1. ఆ కిక్కే వెరప్ప
పుట్టింటికి వెళ్లిన భార్య ఫోన్ చేసి…………
మీరు వచ్చి అర్జంటుగా నన్ను తీసుకెళ్లండి….
భర్త : ఎలాగో వెళ్లావుగా ఓ నాలుగు రోజులు వుండు…..
భార్య : అయ్యో నాకు ఇక్కడ బోర్ కొడుతోంది….
అన్నా, ఒదిన, అక్క, చెల్లి, అమ్మా, నాన్న లతో గొడవ పడ్డాను..
అదేంటో మీతో గొడవపడ్డప్పుడు వున్నా ఎంజాయిమెంట్ వీళ్ళతో రావడం లేదండీ………. !
2. ఇక దేవుడే కాపాడాలి వీడ్ని
అప్పుడే వూరి నంచి వచ్చి చేతిలోని బ్యాగ్ కింద పడేసి ఇల్లంతా కలియ చూసింది.
ఇల్లంతా నీట్గా వుంది. అక్కడ్నించి వంటింట్లోకి వెల్లింది అక్కడ ఎక్కడి వస్తువులు అక్కడ వున్నాయి. సింక్ లోకి చూసింది… తరువాత కప్ బోర్డు వైపు చూసింది. అన్ని క్లీన్ గా… నీట్ గా వున్నాయి. ఇక తిన్నగా బెడ్ రూంలోకి వెళ్ళింది. పక్క బట్టలన్నీ సర్దేసి వున్నాయి. వెంటనే భర్తను కౌగిలించుకుంది… జల జలా కన్నీళ్లు కార్చింది.
భర్త టెన్షన్ పడుతున్నాడు…! 🥺 ఏమైంది…? జర్నీ బానే జరిగింది కదా…? ఇంట్లో నిన్ను ఎవరూ ఏమి అనలేదు కదా….? అని ఓదార్చబోయాడు…!
అప్పుడు భార్య…. నవ్వుతు…. ఇవి కన్నీళ్లు కాదండీ… ఆనంద భాస్పాలు…. మన పెళ్లయిన దగ్గర నుండి తెలియదండి నాకు…. మీకు ఇన్ని పనులు తెలుసనీ…. ఇక నా దిగులు మొత్తం పోయింది. ఇక రేపట్నుంచి నేను ఒక్కదాన్నే ఇన్ని పనులు చేయనక్కర్లేదు అంది……😉🤪😜😔
3. తాగుబోతు ఎక్కడైనా తాగు….. బోతే
స్వామిజీ : తనకు దగ్గర వెళుతున్న ఒక తాగు బోతును ఆపి………
“అలా తాగాను నాయనా….. నీవు చనిపోయిన తరువాత నరకానికి పోతావ్” అన్నాడు.
తాగుబోతు: నా సంగతి సరే…. మరి నాకు మందు అమ్మేవాడు………?
స్వామిజి : అతను కూడా నరకానికే నాయనా…….!
తాగుబోతు : మరి…. మందుషాపులో మందు అమ్మేవాడు……?
చికెన్ షాపులో చికెన్ అమ్మేవాడు……?
స్టఫ్ అమ్మేవాడు……?
స్వామిజి : అందులో సందేహం ఎందులకు….? వారు కూడా నరకానికె….!
తాగుబోతు. : అది చాలు స్వామి……
వాళ్ళందరూ వస్తే…….
ఆది నాకు స్వర్గమే కానీ నరకమేల అవుతుంది స్వామీ …..? అన్నాడు.
It’s funny
thank you so much sir, please do share with your friends..