ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
పథకం ప్రకారం వివాహితను అపహరించిన నలుగురు వ్యక్తులు ఓ గదిలో బంధించి తొమ్మిది రోజులపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చివరకు బాధితురాలు వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నెల 30న హరియాణాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోహ్నా గ్రామానికి చెందిన వివాహిత, జూన్ 29న తాగు నీరు తీసుకొచ్చేందుకు బావి వద్దకు వెళ్లింది. ఆ సమయంలో తనకు పరిచయం ఉన్న వ్యక్తి కలిశాడు.
మర్నాడు గ్రామ శివారులోని గుడిలో కలుసుకుందామని ఆమెకు చెప్పాడు. దీంతో జూన్ 30న ఆలయానికి వెళ్లిన బాధితురాలు.. చింటూను కలిసింది. ఇద్దరూ మాట్లాడుతుండగా.. అతడి ఇద్దరు స్నేహితులు దీపక్, సంజూ కారులో వచ్చి ఆమెను అపహరించారు. మరో వ్యక్తితో కలిసి నలుగురు దుండగులు ఆమెను ఫరిదాబాద్‌లో ఓ గదిలో నిర్భందించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.
తొమ్మిది రోజుల తర్వాత జులై 8న ఆమెను బల్లబ్‌గఢ్ బస్‌స్టేషన్ వద్ద వదిలి వెళ్లారు. అక్కడి నుంచి తన భర్తకు బాధితురాలు ఫోన్ చేయడంతో వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అహరించిన వారు తనకు తెలుసని, వారిలో ఒకరు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తాగడానికి నీళ్లు ఇచ్చారని, అందులో మత్తు మందు కలపడంతో స్పృహ కోల్పోయానని తెలిపింది. కొద్ది గంటల తర్వాత లేచిచూసేసరికి ఓ గదిలో ఉన్నానని పేర్కొంది.
అక్కడ మద్యం సీసాలు, కాల్చి పడేసిన సిగరేట్లు ఉన్నాయని చెప్పింది. కిడ్నాప్ చేసిన మర్నాడు పక్క గ్రామానికి చెందిన కులదీప్ అనే వ్యక్తితో కలిసి చింటూ, సంజూ, దీపక్ వచ్చి సామూహిక అత్యాచారం చేశారు. వారం రోజుల పాటు నలుగురూ నరకం చూపించారని, ఈ విషయం గురించి చెబితే చంపుతామని బెదిరించారని వాపోయింది. ప్రతి రోజు సాయంత్రం తనకు బలవంతంగా డ్రగ్స్ ఇంజెక్ట్ చేసేవారని కన్నీళ్లు పెట్టుకుంది.
దీంతో పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు బాధితురాలికి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సహకరించిన తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కేసులపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపగా.. ఆమె ఒంటిపై అనేక గాయాలున్నట్టు గుర్తించారు. నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అసలు ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం ఏంటి..?
అదుపు లేని ఆలోచనా..?
మితిమీరిన శారీరక వాంఛ..?
తప్పు అని తెలిసి మరీ ఎందుకు మనిషి ఇంతలా తెగిస్తున్నాడు.. !
దీనికి పరిష్కారం ఏంటి..?
ఒకటి, విచక్షణ కలిగి వుండటం, అది మన పెద్దలు, గురువులు, తల్లి దండ్రుల వద్ధ నుండి వస్తుంది.
రెండు, తమ కోరికలను అదుపు చేసుకో గలగడం, ఇది భక్తి మార్గంలో దొరుకుతుంది.
మూడు, భయం ఇది మన రాజ్యాంగ వ్యవస్థ నుండి రావాలి.