Menu Close

Manasuna Unnadi Lyrics in Telugu – Priyamaina Neeku – మనసున ఉన్నది చెప్పాలనున్నది

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Manasuna Unnadi Lyrics in Telugu – Priyamaina Neeku – మనసున ఉన్నది చెప్పాలనున్నది

మనసున ఉన్నది చెప్పాలనున్నది… మాటలు రావే ఎలా..?
మాటున ఉన్నది ఓ మంచి సంగతి… బయటికి రాదే ఎలా..?

అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే… బిడియం ఆపేదెలా..?
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే… తలపులు చూపేదెలా…?
ఒకసారి దరిచేరి యద గొడవేమిటో… తెలపకపోతే ఎలా..!

మనసున ఉన్నది చెప్పాలనున్నది… మాటలు రావే ఎలా..?

చింత నిప్పైన చల్లగ ఉందని… ఎంత నొప్పైన తెలియలేదని
తననే తలచుకునే వేడిలో…
ప్రేమ అంటేనే తీయని బాధని… లేత గుండెల్లో కొండంత బరువని…
కొత్తగా తెలుసుకునే వేళలొ…

కనబడుతోందా నా ప్రియమైన నీకు… నా యద కోత అని అడగాలనీ
అనుకుంటూ తన చుట్టూ… మది తిరిగిందనీ తెలపకపోతే ఎలా..!

మనసున ఉన్నది చెప్పాలనున్నది… మాటలు రావే ఎలా..?

నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి… నాకింకా చోటెక్కడుందని
నిదరే కసురుకునే రేయిలో…
మేలుకున్నాయి ఏం వింత కైపని… వేల ఊహల్లో ఊరేగు చూపుని
కలలే ముసురుకునే హాయిలో…

వినబడుతోందా నా ప్రియమైన నీకు… ఆశల రాగం అని అడగాలని
పగలేదో రేయేదో గురుతేలేదని… తెలపకపోతే ఎలా..!

మనసున ఉన్నది చెప్పాలనున్నది… మాటలు రావే ఎలా..?
మాటున ఉన్నది ఓ మంచి సంగతి… బయటికి రాదే ఎలా..?

అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే… బిడియం ఆపేదెలా..?
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే… తలపులు చూపేదెలా…?
ఒకసారి దరిచేరి యద గొడవేమిటో… తెలపక పోతే ఎలా.. ..

Manasuna Unnadi Lyrics in Telugu – Priyamaina Neeku – మనసున ఉన్నది చెప్పాలనున్నది

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading