవరు?
రాజా ..?
వంటవాడా ..?
పామా ..?
గద్దా ..?
వడ్డించిన వ్యక్తా ..?
వీరిలో ఎవరూ కావాలని ఆ బ్రాహ్మణుడిని చంపలేదు.
ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి ..?
చిత్రగుప్తులవారు యమ ధర్మరాజును అడిగారు..
ఇది ఇలా ఉంటె మర్నాడు దారినే పోతున్న బ్రాహ్మణులు కొందరు అన్నదానం జరిగే చోటును చెప్పమని ఒక వనితను అడిగారు. ఆమె వారికీ దారిని చూపుతూ “బాబూ! జాగ్రత్త మా రాజు గారికి బ్రాహ్మణులు అంటే పడదు. నిన్ననే ఒకాయనను విషం పెట్టి చంపేశారు”. మీ రోజులు బాగున్నాయో లేదో ? అంది.
యమధర్మరాజు గారు “చిత్రగుప్తా..! మొత్తం పాపం అంతా ఈమె ఖాతాలో వెయ్యి.
“యాదృచ్చికంగా జరిగే పనులకు వ్యక్తులను నిందించే వారికి ఆ మొత్తం కర్మ ఫలం కలుగుతుంది అని ధర్మం.” అన్నారు.
అద్భుతమైన కథ తప్పకుండా షేర్ చెయ్యండి.