జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ రివ్యూ – Jaabilamma Neeku Antha Kopama Review – Dhanush
రిలీజ్ డేట్: 21/02/2025
మూవీ: జాబిలమ్మ నీకు అంత కోపమా?
నటీనటులు: పవిష్, అనిక సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, రమ్య రఘురామన్, వెంకటేశ్ మీనన్, ఆడు కాలమ్ నరేన్ తదితరులు
దర్శకత్వం: ధనుష్
నిర్మాతలు: కస్తూరి రాజా, విజయలక్ష్మీ కస్తూరి రాజా
మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
ఎడిటర్: జీకే ప్రసన్న
సినిమాటోగ్రఫి: లీయాన్ బ్రిట్టో
ఆర్ట్: జాకీ
బ్యానర్: వండర్‌బార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్

జాబిలమ్మ నీకు అంత కోపమా? లవ్, ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్ ముఖ్యంగా నేటితరం యువత అభిచుచులకు అద్దం పట్టే చిత్రంగా అనిపిస్తుంది. ప్రస్తుత జనరేషన్‌లో యువతీ యువకుల పోకడలను దర్శకుడు ధనుష్ స్పష్టంగా తెరకెక్కించారు. నటీనటులు ఫెర్పార్మెన్స్, సాంకేతిక విభాగాల పనితీరు ఈ మూవీకి అత్యంత బలంగా మారాయి. కథ చెప్పే స్వభావం కారణంగా ఓ వర్గం వారికి సాగదీసినట్టు అనిపిస్తుంది. యూత్‌కు మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది. వయసులో సంబంధం లేకుండా ఎంజాయ్ చేయడానికి సన్నివేశాలను ధనుష్ బాగా రాసుకొన్నాడు. అవి మీకు కూడా నచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీకు ప్రేమ కథలను ఆస్వాదించే గుణం ఉంటే.. మీరు తప్పకుండా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. కాబట్టి థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను ఆస్వాదించే పనిలో ఉండండి.
నటీనటులు విషయానికి వస్తే.. నటనకు పవిష్ కొత్త కుర్రాడైనా బాగా రాటుదేలిన అనుభవంతో నటించాడు. నేటితరం కుర్రాడి పోకడలు, ఆలోచన విధానం ఆ క్యారెక్టర్‌కు అద్దం పట్టేలా నటించాడు. ఫన్, ఎమోషన్స్, సెంటిమెంట్, జాలీ ఆడుతూ పాడుతూ ఆ క్యారెక్టర్‌ను తెర మీద పండించాడు. ఇక నీలాగా అనికా సురేంద్రన్ తన పాత్రలో ఒదిగిపోయింది. వీరిద్దరూ సినిమా భారాన్ని సమానంగా మోయడంతో కథలో ఎలాంటి ఇంబాలెన్స్ లేకుండా కనిపిస్తుంది. ప్రియా ప్రకాశ్ వారియర్ గెస్ట్ రోల్ అయినప్పటికీ కథలో ప్రజెన్స్ బలంగానే ఉంటుంది. శరత్ కుమార్ ఓ ఎమోషనల్ పాత్రలో సినిమాకు వెన్నముకలా నిలిచాడు. రమ్య రంగనాథన్ తన ఫెర్ఫార్మెన్స్‌తో మనసు దోచుకొటుంది. ఎమోషనల్ కథలో వెంకటేష్ మీనన్, మ్యాథ్యూ థామస్, రబీనా ఖాతూన్ అనుక్షణం నవిస్తూ ఊరట కలిగిస్తారు.
మరో ఫ్రెష్, ఫీల్ గుడ్ మూవీ, మిస్ అవ్వకుండా చూడండి.
డ్రాగన్ మూవీ రివ్యూ – Dragon Movie Review – 21/02/2025