అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
డ్రాగన్ మూవీ రివ్యూ – Dragon Movie Review – 2025
రిలీజ్ డేట్: 21/02/2025
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అశ్వత్ మారిముత్తు
నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కాయడు లోహర్, జార్జ్ మార్యన్, కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, స్నేహ, ఇవానా, అశ్వత్ మారిముత్తు తదితరులు
నిర్మాతలు: కళాపతి ఎస్ అఘోరం, కళాపతి ఎస్ గణేష్, కళాపతి ఎస్ సురేష్
సినిమాటోగ్రఫి: నికేత్ బొమ్మిరెడ్డి
ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్
మ్యూజిక్: లియోన్ జేమ్స్
బ్యానర్: ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్

Dragon Movie Review: యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్, లవ్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ ఎమోషన్స్, స్టూడెంట్‌కు చక్కటి మెసేజ్‌తో రాసుకొన్న సన్నివేశాలు సినిమాను మరింత ఫీల్‌గుడ్‌గా మార్చాయి. అయితే ఫస్టాప్‌లో దర్శకుడు కథను లాగిపట్టి నడిపించడం వల్ల సినిమా సాగదీసినట్టు, కొంత బోర్‌గా అనిపిస్తుంది. ఓ దశలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఏమిస్తాడా? అని ఎదురు చూడాల్సిన పరిస్థితి, విసుగు ఏర్పడుతుంది. కానీ కాలేజీ ప్రిన్స్‌పాల్‌ను ఎంట్రీ ఇచ్చి.. మంచి ట్విస్టుతో సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనపిస్తుంది.
ఇక సెకండాఫ్‌లో ట్విస్టులు, టర్నులతో స్క్రిప్టును హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. డీ రాఘవన్ చుట్టు అల్లుకొన్న సన్నివేశాలు చకచకా పరుగులు పెట్టాయి. ప్రతీ సన్నివేశం క్లైమాక్స్ సీన్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఏం ట్విస్టు ఇస్తాడో అనే క్యూరియాసిటీ ఎప్పటికప్పుడు క్రియేట్ చేయడంలో డైరెక్టర్ తన ప్రతిభకు సానపట్టాడు. చివరల్లో చిక్కు ముడులన్నీ విప్పితూ సోల్యూషన్ చూపించిన విధానంతో మూవీ ఫీల్‌గుడ్‌గా ముగుస్తుంది.
లవ్ టుడే సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన ప్రదీప్ రంగనాథన్ మరోసారి తనకు లభించిన చక్కటి పాత్రలో మళ్లీ పరకాయ ప్రవేశం చేశాడు. రాఘవన్‌లో రకరకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను తన పంథాలో ముందుకు తీసుకుపోయాడు. తన పాత్రపై సానుభూతి కలిగేలా.. జోష్ పుట్టించేలా, ఎమోషన్స్ పండించేలా, రొమాన్స్ నింపేలా అన్ని కలగలిపి మంచి ఫుల్ మీల్స్‌ను అందించారని చెప్పాలి. ఈ సినిమాకు ప్రదీప్ రంగనాథన్ వన్ మ్యాన్ షోగానే చెప్పుకోవాలి.
ఇక అనుపమ పరమేశ్వరన్ ఎమోషనల్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయారు. సెకండాఫ్‌లో కథను, రాఘవన్ క్యారెక్టర్‌ను ముందుకు నడిపించే పాత్రతో ఆకట్టుకొన్నారు. అలాగే కాయదు కూడా గ్లామర్‌తోను అందాల ఆరబోతతో మెరిసారు. కథలో కీలకంగా మారిన పాత్రతో మంచి మార్కులే కొట్టాశారు. ఇక చివర్లో లవ్ టుడే ఫేమ్ ఇవానా స్పెషల్ అప్పీరియన్స్‌తో ఆడియెన్స్‌కు జోష్ పుట్టించే పాత్రలో కనిపించారు. రాఘవన్ తల్లిదండ్రులుగా నటించిన జార్జ్ మార్యన్, ఇందుమతి, కాయదు తండ్రిగా కేఎస్ రవికుమార్, సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్‌గా గౌతమ్ వాసుదేవ్ మీనన్, దర్శకుడు మిస్కన్, ఇతరులు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
టెక్నికల్ విషయాలకు వస్తే.. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫి, లియోన్ జేమ్స్ మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. నికేత్ సినిమాను కలర్‌ఫుల్‌గా మార్చేస్తే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో లియోన్ జోష్ పుట్టించాడు. ఈ డబ్బింగ్ సినిమాకు రాసిన సంభాషణలు, సాహిత్యం వల్ల పూర్తిగా తెలుగు సినిమాగా మారిపోయిందనేలా అనిపిస్తుంది. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుసరించిన నిర్మాణ విలువలు, నటీనటుల కూర్పు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి.
ఈ వారం పెద్ధ సినిమాలు ఏమి లేకపోవడంతో ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం వుంది.
ఛావా మూవీ రివ్యూ – Chhaava Movie Review in Telugu – 2025
When is the release date of the movie Dragon?
The movie Dragon is scheduled to be released on February 21, 2025.
Who is the director of the film Dragon?
The movie Dragon is directed by Ashwath Marimuthu, who is also responsible for the story and screenplay.
Who are the lead actors in the Dragon?
The film Dragon features Pradeep Ranganathan, Anupama Parameswaran, and Kayadu Lohar in lead roles.
Which production company is backing this Dragon?
The film Dragon is produced by AGS Entertainment, led by Kalapathi S. Aghoram, Kalapathi S. Ganesh, and Kalapathi S. Suresh.
Who composed the music for the Dragon?
The music for the film Dragon is composed by Leon James.
Who is handling the cinematography for the movie Dragon?
The cinematography is done by Niketh Bommi Reddy.
Who is the editor of the movie Dragon?
The editing of the movie Dragon is done by Pradeep E. Raghav.