ఏ మాట వెనుక ఏ పరమార్థం ఉందో – Moral Stories in Telugu
ఒక పెద్దాయన బాగా ఆకలితో ఒక హోటల్ కు వచ్చారు.సర్వర్ ని పిలిచి భోజనం ఎంత అని అడిగారు. “50రూ” అని చెప్పాడు సర్వర్.
ప్లేట్ మీల్స్ లేదా ? అన్నారు | పెద్దాయన.
“లేదు…పెరుగు లేకుండా తింటే 45 రూపాయలు… పెరుగుతో ఐతే 50 రూపాయలు” అని విసుగ్గా సమాధానం ఇచ్చాడు సర్వర్… “సరే ! పెరుగు లేకుండా భోజనం తీసుకుని రా… అన్నారు పెద్దాయన .బాగా మాసిపోయిన సంచిలో నుంచి డబ్బు తీసి జేబులో పెట్టుకున్నారు .భోజనం చేసాక జేబులో నుండి 50 రూపాయలు తీసి సర్వర్ కు ఇచ్చారు.సర్వర్ విసుగ్గా వెళ్లి 5 రూపాయలు వెనక్కి ఇచ్చాడు.

ఆ 5 రూపాయలు నువ్వే ఉంచుకో ! నీకు ఇవ్వడానికే నేను పెరుగుతో తినలేదు. నీకు ఇవ్వడానికి నాదగ్గర ఇంక డబ్బులు లేవు. నీకు ఆ 5 రూపాయలు ఇవ్వడానికే నేను తక్కువ రేటు భోజనం లేదా అని అడిగాను తమ్ముడూ ! ” ‘ అంటూ | వెళ్లిపోయారు.
సర్వర్ కళ్ళల్లో కన్నీరు.
విసుక్కున్నందుకు తనలో తానే కుమిలిపోయాడు.
అందుకే రూపం చూసి ఎదుటివారిని చులకన చేయకండి అంటారు .
అమూల్యమయిన మూడు నీతి సూక్తులు – Moral Stories in Telugu
ఎదుర్కుంటున్న సమస్యలన్నీ నిన్ను నువ్వు బలపరుచుకునేందుకే – Moral Stories in Telugu Text
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com