Menu Close

Manchamesi Duppatesi Lyrics In Telugu – Kondaveeti Raja

Manchamesi Duppatesi Lyrics In Telugu – Kondaveeti Raja

తననం తననం తననం తననం… తననం తననం తా
తననం తననం తననం తననం… తననం తననం తా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ హే హే హేహె

మంచమేసి దుప్పటేసి మల్లెపూలు జల్లాను, రారా రారా… తనన తననం
చిన్నచీర కట్టాను సన్నజాజు లెట్టాను, రారా రారా… తనన తననం
దిండు ఎంత మెత్తనో… మంచమెంత గట్టిదో
చుక్కలొంక చూసుకుంటు… చక్కబెట్టుకుందాము, రారా

ఆకలేసి దప్పికేసి అందమంటూ వచ్చాను, రావే రావే… తనన తననం
ఆకులోన సున్నవేసి పోకచెక్కలిస్తాను, రావే రావే… తనన తననం
పండు ఎంత తీయనో… పాలు ఎంత చిక్కనో
సోకులొంక చూసుకుంటు… సొమ్మసిల్లిపోదాము రావే

నిన్ను చూడకుంటే నాకు పిచ్చిగుంటది… తనన తననం
నిన్ను చూస్తే వయసు నన్ను మెచ్చుకుంటది… తనన తననం
కౌగిలింత కోరలేక అలిసిపోతిని
రాతిరంత కునుకులేక రగిలిపోతిని
కసికసి ఈడు కమ్ముకొస్తే… కంటిని రెప్పే కాటు వేస్తే
ఎట్టా ఆగను చలిలో గిలిలో … ఎట్టా అడగను అసలు కొసరు
సాగాలి నీ జోరు..!!

ఆకలేసి దప్పికేసి అన్నమంటూ వచ్చాను, రావే రావే
మంచమేసి దుప్పటేసి మల్లెపూలు జల్లాను, రారా రారా

తననం తననం తననం తననం… తననం తననం తా
తననం తననం తననం తననం… తననం తననం తా

పెరుగుతున్న సోకుమీద మీగడుంది… తనన తననం
పెదవి తాకి ముద్దులాగ మారుతున్నది… తనన తననం
చీకటింటా చిట్టిగుండే కొట్టుకున్నది
వాలుకంటా వలపుమంట అంటుకున్నది
జళ్ళో పువ్వు జావళి పాడే… ఒళ్ళు ఒళ్ళు ఒత్తిడి సాగే
ఎంత తీరినా ఎదలో సొదలే… వింతవింతగా జరిగే కథలే
మోగాలి తొలితాళం

మంచమేసి దుప్పటేసి మల్లెపూలు జల్లాను రారా రారా… తనన తననం
ఆకులోన సున్నవేసి పోకచెక్కలిస్తాను రావే రావే… తనన తననం
దిండు ఎంత మెత్తనో… మంచమెంత గట్టిదో
సోకులొంక చూసుకుంటు సొమ్మసిల్లిపోదాము రావే

తననం తననం తననం తననం… తననం తననం తా
తననం తననం తననం తననం… తననం తననం తా

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading