ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ప్రభాస్: బాహుబలి తర్వాత ప్రభాస్ పారితోషకం బారిగా పెరిగిపోయింది,
అప్పటి నుండి ప్రభాస్ తీస్తున్న సినిమాలు దేశ వ్యాప్తంగా ప్రదర్శించ బడుతున్నాయి.
సినీ వర్గాల మేరకు ప్రభాస్ ఒక్కో సినిమా కి దాదాపుగా 100 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు..
పవన్ కళ్యాణ్: రాజకీయలలో కొంచెం బిజీ గా వుంటున్న పవన్ కళ్యాణ్ గారు
మళ్ళీ సినిమా లలో నటించండం వారి ఫాన్స్ కి చాలా ఆనందాన్ని కలిగించింది.
ఇది ఇలా వుండగా ఇటీవల రిలీజ్ అయిన వకీల్ సాబ్ సినిమాకి
ఆయన దాదాపుగా 55 కోట్లు తీసుకున్నట్లు సినీ వర్గాల మాటలు.
మహేష్ బాబు: మహేష్ బాబు గారు ఒక్క్ప్ సినిమాకి దాదాపుగా 50 కోట్లు తీసుకుంటున్నారు,
ఈ మద్య కాలంలో ఆయన నటించిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర మంచి విజయాన్ని సాదించాయి.
చిరంజీవి: ఈ లిస్ట్ లో వున్న ఏకైక సీనియర్ యాక్టర్,
ఈయన కమ్ బ్యాక్ చేసిన తరవాత రెండు వరస విజయాలను అందుకున్నారు,
కాగా ఇప్పుడు ఈయన తీస్తున్న సినిమా కి గాను దాదాపుగా 45 నుండి 50 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు.
జూనియర్ ఎన్‌టిఆర్: ఎన్‌టిఆర్ నటనా ప్రతిభ గురుంచి మనం మాట్లాడుకోనవసరం లేదు,
ఈయన ఒక్కో సినిమా కి గాను దాదాపుగా 30 కోట్లు తీసుకుంటున్నట్లు వినికిడి.
ఇది కాకుండా సినిమా విజయం అయ్యాక వచ్చిన ఆదాయం లో కూడా జూనియర్ ఎన్‌టిఆర్ కి కొంత మేరకు వాటా వుంటుంది.
రామ్ చరణ్ తేజ్: రామ్ చరణ్ తేజ్ గారు ఒక్కో సినిమా కి గాను దాదాపుగా 35 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు వార్తలు,
మనకి తెలిసిన విషయమే ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ గారు
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం చేస్తున్న RRR మూవీ లో జూనియర్ ఎన్‌టిఆర్ తో పాటుగా నటిస్తున్నారు,
ఈ సినిమా మంచి విజయం సాదించాలని కోరుకుందాం.
అల్లు అర్జున్: విజయం సాదించిన సినిమా ఆదాయంలో కొంత మేరకు వాటతో పాటుగా
ఈయన దాదాపుగా 25 కోట్లు ఒక్క సినిమా కి గాను తీసుకుంటున్నట్లు సినిమా వర్గాల మాటలు.
విజయ్ దేవరకొండ: నటించిన సినిమాలు తక్కువే అయిన, ఆయన నటనా ప్రతిభతో ఫిల్మ్ లవర్స్ దగ్గర మంచి ఆదరణ పొందారు.
దాని వల్లన కాబోలు ఈ లిస్ట్ లో ఈయన కూడా జాయిన్ అయ్యారు, కాగా
విజయ్ ప్రస్తుతం ఒక్కో సినిమా కి గాను 10 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారనేది సినిమా పరిశ్రమలో వినికిడి.
నాని: మన పక్కింటి అబ్బాయిగా కనిపించే నాని, మంచి మంచి సినిమాలు మనకు అందిస్తున్నాడు.
ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా రిలీజ్ కి తయారుగా వుంది.
కాగా నాని ఒక్కో సినిమాకి గాను దాదాపుగా 10 కోట్లు తీసుకుంటున్నట్లు సినిమా వాళ్ళ మాటలు.
నాగ చైతన్య: నాగ చైతన్య గారు దాదాపుగా ఊకో సినిమాకి గాను దాదాపుగా 8 కోట్లు తీసుకుంటున్నట్లుగా వినికిడి.
నాగ చైతన్య గారి లవ్ స్టోరీ అనే సినిమా ప్రస్తుతం లీలిజ్ కి సిద్దంగా వుంది.