Laali Laali Lyrics In Telugu – Swathi Muthyam
లాలీ లాలీ లాలీ లాలీ
లాలీ లాలీ లాలీ లాలీ
వటపత్రసాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
వటపత్రసాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి
మురిపాల కృష్ణునికి… ఆ ఆ ఆఆ
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి
వటపత్రసాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి
లాలీ లాలీ లాలీ లాలీ
లాలీ లాలీ లాలీ లాలీ
కళ్యాణ రామునికి కౌసల్య లాలి
కళ్యాణ రామునికి కౌసల్య లాలి
యదువంశ విభునికి యశోద లాలి
యదువంశ విభునికి యశోద లాలి
కరిరాజ ముఖునికీ
కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి
కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి
పరమాంశభవునికి పరమాత్మ లాలి
వటపత్రశాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
జోజో జోజో జో… జోజో జోజో జో
అలమేలు పతికి… అన్నమయ్య లాలి
అలమేలు పతికి… అన్నమయ్య లాలి
కోదండరామునికి గోపయ్య లాలి
కోదండరామునికి గోపయ్య లాలి
శ్యామలాంగునికి శ్యామయ్య లాలి
శ్యామలాంగునికి శ్యామయ్య లాలి
ఆగమనుతునికి త్యాగయ్య లాలి
వటపత్రసాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి
వటపత్రసాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి
లాలీ లాలీ లాలీ లాలీ
లాలీ లాలీ లాలీ లాలీ
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.