Redmi TV జస్ట్ - 8000/-
Samsung Fridge 183 L జస్ట్ - 13000/-
LG వాషింగ్ మెషిన్ - జస్ట్ - 9000/-
Samsung phone at - 10000/-
realme Earbuds జస్ట్ - 900/-
Alanati Ramachandrudu Lyrics in Telugu – Murari – అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ…. ఆ….ఆ…ఆఆఆ…
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి…
ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి…
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి…
ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి…
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ…ఆ…ఆ…ఆఆ
తెలుగింటి పాలసంద్రము… కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే… కనిపించిన జాణ…
తెలుగింటి పాలసంద్రము… కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే… కనిపించిన జాణ…
అటువంటి అపరంజి అమ్మాయిని… కనరండీ…ఆ…ఆ…ఆఆ
చందమామా చందమామా కిందికి చూడమ్మా….
ఈ నేలమీది నెలరాజుని… చూసి నివ్వెరబోవమ్మా…
వెన్నేలమ్మా వెన్నేలమ్మా… వన్నెలు చాలమ్మా…
మా అన్నులమిన్నకు సరిగా లేవని… వెల వెల బోవమ్మా…
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ… పురుషుడి మునివేళ్ళు…
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు…
నేలకు జారిన తారకలై… ముత్యాల తలంబ్రాలు…
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు…
చందమామా చందమామా కిందికి చూడమ్మా….
ఈ నేలమీది నెలరాజుని… చూసి నివ్వెరబోవమ్మా…
వెన్నేలమ్మా వెన్నేలమ్మా… వన్నెలు చాలమ్మా…
మా అన్నులమిన్నకు సరిగా లేవని… వెల వెల బోవమ్మా…
సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపానా
గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా
మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయానా…
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా… ఇంత ఘనంగా జరిగేనా…ఆ…ఆ…ఆఆ
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా… ఇంత ఘనంగా జరిగేనా…
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి… జనమంతా రారండి…
తదుపరి కబురుల వివరములడగక… బందువులంతా కదలండి…
చందమామా చందమామా కిందికి చూడమ్మా….
ఈ నేలమీది నెలరాజుని… చూసి నివ్వెరబోవమ్మా…
వెన్నేలమ్మా వెన్నేలమ్మా… వన్నెలు చాలమ్మా…
మా అన్నులమిన్నకు సరిగా లేవని… వెల వెల బోవమ్మా.. ..
Alanati Ramachandrudu Lyrics in Telugu – Murari – అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.