Menu Close

8 Reasons Why You Are Not Feeling Hungry – Health Tips in Telugu – ఆకలి వేయకపోవడానికి 8 కారణాలు, ముందే జాగ్రత పడండి.

8 Reasons Why You Are Not Feeling Hungry – Health Tips in Telugu

8 Reasons Why You Are Not Feeling Hungry - Health Tips in Telugu

Health Tips in Telugu

మానసిక ఆందోళన: మీరు ఆత్రుతగా, ఆందోళనగా ఉన్నప్పుడు కేంద్ర నాడీ వ్యవస్థ ఒక రకమైన ఒత్తిడికి గురి చేసే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ అవాంఛిత హార్మోన్లు మీ జీర్ణక్రియ, ఆకలిని మందగించడంతో సహా అనేక విధాలుగా మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి.

డిప్రెషన్: డిప్రెషన్ కూడా ఆకలి లేకుండా చేస్తుంది. ఈ మానసిక ఆరోగ్య పరిస్థితి మీ మెదడును మరింత కార్టికోట్రోపిన్ విడుదల కారకాన్ని (CRF) విడుదల చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది తక్కువ ఆకలిని కలిగించే ఒక రకమైన హార్మోన్.

Health Tips in Telugu

ఒత్తిడి: ఒత్తిడి కొన్నిసార్లు మీ ఆకలిని తగ్గిస్తుంది. ఇది వికారం, అజీర్తి వంటి శారీరక సమస్యలను కలిగిస్తుంది. ఆహారం తినాలనే కోరికకు ఆటంకం కలిగిస్తుంది.

అనారోగ్యం: ఆరోగ్యం సరిగా లేనప్పుడు కూడా ఈ సమస్య ఎదురవుతుంది. ఆహారం తినాలనే కోరిక పూర్తిగా తగ్గిపోతుంది. అనారోగ్యంతో ఉన్నప్పుడు విడుదలయ్యే సైటోకిన్ అనే రసాయనం వ్యక్తులను అలసిపోయేలా చేస్తుంది. ఏదీ తినాలని అనిపించదు.

Health Tips in Telugu

గర్భవతిగా ఉన్నప్పుుడు: గర్భవతి అయినప్పుడు స్త్రీల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఈ పరిస్థితి వారిలో ఆకలిని తగ్గిస్తుంది. వికారం వంటి సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని గర్భధారణ లక్షణాలు వికారం, గుండెల్లో మంటను కలిగిస్తాయి. తినే ఆహారాలపై అయిష్టం కలిగిస్తాయి.

దీర్ఘకాలిక నొప్పులు: శరీరంలో ధీర్ఘకాలిక నొప్పులు ఉన్నట్లయితే.. ఇది అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఆకలిని కూడా చంపేస్తుంది.

Health Tips in Telugu

మందులు: కొన్నిసార్లు మందులు కూడా దుష్ప్రభావాలను చూపుతాయి. మందులు వేసుకున్న తరువాత ఆకలిగా అనిపించదు.

వయస్సు: చిన్న పిల్లలు, యుక్త వయస్కులు చాలా చురుకుగా, శక్తివంతంగా ఉంటారు. కానీ వృద్ధాప్యంలో జీర్ణవ్యవస్థ మందగించడం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో తక్కువ ఆకలి ఉంటుంది.

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించ బడినది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. వీటిని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.

health tips in telugu, telugu health tips, arogya chitkalu telugu, ayurveda chitkalu in telugu, ayurveda tips in telugu, latest health tips in telugu, 8 Reasons Why You Are Not Feeling Hungry

Like and Share
+1
1
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading