ఆ ఆఆ ఆఆ ఆఆ… ఆ ఆఆ ఆఆ ఆఆ
ఇది పాట కానే కాదు… ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు… ఏ రాగం నాకు రాదు
వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిది
ఆ ఆఆ ఆఆ ఆఆ
ఇది పాట కానే కాదు… ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు… ఏ రాగం నాకు రాదు
ఒంటరిగా తిరుగాడు లేడినొక… మనిషి చూసినాడు
చెంతకు చేరదీసినాడు
అభము శుభము తెలియని లేడి… అతనిని నమ్మింది
తన హృదయం పరిచింది
ఆ తరువాతే తెలిసింది… ఆ మనిషి పెద్దపులని
తను బలియైపోతినని
ఆ లేడి గుండె కోత… నా గాధకు శ్రీకారం
నే పలికే ప్రతి మాట… స్త్రీ జాతికి సందేశం
ఆ ఆఆ ఆఆ ఆఆ
ఇది పాట కానే కాదు… ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు… ఏ రాగం నాకు రాదు
ఇప్పుడు కూడా నయవంచకులు… ఇంద్రులు ఉన్నారు
కామాంధులు ఉన్నారు
వారి చేతిలో వందలు వేలు… బలి అవుతున్నారు
అబలలు బలి అవుతున్నారు
నిప్పులు చేరిగే… ఈ అమానుషం ఆగేదెప్పటికి
చల్లారేదెప్పటికి
ఆ మంటలారుదాకా నా గానమాగిపోదు
ఆ రోజు వచ్చుదాకా నా గొంతు మూగబోదు
ఇది పాట కానే కాదు… ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు… ఏ రాగం నాకు రాదు
వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిది
ఆ ఆఆ ఆఆ ఆఆ
పాట కానే కాదు… ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు… ఏ రాగం నాకు రాదు
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.