Menu Close

Ee Gaali Ee Nela Lyrics In Telugu – Sirivennela

Ee Gaali Ee Nela Lyrics In Telugu – Sirivennela

ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరు
ఈ గాలీ ఈ నేలా… ఈ ఊరు సెలయేరు
నను గన్న నా వాళ్ళు… ఆఆ ఆ, నా కళ్ళ లొగిళ్ళు
నను గన్న నా వాళ్ళు… ఆఆ ఆ, నా కళ్ళ లొగిళ్ళు
ఈ గాలీ ఈ నేలా

చిన్నారి గొరవ౦కా కూసేను ఆ వ౦కా
నా రాక తెలిశాకా వచ్చేను నా వ౦కా
చిన్నారి గొరవ౦కా… కూసేను ఆ వ౦కా
నా రాక తెలిశాకా… వచ్చేను నా వ౦కా
ఎన్నాళ్ళో గడిచాకా… ఇన్నాళ్ళకు కలిశాకా
ఎన్నాళ్ళో గడిచాకా… ఇన్నాళ్ళకు కలిశాకా
ఉప్పొ౦గిన గు౦డెల కేక… ఎగసేను ని౦గి దాకా
ఉప్పొ౦గిన గు౦డెల కేక… ఎగసేను ని౦గి దాకా
ఎగసేను ని౦గి దాకా

ఈ గాలీ ఈ నేలా… ఈ ఊరు సెలయేరు
నను గన్న నా వాళ్ళు… ఆఆ ఆ, నా కళ్ళ లొగిళ్ళు
ఈ గాలీ ఈ నేలా

ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలలు
ఏ ఉలితో ఈ శిలపై… నిలిపాడో ఈ కళలు
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలలు
ఏ ఉలితో ఈ శిలపై… నిలిపాడో ఈ కళలు
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కధలు
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కధలు
ఈ రాళ్ళే జవరాళ్ళై… ఇట నాట్యాలాడేను
ఈ రాళ్ళే జవరాళ్ళై… ఇట నాట్యాలాడేను

కన్నె మూగమనసుకన్న స్వర్ణస్వప్నమై
తళుకుమన్న తారచిలుకు కా౦తి చినుకులై
కన్నె మూగమనసుకన్న స్వర్ణస్వప్నమై
తళుకుమన్న తారచిలుకు కా౦తి చినుకులై
గగన గళము ను౦డి అమరగాన వాహిని… ఆఆ ఆ ఆ ఆ
గగన గళము ను౦డి అమరగాన వాహిని
జాలువారుతో౦ది ఇలా అమృతవర్షిణి
అమృతవర్షిణి అమృతవర్షిణి
ఈ స్వాతివానలో నా ఆత్మస్నానమాడే
నీ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే

ఆ హాహ ఆ హా ఆఆ
ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరు
నను కన్న నా వాళ్ళు… నా కళ్ళ లొగిళ్ళు
ఈ గాలీ ఈ నేలా

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading