ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Funny Stories in Telugu
ఒక పెద్ద హోటల్లో భీముడు లాంటి వస్తాదు పని చేసే వాడు. అతను అందరికీ ఓ సవాలు విసిరాడు. తను నిమ్మకాయ రసం పిండిన తర్వాత ఎవరైనా ఆ పిప్పి నుండి ఒక్క చుక్క రసం పిండ గలిగినా ₹ 10,000 రు.లు బహుమతిగా ఇస్తానన్నాడు.
పెద్ద పెద్ద క్రీడాకారులు, వస్తాదులు, వైట్ లిఫ్టర్లు ప్రయత్నించారు, కానీ ఎవరి చేత కాలేదు, ఆ పిండిన నిమ్మ చెక్క నుండి ఒక్క చుక్క రసం కూడా పిండలేక పోయారు. ఒకరోజు ఒక బక్క పలుచటి, అసహ్యంగా ఉన్న సూట్ వేసుకున్న ఓ వ్యక్తి వచ్చి, “నేను ప్రయత్నం చేయవచ్చా” అని అడిగాడు.
హోటల్ లోని వాళ్ళంతా పగలబడి నవ్వారు. నవ్వులు సద్దుమణిగాక, భీముడు నిమ్మకాయను సగంగా తరిగి , ఒక చెక్కను తీసుకుని, రసం పిండాడు పూర్తిగా, అందులో ఒక్క చుక్క కూడా లేకుండా, ఆ నలిగి ముడుతలు పడ్డ నిమ్మకాయ చెక్కను ఆ బక్క పలుచని వ్యక్తి చేతికి ఇచ్చాడు.
ఆ చెక్కను పిండి ఆరు చుక్కల నిమ్మరసం పిండాడు. హోటల్ లో జనమంతా ఆశ్చర్యంగా నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తుండిపోయారు. భీముడు 10,000 రు.లు చేతికిచ్చి నమస్కారం పెట్టి, మీరేం చేస్తుంటారు. వెయిట్ లిఫ్టింగ్ వంటి బలమైన పనులు చేస్తుంటారా!” అని కుతూహలంగా అడిగాడు.
నేను తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ బడుల్లో ప్రిన్సిపాల్ ని
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
Funny Stories in Telugu