Interesting facts about Maha Shivaratri in Telugu – మహా శివరాత్రి
“శివ” అనే పదానికి అర్థం ఏమిటంటే “ఏదైతే లేదో అది”. మీరే ముఖ్యం అన్న స్థితిలో కాకుండా, శివుణ్ణి మీలోకి ఆహ్వానించే స్థితిలో ఉంటే, మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో ఇంకా పూర్తి స్పష్టతతో చూసే అవకాశం ఉంటుంది.
భారతదేశంలో పరమ పవిత్రంగా జరుపుకునే ఉత్సవాల్లో మహాశివరాత్రి అతి పెద్దది, ప్రముఖమైనది. సంవత్సరంలోకెల్లా వచ్చే అత్యంత చీకటి రాత్రిని యోగ సంప్రదాయానికి మూలమైన ఆది గురువు లేదా మొదటి గురువైన శివుని అనుగ్రహం పొందే రోజుగా భావిస్తారు.
ఈ రాత్రి ఏర్పడే గ్రహ స్థితులు కారణం చేత, మానవ వ్యవస్థలో సహజంగానే శక్తి ఊర్ధ్వముఖంగా కదులుతుంది. ఈ నాటి రాత్రి వెన్నుముక నిటారుగా ఉంచి, జాగరణ చేయడం మన భౌతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకి ఎంతగానో తోడ్పడుతుంది.
పరిణామ ప్రక్రియలో జంతువుకు జరిగిన మార్పులలో అతిపెద్ద మార్పు ఏమిటంటే సమాంతరంగా ఉన్న వెన్నుముక నిటారుగా రూపంతరం చెందడమేనని జీవశాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిణామం తరువాతే మేధ వికసించింది. కాబట్టి, మహాశివరాత్రిన సహజంగానే ఉప్పొంగే శక్తిని, ఇంకా రాత్రంతా జరుపుకునే వేడుకలో సరైన మంత్రాలు ,ధ్యానాలతో మనం దైవానికి మరో అడుగు దగ్గర కావచ్చు.
జీవితంలో ఎటువంటి సాధన లేని వారికి కూడా ఈరోజున శక్తి ఉప్పొంగుతుంది. ప్రత్యేకించి, ఏదైనా యోగ సాధనలో ఉన్నవారు , వారి శరీరాన్ని నిటారుగా ఉంచుకోవటం ,అంటే ఈ రాత్రి నిద్రించకుండా ఉండడం ఎంతో అవసరం.
మహా శివరాత్రి పర్వదినానికి ఒక విశిష్టత ఉంది. హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరిగినట్టుగా నమ్ముతారు. ఇదే రోజు లింగోద్భవం జరిగిందని కూడా చెప్తారు.
పరమశివుడు పురుషుడిని సూచిస్తే, పార్వతీ దేవి ప్రకృతిని సూచిస్తుంది . సృష్టికి మూలమైన శక్తి చైతన్యాల కలయికను మహాశివరాత్రి పర్వదినం సూచిస్తుంది. కనుక మహా శివరాత్రి చాలా ప్రత్యేకం.
ఎవరైతే భక్తితో మహా శివరాత్రి నాడు శివుడిని పూజిస్తారో.. ఉపవాస, జాగరణ దీక్షలను ఆచరిస్తారో.. వారికి శుభాలు కలుగుతాయని, శివుడి కటాక్షం వారిపై ఉంటుందని చెబుతారు. మహాశివరాత్రి పర్వదినాన ఎవరైతే శివుడిని మనసులో లగ్నం చేసుకుని శివయ్యను ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తారో వారికి శివ సాయుజ్యం లభిస్తుందని చెప్తారు.
ఇక జాగరణతో కూడా సకల పాపాలు తొలగిపోయి పుణ్య గతులు ప్రాప్తిస్తాయని నమ్ముతారు. మహా శివరాత్రి నాడు ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరణతో మారుమ్రోగిపోతాయి. ప్రతి ఒక్కరు అభిషేక ప్రియుడైన శివుడిని అభిషేకిస్తారు. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు ప్రతి శైవ క్షేత్రంలోనూ కొనసాగుతాయి.
హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో ఆలయాలన్నీ మారుమోగిపోతాయి. ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షతో మహాశివుడిని మనసులో లగ్నం చేసుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించి, జాగరణ చేసి స్వామి కటాక్షం కోసం భక్తులు కఠిన దీక్షను ఆచరిస్తారు.
మహాశివరాత్రి పర్వదినం నాడు సాయంత్రం 6 గంటల సమయం నుండి రాత్రి రెండు గంటల సమయం వరకు చేసే రుద్రాభిషేకం, బిల్వార్చన అష్టైశ్వర్యాలను కలిగిస్తాయని భక్తులు ప్రధానంగా నమ్ముతారు.
మహాశివరాత్రి పర్వదినం రోజు శివుడిని ప్రార్థించడం ద్వారా ఎంతోమంది తమ పాపాలను అధిగమించి, పుణ్యలోకాలకు చేరుకున్నారని అనేక పురాణాలు ఇతిహాసాలలో చెప్పబడింది. అందుకే మహాశివరాత్రి పర్వదినాన్ని జీవితంలో చీకట్లను తొలగించి కాంతులను నింపే పర్వదినంగా, శివయ్య అనుగ్రహం పుష్కలంగా ఉండే పర్వదినంగా జరుపుకుంటారు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకి షేర్ చెయ్యండి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు.
Telugu Quotes, Greetings, Wishes on Maha Shivaratri
“Mahashivaratri Significance: Unveiling the Mystique in Telugu Tradition”
“Telugu Tales of Mahashivaratri: Cultural Insights and Celebratory Delights”
“Maha Shivaratri Vibes: Exploring the Spiritual Essence in Telugu Customs”
“Telugu Traditions on Mahashivaratri: A Night of Devotion and Celebration”
“Shivaratri Festivities in Telugu Style: An In-depth Look at the Night of Lord Shiva”
“Telugu Mahashivaratri Marvels: Rituals, Rhythms, and Reverence Unveiled”
“Mahashivaratri Magic in Telugu Culture: Customs That Illuminate the Night”
“Telugu Traditions on Mahashivaratri: From Pujas to Penance, A Divine Affair”
“Shiva’s Night in Telugu Splendor: Mahashivaratri Traditions Explored”
“Telugu Insights into Mahashivaratri: Unraveling the Spiritual Significance”
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.