Menu Close

నలుగురు భార్యలు – తప్పకుండా చదవండి – Moral Stories in Telugu

నలుగురు భార్యలు – Moral Stories in Telugu

ఒక వ్యక్తికి నలుగురు భార్యలు. నాలుగవ భార్య అంటే చాలా ప్రేమ అతనికి. ఆమెకోరిన కోరికలన్నీ తీర్చేవాడు. అపురూపంగా చూసుకునేవాడు. మూడవ భార్య అన్నా ఇష్టమే. కానీ తన గురించి మంచిగా స్నేహితుల దగ్గర చెప్పేవాడు కాదు.

తను వారితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో. రెండవ భార్య దగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు. ఆమెకూడా అతని సమస్యను తీర్చి పంపేది. మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే ఉండేదికాదు. ఆమెను అస్సలు పట్టించుకునే వాడే కాదు.

telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes

ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అతని ఆరోగ్యం క్షీణించిపోయింది. ఇక తను బ్రతకను అని తెలిసిపోయి తనమీద ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన నాలుగవ భార్యను పిలిచాడు.

“నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను. నిన్ను చాలా ప్రేమగా చూసుకున్నాను కదా! నాతో పాటు నువ్వు కూడా వచ్చేసేయ్. మరణంలో కూడా నాకు నీతోడే కావాలి” అని అన్నాడు. నాలగవ భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది, ఆశ్చర్య చకితుడై తన మూడవ భార్యను ఇదే కోరాడు.

మూడవ భార్య ఇలా అంది. “ఇన్ని రోజులు నీతోనే, నీ దగ్గరే ఉన్నాను. నీ అవసరాలన్నీ తీర్చాను ఇక నాకు నీతో పనిలేదు. వేరేవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను” బాధతో ఏడుస్తూ తన రెండవ భార్యను ఇలాగే అడిగాడు.

భర్త ప్రేమను భార్య పొందడం ఎలా ..? ద్రౌపది చెప్పిన 6 రహస్యాలు.. ! – Techniques to Attract Love From Husband

“నేను నీతో పాటు నీ శవయాత్రలో పాల్గొనేంత వరకు నీవెంట ఉంటాను తరువాత నేను వెళ్ళిపోతాను. నిన్ను అప్పుడప్పుడు తలచుకోగలను” అంది. ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురూ ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను బాగా నిర్లక్ష్యం చేశానుకదా తనని అడగడం వృద్ధా అని భావిస్తుండగా.

మొదటిభార్య తలుపు చాటునుండి ఇలా అంది. “మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట మీ చివరి పయనం దాకా తప్పక వస్తాను. మీరేమీ బాధపడకండి ” అతని కంట నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది. కాబట్టి మనిషి దేన్నీ, ఎవరినీ నిర్లక్ష్యం చేయకూడదు. మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. పోయే ముందు తెలుసుకుని ప్రయోజనం ఉండదు.

నిజం చెప్పాలంటే మనం అందరం నలుగురు భార్యల్తోనే ఉంటున్నాము. అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా ఉందా???????

నాలుగవ భార్య – మన శరీరం
మూడవ భార్య – సంపద, ఆస్థిపాస్తులు
రెండవభార్య – నేస్తాలు, బంధువులు
మొదటి భార్య – మన ఆత్మ
నిజమే కదా!
దయచేసి మన ఆత్మ చెప్పిన దాన్ని ఆచరించండి
పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేయకండి.

ప్రతి ఒక్కరికీ ఈ పోస్ట్ ని షేర్ చెయ్యండి

Great Stories in Telugu, Relationship Stories in Telugu, Moral Stories in Telugu

Like and Share
+1
0
+1
0
+1
5
+1
0
+1
1

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images