Menu Close

Interesting Stories in Telugu – ఈ కథలోని పాత్రలు, ప్రదేశాలు అన్నీ కల్పితం, నిజంగా కల్పితం.!


kings court room telugu bucket

చంబా అనే ఒకాయన, రాశేరె, చంశేరా అనే ఇంకో ఇద్దరు ఒక పెద్ద రాజ్యం లో దోస్తులు.
కొన్నాళ్ళకు చంబా అనేటాయన ఆ రాజ్యం కు రాజవుతాడు. బాగనే ఉన్నది. పాలన గురించి అప్రస్తుతం.

కొన్నాళ్ళకు చంబా చిన్ననాటి దోస్తు రాశేరె రాజ్యం తను న్నూ చేయాలనిపించి, విస్తృతంగా పాదయాత్రలు చేసి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని, తాను ప్రజల మనిషి అనిపించుకుని చంబా ను ఓడించి, రాజయినాడు.

మరి చంశేరా సంగతేంది? వారికి మాత్రం రాజవాలని ఉండదా? తప్పేముంది? ఉన్నది ఒకటే రాజ్యం, ఎంత మంది రాజులవుతారు?
కాని రాశేరె ఉన్నంత కాలం చంశేరా సైలెంట్ గ ఉన్నారు; ఎందుకనో తెలియదు కాని, ఆయనంటే భయం కావచ్చు.

కొంత కాలం గడిచినాక, అత్యంత విషాదవశాత్తూ ఒక ప్రమాదం లో రాజు కాలం చేస్తారు.
నెల లోపే ఆశలు చిగురించిన సైలెంట్ వ్యక్తి దిగ్గున ఉద్యమం లేపుతారు.
ఒకే రాజ్యం ఇద్దరు రాజులు సాధ్యం కాదు, కాబట్టి రెండుగా విడదీస్తే పోలా?

ఇప్పుడు ఒక విచిత్ర పరిస్థితి. రాజ్యం ఆం, తె అనే రెండు భాగాలుగా ఉన్నది. కాలం చేసిన రాజు గారి కొడుకు, వంశపారంపర్యంగా రాజ్యం ను కోరుకున్నారు.
విధివశాత్తూ జరుగలేదు.
రాజమాత ఒప్పుకోలేదు.

మో అనే మరో వ్యక్తి చక్రవర్తి గా, రాజమాత కు పోటీగా బలంగా ఎదుగుతున్నారు.
రాజమాత ఈ విధంగా ఆలోచించారు:
ఇపుడు చంశేరా, చంబా, కాలం చేసిన రాజు గారి కొడుకు, మో ప్రత్యర్ధులు.

కొన్ని కారణాల వలన ఇపుడు ఈ రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లో గెలవలేం. మేం ఓడినాక మో వచ్చి, రాజ్యం చీల్చి, తన సామంత రాజును కాని, చంశేరా ను కాని రాజు అవడం ఖాయం.
కాని ప్రజల భావోద్వేగాలను గౌరవించి రాజ్యం చీల్చిన గొప్పదనం మో కి పోకూడదు.

ఇదిలాగే వదిలేసినా, మనం ఆం లో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క చోట కూడా గెలవలేం. కనీసం చీల్చితే, తె భాగంలో, వారి భావోద్వేగాలను గౌరవించినాం అని ఒకటి రెండు చోట్లయినా, మనల్ను గెలిపిస్తరు.
మేం చేయకుంటే మో ఎలాగైనా చేస్తాడు, క్రెడిట్ వాళ్ళకి పోతది’ అని ఆలోచించి, జస్ట్ ఎన్నికల ముందు, తలుపులేసి, చీల్చేసినారు.

ఇపుడు చంశేరా, చంబా, కాలం చేసిన రాజు గారి కొడుకు, మో ప్రత్యర్ధులు.
విడిపోయినాక, చంబా గారికి రెండు ఆం, తె లో ముఖ్యమే. రెండు చోట్ల బలం ఉంది, దేన్నీ వదులుకోలేరు.

చంశేరా కు కావల్సింది తె రాజ్యం, దక్కింది ఇక ఆం తో పని లేదు.
కాలం చేసిన రాజు గారి కొడుకు తె తో పని లేదు, బలమంతా ఆం లో నే.

మో కు ఆం లో బలం ఏం లేదు, ప్రస్తుతం ఆం లో పని లేదు కాబట్టి, తె తెచ్చింది మేమే అని ప్రచారం చేసుకుంటే, ఒకటి రెండు చోట్లయినా గెలిచే అవకాశం ఉన్నది.
రాజమాత కు ఎక్కడా బలం లేదు, కొండ కు వెంట్రుకేద్దాం వస్తే కొండ, పోతే వెంట్రుక.

ఇక ఈ కధలో భాష ప్రస్తావన ఎక్కడుంది?
మో గారికి ఏం పోయేది లేదు కాబట్టి చీలిక సపోర్ట్.
రాజమాత కు మొత్తం పోయింది, కనీసం ‘తె తెచ్చింది మేమే’ అనే క్రెడిట్ మో కు పోకుండా చేద్దాం.
చంశేరా కు కావాల్సిన చీలిక రాజ్యం తె దక్కింది.

కాలం చేసిన రాజు గారి కొడుకు కి తె తో పని లేదు, ఆం తో నే.
ఎటొచ్చీ ఆం, తె రెంటిలోను కేడర్ ఉన్న చంబా గారికి ఇది పెద్ద దెబ్బ.. ..

Title: భాష ఒకటే అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా ఎందుకు విభజించబడింది? Why Andhra Pradesh divided into two states?

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
1
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading