Menu Close

Kalyana Vaibhogame Lyrics In Telugu – Seetharama Kalyanam


Kalyana Vaibhogame Lyrics In Telugu – Seetharama Kalyanam

విడిపోము మనమూ
ఈ ఎడబాటు క్షణమూ
ఆ పైన కళ్యాణము… ఊఊ ఊఉ

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

కళ్యాణ వైభోగమే… కళ్యాణ వైభోగమే
శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే… శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే… కళ్యాణ వైభోగమే

అనుకున్న కొన్నాళ్ళ వనవాసము
మునుముందు కావాలి మధుమాసము
అనుకున్న కొన్నాళ్ళ వనవాసము
మునుముందు కావాలి మధుమాసము
మన ప్రేమ తుదిలేని ఆకాశము
మన ప్రేమ తుదిలేని ఆకాశము
ప్రతిరోజు పూర్ణిమ శ్రావణము

కళ్యాణ వైభోగమే… శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే

మరులెల్ల మరుమల్లె విరిమాలగా
మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా
మరులెల్ల మరుమల్లె విరిమాలగా
మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా
హృదయాల నాదాలే వేదాలుగా
హృదయాల నాదాలే వేదాలుగా
మన అంతరంగాలే వేదికగా
కళ్యాణ వైభోగమే

వలచాము నిలిచాము ఒక దీక్షగా
మనసైన మనసొకటే సాక్షిగా
వలచాము నిలిచాము ఒక దీక్షగా
మనసైన మనసొకటే సాక్షిగా
గెలిచాము కలిసాము దివిమెచ్చగా
ఆఆ ఆఆ ఆఆ ఆ
గెలిచాము కలిసాము దివిమెచ్చగా
కలకాలముందాము నులివెచ్చగా

కళ్యాణ వైభోగమే… శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే

Like and Share
+1
3
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading