Fake Friends Telugu Quotes – ఫేక్ ఫ్రెండ్స్
Fake Friends Telugu Quotes – ఫేక్ ఫ్రెండ్స్
ఫేక్ ఫ్రెండ్స్ ఎప్పుడూ
నువ్వు వెలుతురులో వున్నప్పుడు నీ నీడల్లే వుంటారు
అదే నువ్వు చీకటిలో వున్నప్పుడు అస్సలు కనిపించరు
మనకి మన శత్రువుల అరుపులు కన్నా
మిత్రుల మౌనం చాలా బాద కలిగిస్తుంది
నీ మొఖం
నీ ఆస్తి చూసి
స్నేహం చెయ్యని వాడే నిజమైన స్నేహితుడు
నిజమైన మిత్రులు నక్షత్రాల లాంటి వారు
నీకు కనిపించకపోయిన, ఎప్పుడు నీ మంచి చెడ్డ చూస్తూనే వుంటారు.
స్నేహామంటే
ఆడుకోవడం కాదు
అవసరంలో ఆదుకోవడం
స్నేహామంటే
వాడుకోవడం కాదు
ఆపదలో అండగా నిలవడం
నీ తప్పు నీతో చెప్పే వాడే నీకు నిజమైన మిత్రుడు
నీ తప్పు నీతో కాకుండా వేరే వాళ్ళతో చెప్పే వాడు శత్రువు
కారణం లేకుండా
ఎవరు మౌనంగా వుండరు
కొండంత బాధ
ఆ మాటల్ని తొక్కి పెట్టి వుంచుతుంది
మన ఆట పాటల్లోనే కాదు,
మన జీవితంలోని ఆటు పోట్లలో
తోడుండే వారే నిజమైన స్నేహితులు.
గాయపడిన మనసుని సరిచేసేందుకు,
స్నేహానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.