Menu Close

టెన్షన్ పడకుండా బ్రతకడం ఎలా – How to Stop Worrying and Start Living Book in Telugu


టెన్షన్ పడకుండా బ్రతకడం ఎలా – How to Stop Worrying and Start Living Book in Telugu

పుస్తకం పేరు: How to Stop Worrying and Start Living
రచయిత: డేల్ కార్నెగీ (Dale Carnegie)
ప్రచురణ సంవత్సరం: 1948

ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 60 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయాయి.

How to Stop Worrying and Start Living – డేల్ కార్నెగీ రాసిన అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకాలలో ఇదీ ఒకటి. ఈ పుస్తకం మన జీవితాల్లో ఎక్కువుగా ఉండే ఆందోళనలను ఎలా తగ్గించుకోవాలో, ఎలా ప్రశాంతంగా జీవించాలో, గతం గురించి బాధపడకుండా, భవిష్యత్తుపై భయం చెందకుండా ప్రస్తుతం ఎలా జీవించాలో అనే దానిని అనుభవాలతో చెప్పిన పుస్తకం ఇది.

టెన్షన్ పడకుండా బ్రతకడం ఎలా - How to Stop Worrying and Start Living Book in Telugu

పుస్తకంలో డేల్ కార్నెగీ చెప్పే అంశాలు ప్రతిరోజూ అనుసరించగలిగే విధంగా ఉంటాయి. “బిజీగా ఉండండి”, “చిన్న చిన్న విషయాలను పట్టించుకోకండి”, “నిజంగా ఎంత నష్టం కలుగుతుందో అంచనా వేయండి” వంటి సూత్రాలు మన ఆలోచనా విధానాన్ని మారుస్తాయి. ఈ పుస్తకం చదవడం ద్వారా ఒక వ్యక్తి మానసిక ప్రశాంతత పొందడమే కాదు, జీవితాన్ని మరియు సమస్యలని పాజిటివ్ గా చూడటం కూడా నేర్చుకోవచ్చు.

Important Points from the book “How to Stop Worrying and Start Living”

  • ఇప్పుడు, ఈ క్షణంలోనే జీవించండి. గతం గురించి విచారించవద్దు, భవిష్యత్తును ఊహించవద్దు.
  • ఏ సమస్యకైనా ఎదుర్కొనే ముందు, సమస్య ఏంటో స్పష్టంగా తెలుసుకొని, దానికి పరిష్కార మార్గాలు రాసి ఆచరణలో పెట్టండి.
  • మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నిజంగా ఎంత నష్టం కలిగిస్తాయో విశ్లేషించండి. అనవసర ఆందోళన తగ్గుతుంది.
  • ఆందోళన చెందకుండా సమస్యలను చిన్న చిన్న భాగాలుగా విభజించి పరిష్కరించడం అలవాటు చేసుకోండి.
  • ఎప్పుడు బిజీగా ఉండండి. ఖాళీగా ఉన్నప్పుడే ఆందోళనలు మనల్ని ఎక్కువగా బాధిస్తాయి.
  • ఆందోళనలను ఎదుర్కోవడంలో ధైర్యంగా ఉండండి. భయాన్ని అధిగమించడం ద్వారా ఆందోళన తగ్గుతుంది.
  • చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మీ శక్తిని వృథా చేయకండి.
  • మీ ఆందోళనలను, సమస్యలను మీకు నమ్మకమైన స్నేహితులు లేదా కుటుంబంతో పంచుకోండి. సమస్యను చెప్పడం వలన బరువు తగ్గుతుంది.
  • అలసట, ఆందోళన పోగొట్టడానికి మంచి విశ్రాంతి తీసుకోవాలి. క్రమం తప్పని నిద్ర మీ శక్తిని పెంచుతుంది.
  • సమస్యలలో కూడా మంచిని, అవకాశాలను చూడటం అలవాటు చేసుకోండి.
  • మీరు నియంత్రించలేని విషయాల గురించి ఆందోళన చెందడం అర్థరహితం. వాటిని వదిలేయడం నేర్చుకోండి.
  • మీ జీవితంలో మంచి విషయాలను గుర్తించి, కృతజ్ఞతాభావంతో ఉండటం అలవర్చుకోండి.
  • మీకు నచ్చిన పని చేయండి, అప్పుడు పని ఒత్తిడి, ఆందోళనలు వాటంతటే తగ్గుతాయి.
  • మిమ్మల్ని విమర్శించే వారిని పట్టించుకోవద్దు. విమర్శలను ఆత్మస్థైర్యంగా స్వీకరించండి.
  • వ్యాయామం, ఆరోగ్యకరమైన అలవాట్లు, హాస్యం, సంగీతం వంటివి ఆందోళనను తగ్గిస్తాయి. వీటిని జీవితంలో భాగం చేసుకోండి.

ఈ పుస్తకాన్ని తెలుగులో ఇక్కడ పూర్తిగా చదవండి – How to Stop Worrying and Start Living(తెలుగులో)

సంతృప్తిగా బ్రతకడానికి 12 రూల్స్ – 12 Rules for Life Book in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Book Recommendations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading