విశ్వక్: తీరా..! నేను మీ నాన్నతో మాట్లాడతా. 😟
నివేత: ఆయన వినడు.
విశ్వక్: నీ ఫియాన్సీతో మాట్లాడతా..!
నివేత: అవన్నీ వద్దు.
విశ్వక్: నిన్ను కిస్ చేశానని చెప్తా..!
నివేత: నువ్వేం చేసినా నా పెళ్లి ఆగదు ప్రేమ్.
విశ్వక్: నీతో అన్నీ అయిపోయాయని చెప్తా..! 😯
నివేత: పిచ్చిపిచ్చిగా చేయకు. ప్లీజ్ నన్నొదిలెయ్, ప్లీజ్
విశ్వక్: నువ్వింకొక్కడుగు ముందుకేసినా నేను చచ్చిపోత, చెప్తున్నా.
నివేత: 😢 నువ్వు చచ్చిపోయిన నెక్స్ట్ మినిట్ నేను కూడా చచ్చిపోతా. అంతేగాని నా డెసిషన్ లో ఏ చేంజ్ ఉండదు. ఇంత చెప్పాక కూడా ఒక్క అడుగు ముందుకేసావంటే, నా మీద ఒట్టే. ఒట్టంటే మాట కాదు ప్రేమ్, ఒట్టంటే ఒట్టే. ఒట్టేసి మాట తప్పితే, ఒట్టేసినవాళ్లు చనిపోతారంట..!
వెళిపోతోంది ప్రాణమే… కనబడుతోంది శూన్యమే
వదిలేలుతోంది గాయమే… కన్నీటి జ్ఞాపకమే
వెలివేసింది కాలమే… ఉరి తీసింది ప్రేమనే
ఉసిరేసింది మౌనమే… ఒంటరినై మిగిలానే
కనబడవా కనబడవా… కన్నీరై మిగిలెడతావా
చిరునవ్వై ఎదురొచ్చి… చితిలోకే నెడతావా
కనబడవా కనబడవా… శిధిలం చేసి పోతావా
గుండెను కోసే కథ నువ్వై… కడదాకా వస్తావా
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.