Redmi TV జస్ట్ - 8000/-
Samsung Fridge 183 L జస్ట్ - 13000/-
LG వాషింగ్ మెషిన్ - జస్ట్ - 9000/-
Samsung phone at - 10000/-
realme Earbuds జస్ట్ - 900/-
అనేక మలుపులతో కూడిన ఓ భార్యాభర్తల కథ – Funny Stories in Telugu
Funny Stories in Telugu
ఒక మహిళ షాపింగ్‌కు వెళ్ళింది. అంతా పూర్తయ్యాక క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి, బిల్లు చెల్లించడానికి తన హేండ్ బ్యాగ్ తెరిచింది. క్యాషియర్ ఆమె బ్యాగ్లో ఒక టీవీ రిమోట్ గమనించాడు. అతను ఉండబట్టలేక ఆడిగేసాడు. “మీరు ఎప్పుడూ మీ టీవీ రిమోట్‌ను మీతో తీసుకువెళతారా?”అని.
ఆమె “లేదు, ఎప్పుడూ కాదు. ఈరోజు మావారు క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పి నాతో పాటు షాపింగ్ కి రాలేదు అందుకే నేను రిమోట్ తీసుకుని వచ్చేసా…” అంటూ తన క్రెడిట్ కార్డ్ ఇచ్చింది.
నీతి: మీ భార్య మాట వినండి. ఇంకా, ఆమెకు అవసరమైన పనుల్లో సహకారం అందించండి….. కథ ఇంతటితో అయిపోలేదు … క్యాషియర్ నవ్వుతూ ఆమె కొన్న వస్తువులన్నీ తిరిగి తీసుకున్నాడు. ఊహించని ఈ సంఘటన చూసి ఆమె నిర్ఘాంతపోయి “ఏమైంది..!!” అని క్యాషియర్ అడిగింది. అతను చెప్పాడు, “మీ భర్త మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేసారు …..”
నీతి: మీ భర్త అభిరుచులను ఎల్లప్పుడూ గౌరవించండి. కథ కొనసాగుతుంది …. భార్య ఈసారికి తన భర్త క్రెడిట్ కార్డును పర్స్ నుండి తీసి స్వైప్ చేసింది. దురదృష్టవశాత్తు అతను తన సొంత కార్డును బ్లాక్ చేయలేదు.
నీతి: మీ భార్య యొక్క శక్తిని మరియు జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయవద్దు .. కథ ఇంకా అయిపోలేదు … స్వైప్ చేసిన తర్వాత, యంత్రం ‘మీ మొబైల్ ఫోన్‌కు పంపిన పిన్ను నమోదు చేయండి’ అని సూచించింది ……. నీతి: ఒక్కోసారి మనిషి ఓడిపోయినప్పుడు, సాంకేతికత రక్షిస్తుంది..!
కథ కొనసాగుతుంది …. ఆమె మరలా నవ్వి, తన పర్సులో మెసేజ్ శబ్దంతో మోగిన మొబైల్ ను బయటకు తీసింది. అది తన భర్త ఫోన్. ఆమె దానిని రిమోట్ కంట్రోల్‌తో బాటుగా తీసుకుని వచ్చేసింది.. ఎందుకంటే, తన షాపింగ్ సమయంలో భర్త తనకు కాల్స్ చేసి విసుగించకుండా ఉండేందుకు. చివరకు ఆమె తన షాపింగ్ పూర్తి చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది.
నీతి: ఎప్పుడూ మీ భార్యని తక్కువ అంచనా వేయవద్దు! కథ కొనసాగుతుంది …. ఆమె ఇంటికి చేరుకునేసరికి బయట అతని కారు లేదు. ఒక నోటు తలుపు మీద అతికించబడి ఉంది. అందులో ఇలా రాసుంది… “రిమోట్ దొరకలేదు. మ్యాచ్ చూడటానికి ఫ్రెండ్స్ తోబాటు బయటకు వెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నీకు ఏదైనా అవసరమైతే నా ఫోన్ కు కాంటాక్ట్ చెయ్యు….” ఇంటి తాళాలు కూడా తనతోబాటే తీసుకుపోయాడు
నీతి: మీ భర్తను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.