ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Interesting Facts on Hindu Mythology in Telugu
ఈ కలియుగం తర్వాత తిరిగి కృత, త్రేతా, ద్వాపర యుగాలు ఆరంభం అయితే రామాయణ, మహా భారతాలు మళ్ళీ జరుగుతాయా?
ఒకవేళ జరిగితే మరి ఎందుకు ఇప్పటికి ఒక్కడే రాముడు, ఒక్కడే కృష్ణుడు అంటున్నాము.?
అంతకముందు యుగాలకు రాముడు 1 రాముడు 2 అని వుండాలి కదా! ఎందుకు లేరు.?
మనమెందుకు.. మన ముందు జరిగిన మూడు యుగాల గురించే మాట్లాడుకుంటున్నాం.?
అంతకముందు జరిగిన యుగాల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు.?
వాటి ఆనవాళ్లు కూడా కనిపించవు కదా మన గ్రంధాలలో.. ఎందుకు?
ఒకవేళ అలా జరగకపోతే..?
అప్పటి కాలానికి, అప్పటికి.. మరో మహాపురుషుడు భూమండలాన్ని ఏలుతాడంటారా.?
మరొక మహానుభావుడు మరొక చరిత్రను రాస్తాడంటారా.?
మరొక యుగపురుషుడు ధర్మంకోసం యుద్ధం చేస్తాడంటారా.?
అతణ్ణి మరోతరానికి చెందిన ప్రజలు హృదయాలలో పెట్టుకుని పూజంచుకుంటారంటారా.?
అప్పుడు మరో విధంగా ధర్మం తన నాలుగు పాదాలనూ పొగొట్టుకుంటుందంటారా.?
మరో నాథునికై భూమి కన్నీళ్ళు పెట్టుకుంటుందంటారా.?
మరో జాతి-కుల-మత-ప్రాంతాలకు చెందిన మనుష్యులు ఈ భూమిపై నాది, నాది, నాదని గీతలు గీసుకుని బ్రతుకుతారంటారా.?
చివరికందరూ బారెడుగోతిలో పడుకుంటారంటారా.?
ఆలా అయినా వారి ప్రస్తావనలు ఎందుకు మన గ్రంధాలలో కానీ, వేదాలలో కానీ లేవు.
ఏమో ..
మహాపురుషుల జననములను మనము ఎంచదగినవారము కాదు సుయోధనా!