Menu Close

Moral Stories in Telugu – మోరల్ స్టోరీస్

Lowest Price - Shop Now

32 Inch TV - High Quality Screen - Android - Dolby

మూడునాళ్ళ ముచ్చట – Telugu Stories

ఒక ఇంటిలో రాగిలోటా వుండేది. ఇంటిలో అందరూ దానితో నీళ్ళు తాగేవారు. ఆ ఇంటిలో ఒక చిన్నబాబు వున్నాడు. ఆ బాబు దానితో బాగా ఆడుకునేవాడు. అది చూసి రాగిలోటా చాలా సంతోషించేది. ఒక రోజు వాళ్ళింటికి బంధువులు వచ్చారు. తమవెంట ఒక అందమైన గాజులోటా తెచ్చారు. దానిని బాబుకు బహుమతిగా ఇచ్చారు.

దాని మీద రంగురంగుల పూలబొమ్మలు వున్నాయి. అది చూసి బాబుకు చాలా సంతోషం వేసింది. రాగిలోటా వదిలేసి దానితోనే నీళ్ళు తాగడం మొదలు పెట్టాడు.
అది చూసి గాజులోటాకు బాగా పొగరు ఎక్కింది. రాగిలోటాను చూసి “నేను చూడు ఎంత ముద్దుగా, ముచ్చటగా వున్నానో. నా చక్కదనం ముందు నువ్వు కొంచం గూడా పనికిరావు” అంది.

ఆ మాటలకు రాగిలోటా నవ్వుతా “నిజమే నువ్వు చాలా అందంగా వున్నావు. కానీ నీ కులుకంతా మూడునాళ్ళే. అందమొక్కటే సరిపోదు. బలం గూడా వుండాలి” అంది. ఒకరోజు బాబు నీళ్ళు తాగుతుంటే చేయి జారి కిందపడింది. అంతే భళ్ళున పగిలిపోయింది. ఆ చప్పుడుకు అమ్మ వంటింటిలోంచి పరుగెత్తుకుంటా వచ్చింది. గాజుముక్కలన్నీ ఏరి చెత్తడబ్బాలో పాడేసింది.

అది చూసి రాగిలోటా “నేను చెప్పలేదూ… నీదంతా మూడునాళ్ళ ముచ్చటే అని. నీ మీద పూలరంగు పోయి అందం తగ్గినా, చేయి జారి కిందపడినా నువ్వు చేరేది చెత్తకుప్పకే. అందుకే అందంగా వున్నానని పొగరుతో ఎగరగూడదు” అంది. పగిలిన గాజులోటా సిగ్గుతో తలదించుకొంది.

Telugu Stories
Stories in Telugu
Moral Stories in Telugu
Telugu Moral Stories

అన్నం పెట్టే చేతిని కాపాడుకో – Telugu Stories

ఒక రైతుకు వూరిబైట కొంత పొలముంది. సరదాగా దానిలో రకరకాల పూలమొక్కలు తెచ్చి నాటాడు. కొద్దిరోజులకే అవి పెరిగి పెద్దగయి రంగురంగుల పూలు పూశాయి. ఆ ఊరికి పక్కనున్న అడవిలో ఒక తేనెటీగల గుంపు వుంది. అవి తేనె కోసం వెదుకుతా వెదుకుతా ఈ తోటవైపుకు వచ్చాయి. “అబ్బ… ఎంత ముచ్చటగా వుందీ తోట. అడుగడుగునా ఒక పూవు వుంది. పూవు పూవుకూ తీయని తేనె వుంది. ఎంత తాగినా ఇంకా ఇంకా దొరుకుతానే వుంటాది. ఈ చోటును వదలగూడదు” అనుకున్నాయి.

ఆ తేనెటీగలన్నీ తోట పక్కనే వున్న ఒక పెద్ద వేపచెట్టు పైన తేనెతుట్టె పెట్టుకున్నాయి. హాయిగా రోజూ నచ్చిన పూవుపై వాలి కడుపు నిండా తాగి తుట్టె నిండా నింపసాగాయి. ఒకరోజు ఆ తోటలోకి ఒక ఎద్దు వచ్చింది. ఒక్కొక్క మొక్కనే పెరుక్కోని కమ్మగా తినసాగింది. ఎలా తింటా వుందో… మనం వెంటనే పోయి దాన్ని తోట నుంచి తరిమివేద్దాం. తోటను కాపాడుకుందాం” అంది. ఆ మాటలకు మిగతావి “అరే… నువ్వు చిన్నపిల్లవి. ఎందుకు మనకు లేనిపోని గొడవలు. తోట సంగతి తోట యజమాని చూసుకుంటాడు. అనవసరమైన వాటిలో వేలు పెట్టొద్దు” అన్నాయి. దాంతో ఆ చిన్నపిల్ల నోరుమూసుకుంది.

ఎద్దు కడుపు నిండా తిని వెళ్ళిపోయింది. తరువాత రోజు అది మరో పది ఎద్దులను ఆ తోటలోకి పిలుచుకొని వచ్చింది. అవన్నీ ఒక్కసారిగా పూలమొక్కల మీదకు దుంకాయి. కనబడిన వాటిని కనబడినట్టు తింటా మిగిలినవన్నీ తొక్కిపడేయ సాగాయి. అందంగా కళకళలాడతా వున్న ఆ తోట గంట దాటేసరికి మొత్తం వల్లకాడులా మారిపోయింది. సాయంకాలం తోటకు వచ్చిన రైతు తోటను చూసి అదిరిపడ్డాడు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఐనా ఎవరూ కాపలా లేని ఈ వూరి బైట పూలతోట వేయడం నాదే బుద్ధితక్కువ అనుకున్నాడు. ఆ తోటను పట్టించుకోవడం మానివేశాడు. దాంతో కొద్ది రోజుల్లోనే అక్కడక్కడ మిగిలిన మొక్కలు కూడా వాడిపోయాయి.

ఆ తోట మీదనే ఆధారపడి బతుకుతా వున్న తేనెటీగలకు దిక్కు తోచలేదు. చుట్టుపక్కల ఎక్కడ వెదికినా కొంచం గూడా ఆహారం దొరకలేదు. దాంతో అవన్నీ చిన్న తేనెటీగతో “సోదరా… వూరయినా, తోటయినా, అందరూ మనది అనుకున్నప్పుడే పచ్చగా వుంటాది. ఈ తోట మీద ఆధారపడి బతుకుతా వుండి కూడా ఈ తోట మనది కాదనుకున్నాం. కళ్ళ ముందే నాశనమవుతున్నా కాపాడుకోలేక పోయాం . మొదట వచ్చిన ఎద్దును అప్పుడు అదిలించి వుంటే ఈ రోజు ఇలా కడుపు చేత పట్టుకోని బజారున పడవలసిన అవసరం తప్పేది. మేం చేసిన తప్పును క్షమించు” అన్నాయి. అవన్నీ కళ్ళనీళ్ళతో ఆహారం కోసం వెదుక్కుంటా మరోచోటుకు బైలుదేరాయి.

Telugu Kathalu
Telugu Hot Stories
Neethi Kathalu in Telugu

పొద్దు తిరుగుడు పువ్వు – Telugu Stories

ఒక ఊరిలో ఒక తోట వుంది. అందులో అందమైన పూలు వున్నాయి. ఒక సీతాకోకచిలుక సంబరంగా ఒక పూవు పై వాలింది. “ఏయ్… దిగు దిగు… ఇంకేం పని లేదా నీకు. నా అందమైన రెక్కలు ఊడిపోయేలా వున్నాయి నీ వల్ల” గట్టిగా కంపరంగా చిరాకుగా అరిచింది పొద్దుతిరుగుడు పువ్వు. పాపం… సీతాకోకచిలుక మొగం వాడిపోయింది. మౌనంగా తల దించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

పొద్దుతిరుగుడు పూవుకి భయపడి అటువైపుకి వెళ్లడం మానివేశాయి సీతాకోక చిలుకలు, తూనీగలు, తేనెటీగలు. నెల తిరిగేసరికి తోటలో అన్ని పూవులు పళ్ళుగా మారాయి. కొన్ని పూవుల్లో విత్తనాలు వచ్చేశాయి. మరికొన్ని భూమిలో పడి మొలకెత్తాయి. కొత్త మొక్కలు చిగురించాయి. కానీ పొద్దుతిరుగుడు పూవు ఎలా వున్నది అలాగే ఉండిపోయింది. అప్పుడు దానికి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది.

“అయ్యో… అహంకారంతో అన్నింటినీ దూరం చేసుకున్నాను. మరికొద్ది రోజుల్లో నా రెక్కలు వాడిపోతాయి. రాలిపోతాయి. ఒంటరిగా మిగిలిపోతాను. ఎంత పొరపాటు చేశాను” అనుకొంది. దాని కళ్ళలోంచి ఒక్కొక్క నీటి బొట్టు కిందికి కారసాగింది. అంతలో అక్కడికి ఒక చిన్న సీతాకోకచిలుక వచ్చింది.

“చూడు… మేమంతా మీ తేనె తాగుతాం. మా కాళ్ళకు అంటిన పుప్పొడి ఇంకొక పూవులో వదులుతాం. మీ వల్ల మాకు కడుపు నిండుతుంది. అలాగే మా వల్ల మీకు కడుపు పండుతుంది. తిట్టుకున్నా కొట్టుకున్నా… రమ్మన్నా పొమ్మన్నా… మన అనుబంధం ఎప్పటికీ మారదు. ఇంకా సమయం మించిపోలేదు. అన్నింటినీ పిలువు. నీ కమ్మని తేనెతో అందరికీ విందు చెయ్యి” అంది. పొద్దు తిరుగుడు పువ్వు చిన్నగా నవ్వింది. రేకులన్నీ విప్పి మనసారా అన్నిటినీ రమ్మని పిలిచింది.
అంతే… సంబరంగా సీతాకోక చిలుకలు, తేనెటీగలు, తూనీగలు దానిని చుట్టుముట్టాయి.

Telugu Romantic Stories
Stories Telugu
Short Stories in Telugu
Small Stories in Telugu

మానవత మరచిన నగరం – Telugu Stories

“ఏం సీతాకోక చిలుకా… మొగమంతా అలా వాడిపోయింది. చానా దిగులుగా, నీరసంగా కనబడతా వున్నావు. ఏమైంది” పలకరించింది బుజ్జిపిట్ట.
“ఏం చేద్దాం మామా… రెండు రోజుల నుంచీ తేనె తాగుదామంటే ఒక్క పువ్వు కనబడక అల్లాడుతా వున్నా. ఇది వూరా, వల్లకాడా” అంది సీతాకోకచిలుక.
“అంటే ఈ నగరానికి నాలాగే నువ్వూ కొత్తన్నమాట. ఎలా వచ్చావు ఇక్కడికి” అడిగింది బుజ్జిపిట్ట.

“నిన్న అడవిలో ఒక బస్సు ఆగింది. లోపల ఎలా వుంటుందో చూద్దామని దూరినా. అంతలో అది ఒక్కసారిగా కదిలింది. భయంతో ఒక పెట్టె వెనుక దాక్కున్నా. తరువాత రోజుకంతా ఇదిగో ఇలా ఈ నగరంలో పడినా” అంది సీతాకోకచిలుక విచారంగా, “ఒకప్పుడు ఇక్కడ గూడా దారికి రెండువైపులా ఏదో ఒక పెద్దచెట్టు కనబడేదట. అడుగడుగునా పూలమొక్కలు వుండేవట. కానీ ఈ మనుషులు రహదారులు పెద్దగా చేయడం కోసం అన్నీ కొట్టేశారు. మేడల మీద మేడలు కడతా పూలమొక్కలు తీసేశారు. సిమెంటు, తారులతో భూమినంతా కప్పేశారు. దాంతో తినడానికి తిండిలేక మనలాంటి చిన్న జీవులన్నీ వలసపోయాయి” చెప్పింది బుజ్జిపిట్ట.

అంతలో ఆకాశంలో కొన్ని కొంగలు దూరంగా ఎగురుతా కనిపించాయి. అది చూసిన బుజ్జిపిట్ట “అదిగో… ఆ కొంగలు చూడు. అక్కడ కొంగలున్నాయంటే ఖచ్చితంగా అక్కడ ఏ నదో, చెరువో వుంటుంది. మనమూ అక్కడికి పోదాంపద. ఆహారం దొరుకుతుంది” అంది సంబరంగా. “ఆకలితో నాకు ఇప్పటికే కళ్ళు తిరుగుతా వున్నాయి. ఇక నేనెగరలేను. నువ్వన్నా పోయి హాయిగా బదుకు” అంటూ కళ్ళనీళ్ళతో కిందపడిపోయింది సీతాకోకచిలుక.

“పక్కనున్న వాళ్ళు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతా వున్నా పట్టించుకోకుండా వెళ్ళడానికి నేనేమన్నా మనిషిని అనుకుంటున్నావా. లెయ్ లెయ్ నావీపు మీదకు ఎక్కి గట్టిగా పట్టుకో. కన్నుమూసి తెరిచేలోగా రయ్యిమని దూసుకొని పోతా. నిన్ను బతికించుకొనే పూచీ నాది” అంది బుజ్జిపిట్ట. సీతాకోకచిలుక సంబరంగా బుజ్జిపిట్ట పైకి ఎక్కింది. వెంటనే అది విల్లు నుంచి వెలువడిన బాణంలాగా కొంగలు కనబడుతున్న వైపు దూసుకొని పోయింది.

Chanda Mama Kathalu
Telugu Short Stories
Panchatantra Stories in Telugu
Short Moral Stories in Telugu

రామేశం – సోమేశం – Telugu Stories

ఒక ఊరిలో సోమేశం , రామేశం అని ఇద్దరు పక్క పక్క ఇళ్లలో వుండేవారు. ఇద్దరూ చాలా మంచివాళ్ళు. సోమేశం ఊరిలో వుంటూ అందరినీ అవసరాలలో ఆదుకుంటూ సహాయపడుతూ వుండేవాడు. రామేశం సాధువుగా మారిపోయి ఊరి బైట కుటీరంలో నివసించేవాడు. రోజూ భగవంతున్ని తలచుకుంటూ , తపస్సు చేసుకుంటూ , దైవ చింతనతో కాలం గడిపేవాడు.

కొంతకాలానికి ఇద్దరూ ఒకేరోజు చనిపోయారు. దైవ దూతలు వారిద్దరినీ దేవుని దగ్గరికి తీసుకుపోయారు. దేవుడు చిరునవ్వుతో సోమేశాన్ని పిలిచి పక్కన కూచోబెట్టుకున్నాడు. రామేశాన్ని దూరంగా వుంచాడు. అది చూసి రామేశం బాధగా… దేవా నేను ఎప్పుడూ అబద్దం ఆడలేదు. పాపం చేయలేదు. ఎవరినీ మోసం చేయలేదు. ఎప్పుడూ నిన్నే తలచుకుంటూ వుండేవాన్ని. అలాంటి నన్ను దూరంగా వుంచి సోమేశాన్ని ఒక్కన్నే ఎందుకు దగ్గరకు తీసుకున్నారు. ఏమిటి నేను చేసిన తప్పు అని అడిగాడు.

దేవుడు చిరునవ్వు నవ్వాడు. నిజమే రామేశం నువ్వు చాలా మంచివానివే. కానీ నీ మంచితనం వల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగం లేదు. కానీ సోమేశం
అలా కాదు. అందరికీ తలలో నాలుకలా వుంటూ సహాయం చేసేవాడు. నాకు కావలసింది ముక్కు మూసుకొని మౌనంగా తపస్సు చేసుకొనేవాళ్ళు కాదు. జనాలకి సాయం చేసి ఆదుకునేవాళ్ళు అని చెప్పాడు. రామేశానికి ఆ మాటలతో తన తప్పు తెలిసివచ్చింది.

Telugu Story Books
Telugu Love Stories
Horror Stories in Telugu
Telugu Stories Writing

దుడ్డుకర్ర – Telugu Stories

ఒక అడవిలో ఒక గంధం చెట్టు దగ్గర ఒక వనదేవత నివసించేది. ఆమె చానా మంచిది. ఆ అడవి పక్కనే వుండే ఊరిలో నాగన్న అనే పేదవాడు వుండేవాడు. అతను రోజూ అడవిలోకి పోయి కట్టెలు కొట్టుకొని వచ్చి, వాటిని అమ్ముకొని బతికేవాడు. ఏ రోజు సంపాదన ఆ రోజుకి సరిపోయేది. ఒకసారి నాగన్న రోజూ ఇలా కట్టెలు కొట్టి ఎంతకాలమని బదుకుతాను. ఏదైనా ఒక విలువైన టేకు చెట్టుగానీ , గంధం చెట్టుగానీ దొరికితే ఒక ఆరు నెలలు హాయిగా బతకొచ్చు గదా అని అడవంతా వెదకసాగాడు. అలా ఒక నాలుగు రోజులు వెదుకుతే నాగన్నకు ఈ గంధం చెట్టు కనబడింది.

దాంతో నాగన్న సంబరంగా ఆ చెట్టు నరకబోయాడు. అంతలో వనదేవత అక్కడికి వచ్చి… ఈ గంధం చెట్టు నరకొద్దు. ఇది నా ఇల్లు. దానికి బదులుగా ఈ దుడ్డుకర్ర తీసుకో. దీంతో నువ్వు ఎవరిని కొడితే వాళ్ళ రోగాలు వెంటనే నయమవుతాయి. దాంతో వాళ్ళు సంతోషంగా నీ చేతిలో ఎంతో కొంత పెడతారు అంది.
నాగన్న కర్ర తీసుకొని అడవిలో తిరిగి బైలుదేరాడు. దారిలో గూని గురువయ్య ఎదురు పడ్డాడు. నాగన్న దుడ్డుకర్రతో వాని వీపు మీద ఒక్కటి వేశాడు. వెంటనే గురువయ్యకు గూని పోయింది. అతను సంబరంగా నాగన్న చేతిలో వంద వరహాలు పెట్టాడు. అది చూసి ఆహా… నెల రోజులు కట్టెలు కొడితే వచ్చే సంపాదన ఒక్క దెబ్బకే వచ్చేసింది అనుకున్నాడు.

నాగన్న సంబరంగా పోతావుంటే ఈసారి చాలా ధనవంతుడైన కుంటి కనకయ్య కనబడ్డాడు. దాంతో నాగన్న కర్ర తీసుకొని అతని కాలుపై ఒక్క దెబ్బ వేశాడు. అంతే అతని కాలు బాగైపోయింది. కనకయ్య సంబరపడిపోయి వేయి వరహాలు ఇచ్చాడు. అది చూసి వాడు ఆహా… ఒక్క దెబ్బకే ఒక్క ఏడాదికి సరిపోయే సంపాదన వచ్చింది అనుకున్నాడు.

వానిలో ఆశ మరింత పెరిగింది. ఎంత పెద్ద ధనవంతున్ని కొడితే అంత లాభం అనుకుంటా దుడ్డుకర్ర తీసుకొని పోసాగాడు. అంతలో వానికి వేటకు వచ్చిన రాజు కనబడ్డాడు. రాజుకు గూడా ఏదో ఒక రోగం వుండే వుంటుంది. ఒక్క దెబ్బతో అది పోతే కనీసం పదివేల వరహాలన్నా బహుమానంగా దొరుకుతుంది అనుకుంటా రాజు దగ్గరికి పోయాడు. ఒక్కసారిగా దుడ్డుకర్ర తీసి రాజు తలమీద ఒక్కటి వేశాడు. అంతే… రాజుకు ఎటువంటి రోగాలు లేకపోవడంతో ఆ దెబ్బకు తల పగిలి కింద పడ్డాడు. సైనికులు నాగన్నకు పట్టుకొని , వాని దగ్గరి ధనాన్ని గుంజుకొని కర్రను రెండు ముక్కలుగా విరిచి పడేశారు..

నాగన్న వనదేవత వరం గురించి ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు. తీసుకుపోయి కారాగారంలో బంధించారు. ఆశకు పోయి దుడ్డుకర్రను పోగొట్టుకోవడమే గాక ధనంగూడా పోయి కారాగారం పాలైనందుకు నాగన్న చాలా బాధ పడ్డాడు. తరువాత రోజు గూని గురువయ్య , కుంటి కనకయ్య వల్ల విషయం తెలుసుకున్న రాజు వానిమీద జాలిపడి వాని ధనం వానికిచ్చి విడిచి పెట్టాడు.

Stories in Telugu with Moral
Telugu Moral Stories PDF
Moral Stories in Telugu PDF
Tenali Ramakrishna Stories in Telugu

అందులో సందేహం ఎందుకు? – Telugu Stories

వెంకటప్ప ఒకసారి తిరునాలకు పోయాడు. ఆ తిరునాలలో ఒకడు చిలుకలను అమ్ముతావుంటే పోయి ఒక చిలుకను చూపించి “దీని ఖరీదు ఎంత?” అని అడిగాడు. వాడు “రెండు వేలు” అని చెప్పాడు. “ఏమిటీ ఈ చిలుక ఖరీదు రెండు వేలా” అన్నాడు వెంకటప్ప. వాడు నవ్వి “ఇది మామూలు చిలుక కాదు. మాటలాడే చిలుక. కావాలంటే దీని ఖరీదు రెండువేలు అవునో … కాదో …. దానినే అడుగు” అన్నాడు. వెంకటప్ప చిలుక దగ్గరకు పోయి

“నీ ఖరీదు రెండు వేలా?” అని అడిగాడు. వెంటనే ఆ చిలుక “అందులో సందేహం ఎందుకు” అంది. వెంకటప్ప సంబరంగా దానిని కొనుక్కోని ఇంటికి తీసుకోని పోయాడు. కానీ … ఆ చిలుక ఏం అడిగినా “అందులో సందేహమెందుకు” అనే ఒక్క మాట తప్పితే వేరే మాట పలకలేదు. దాంతో వెంకటప్పకు జరిగిన మోసం తెలిసిపోయింది. “చీ…. చీ…. నేనొట్టి తెలివితక్కువ వెధవను …. అందుకే మోసపోయాను” అన్నాడు.
వెంటనే ఆ చిలుక “అందులో సందేహమెందుకు?” అంది.

ఎరక్కపోయి ఇరుక్కుపోయా – Telugu Stories

ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. అది చాలా వేగంగా పరుగెత్తేది. దానితో పోటీపడి ఏ జంతువూ గెలిచేది కాదు. దాంతో ఎలుగుబంటికి బాగా పొగరెక్కింది. కనబడిన జంతువునల్లా పోటీకి రమ్మంటూ ఎగతాళి చేసేది. ఇదంతా ఒక కుందేలు చూసింది. దానికి ఎలాగయినా సరే ఎలుగుబంటి పొగరు అణచాలని అనిపించింది.

“ఒక రోజు ఎలుగుబంటితో నేను ఎటువైపు పరుగెత్తితే నీవు కూడా అటువైపు నా వెనకాలే నా అంత వేగంగా ఆగకుండా అరగంట పరుగెత్తగలవా” అని సవాలు చేసింది. “ఓస్… అదెంత పని. సరే” అంది ఎలుగుబంటి. ముందు కుందేలు, వెనుక ఎలుగుబంటి పరుగెత్తడం మొదలు పెట్టాయి. కుందేలు పుట్టల చుట్టూ, గుట్టల చుట్టూ సర్రు సర్రుమని పరుగెత్తసాగింది. ఎలుగుబంటిగూడా అంతే వేగంగా సర్రుమని పరుగెత్తసాగింది.

కుందేలు అలా పరుగెత్తుతా… పరుగెత్తుతా… వేగంగా… ఒక గొట్టంలోకి దూరింది. ఆ గొట్టం కుందేలుకన్నా లావుగా, ఎలుగుబంటి కన్నా సన్నగా ఉంది. ఎలుగుబంటి అదేమీ చూసుకోకుండా కుందేలు వెంటే అది గూడా సర్రుమని గొట్టంలోకి దూరింది. అంతే దాని నడుం దగ్గర గొట్టంలో ఇరుక్కుపోయింది. అటు ముందుకు పోలేక, ఇటు వెనుకకూ రాలేక లబోదిబోమనసాగింది.

అది చూసి జంతువులన్నీ ఒకటే నవ్వసాగాయి. ఆఖరికి ఎలుగుబంటి కాపాడమంటూ వాటిని వేడుకొంది. అవి జాలిపడి వెనక కాళ్ళు పట్టుకొని నెమ్మదిగా బైటకు లాగాయి. ఆరోజు నుంచి ఎలుగుబంటి వినయంగా అన్నిటితో కలసిమెలసి ఉండసాగింది.

Mahabharatham Stories in Telugu
Moral Stories Telugu
Pitta Kathalu
Akbar Birbal Stories in Telugu

దీపావళి – Telugu Stories

ఒక అడవిలో ఒక పాడుబడిన ఇల్లు వుండేది. ఆ ఇంటినిండా చాలా ఎలుకలు ఉండేవి. ఆ ఎలుకలకు ఒక రాజు వుండేవాడు. ఆ రాజు చాలా మంచివాడు. ఎలుకరాజు పాలనలో మిగతా ఎలకలన్నీ ఎటువంటి గొడవలు లేకుండా హాయిగా కలసిమెలసి వుండేవి. ఒకరోజు ఎక్కడినుంచి వచ్చిందోగానీ ఒక గండుపిల్లి ఆ ఇంటిలోకి వచ్చింది. రావడం రావడం కనబడిన ఎలుకని కనబడినట్టు చంపి తినడం మొదలు పెట్టింది. పాపం… ఎలుకలన్నీ భయపడి బయటకు రావడం మానుకున్నాయి.

పిల్లికూడా ఎటూపోకుండా అక్కడే కూచోని కాపలా కాయసాగింది. ఎలుకలకి ఏం చేయాలో తెలియలేదు. ఆకలితో ఎంత సేపని లోపల అలాగే వుండగలవు. దాంతో… కడుపుకాలి ఏదయినా బయటికి అడుగు పెడితే చాలు… అందుకోసమే కాచుకొనివుండే పిల్లి లటుక్కున ఎగిరి దానిమీదపడి గుటుక్కుమనిపించేది. “ముందు నుయ్యి…. వెనుక గొయ్యి” లాగుంది.

ఎలుకరాజు అదంతా చూసింది. ఆపదలొచ్చినప్పుడు ముందుండి కాపాడేవాడే గదా నాయకుడంటే. దాంతో ఏదో ఒకటి చేయాలి అనుకొంది. ఆరోజు బాగా చీకటి పడ్డాక , అన్నీ పండుకున్నాక నెమ్మదిగా తల బైటపెట్టి చూసింది. పిల్లి ఒక మూల గుర్రుకొడతావుంది.. ఎలుకరాజు అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు గాకుండా బైటకొచ్చింది.

పిల్లిని ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచించుకుంటా పక్కనే వున్న వూరికి చేరుకుంది. ఆరోజు దీపావళి. ఊరంతా ఎక్కడ చూసినా పిల్లలు టపాకాయలు, బాంబులు అంటించి సంబరంగా ఎగురుతా వున్నారు. ఆ బాంబులను చూడగానే ఎలుకరాజుకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఒక అంగడిలో దూరి ఒక వంకాయబాంబును నోటితో పట్టుకొని మట్టసంగా తిరిగి అడవిలోని తనింటికి చేరుకొంది.

ఎలుకలన్నింటినీ పిలిచి ఆ వంకాయబాంబును చూపించి తన ఆలోచన చెప్పింది. అన్నీ ఆనందంతో సరే అన్నాయి. వెంటనే కొన్ని ఎలుకలు మట్టి తీసుకొచ్చి అచ్చం ఎలుకమాదిరే ఒక బొమ్మ తయారుచేసి దానికి రంగులేసి, కడుపులో వంకాయబాంబు పెట్టి, వత్తిని తోక వెంబడి పెట్టాయి.
నెమ్మదిగా కలుగు నుండి ఆ బొమ్మ తల బైటకు పెట్టి ఒక ఎలుక కీసుకీసుమని అరిచింది. ఆ అరుపు వినగానే పడుకున్న పిల్లి వులిక్కిపడి లేచింది. దానికి ఎదురుగా కలుగులో ఎలుక తల కనబడింది.

పిల్లి వెంటనే ఆనందంగా ఎగిరి దాని మీదకు దూకి గట్టిగా దాని తల పట్టుకొంది. వెంటనే లోపలున్న ఎలుకలు దాని తోకకున్న వత్తిని అంటించాయి. అంతే… వంకాయబాంబు డామ్మని పేలింది. పిల్లి మూతి పచ్చడయింది.

Ramayanam Stories in Telugu
Funny Stories in Telugu
Telugu Stories Text
Real Stories in Telugu

తప్పు తెలుసుకున్న కోడిపుంజు – Telugu Stories

ఒక ఊరిలో ఒక రైతు వుండేవాడు. ఆ రైతు దగ్గర ఒక కోడిపుంజు వుండేది. ఆ పుంజు చాలా బలంగా, అందంగా వుండేది. దాంతో దానికి చాలా పొగరు. అందరూ తనని పొగడాలని కోరుకునేది. ఒక రోజు ఒక గాడిద దగ్గరికి పోయింది. “నేను చాలా చక్కగా పాడతాను కదా” అంది. గాడిద నవ్వి “పాటంటే కోయిలది. దానిలా ఈ లోకంలో ఎవరూ పాడలేరు” అంది.

కోడిపుంజుకు కోపం వచ్చి గాడిదతో మాటలాడ్డం మానివేసింది. ఒకరోజు పుంజుకు ఒక చిలుక కనిపించింది. “నేను చాలా బాగా ఆడతాను కదా” అంది. చిలుక నవ్వి “ఆట అంటే నెమలిది. దానిలా ఈ లోకంలో ఎవరూ ఆడలేరు” అంది. కోడిపుంజుకు కోపం వచ్చి చిలుకతో మాటలాడ్డం మానివేసింది. ఒక రోజు పుంజుకు ఒక పొట్టేలు కనిపించింది. .

“నాలా అందంగా ఎవరూ వుండరు గదా” అంది. పొట్టేలు నవ్వి “అందం అంటే జింకదే. దానితో ఈ లోకంలో ఎవరూ సరితూగలేరు” అంది. కోడిపుంజుకు కోపం వచ్చింది. పొట్టేలుతో మాటలాడ్డం మానివేసింది. పుంజు ఒంటరిదై పోయింది. ఎవరితోనూ మాటలాడేది కాదు. ఒక రోజు దానిని ఒక పిల్లి చూసింది. “అబ్బ ఎంత అందంగా వున్నావు. నీవు ఆడుతుంటే నెమలి పనికిరాదు. నీ పాటకి కోయిల సాటిరాదు. ఇక నీ అందం ఈ లోకంలో ఎవరికీ వుండదు” అని తెగ పొగిడింది.

దాంతో పుంజు సంతోషంగా పిల్లి దగ్గరికి వచ్చింది. అదును చూసి పిల్లి లటుక్కున దాని మెడ పట్టుకొనింది. పుంజు బాధతో అరవసాగింది.
అది చూసి పొట్టేలు వేగంగా వచ్చి దాన్ని ఢీ కొట్టింది. గాడిద వెనక కాళ్ళతో ఎగిరి ఒక్కటి తన్నింది. అంతే… పిల్లి పుంజును వదిలి పారిపోయింది. చిలుక మందు తెచ్చి పుంజు దెబ్బలపై పూసింది. తన తప్పు తెలుసుకున్న పుంజు ఆరోజు నుంచి గొప్పలు చెప్పుకోవడం మానివేసి అందరితో కలసిమెలసి వుండసాగింది.

Moral Stories in Telugu – మోరల్ స్టోరీస్

Like and Share
+1
1
+1
0
+1
0
+1
1
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks