ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Hrudayam Anu Lokamlo Song Lyrics in Telugu – Aaru
హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో
స్వప్నం అను నగరంలొ నా చెంత చేర వచ్చావే
వయసు అను గగనంలో మనసు అను మేఘంలో
చిరు ఆశల వర్షంలొ నన్ను గుచ్చి గుచ్చి తడిపావే
నా అనువు అనువు నువ్వేలె
నీ తనువు తనువు నాదేలె
ప్రతి క్షణము క్షణము మనదేలె ఓ చెలీ
హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో
స్వప్నం అను నగరంలొ నా చెంత చేర వచ్చావే
హ వెన్నెల వల విసిరి నీ కన్నులు వెలిగిస్త
మెరుపుల మెడ వంచి నీ మెడలొ గొలుసేస్తా
చుక్కలు అన్ని చేపలు చేసి నీకె కమ్మని విందిస్త
మబ్బుని దించి సబ్బుగ మార్చి నీకె స్నానం చేయిస్తా
హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో
స్వప్నం అను నగరంలొ నా చెంత చేర వచ్చావే
కాలికి రెక్కలు కట్టి నీ కౌగిట వాలిపోత
పూలని అప్పడిగి పూరేకుని చీర చుడత
హ ఆకాశాన్నె చాపె చుట్టి నీకె పరుపుగ పరిచేస్త
సూర్యున్నె ఓ గుద్దుతొ చంపి పొద్దె పొడవని ముద్దిస్తా
హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో
స్వప్నం అను నగరంలొ నా చెంత చేర వచ్చావే
Hrudayam Anu Lokamlo Song Lyrics in Telugu – Aaru