ఛావా మూవీ రివ్యూ – Chhaava Movie Review in Telugu – 2025
ఛావా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. కలెక్షన్ల విషయంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. పలు రికార్డులు కొల్లగొడుతూ ఊహించని విధంగా ‘ఛావా’ దూసుకుపోతుంది. అలాగే సినీ సెలబ్రిటీలను కూడా ఫిదా చేస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’(Chhaava). ఇందులో రష్మిక మందన్న(Rashmika Mandanna)హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని దినేష్ విజయన్(Dinesh Vijayan) నిర్మించారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో.. అక్షయ్‌ఖన్నా(Akshay Khanna), అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
విక్కీ కౌశల్ నట విశ్వరూపం చూపించాడు అని చెప్పాలి ఈ సినిమాలో.. డ్రామా సీన్స్ లో తన డైలాగ్స్, పెర్ఫార్మెన్స్ అదుర్స్ అనిపించగా, దానికి మించి యాక్షన్ సీన్స్ లో తను రెచ్చిపోయిన తీరు మరో లెవల్ అని చెప్పాలి.. సెకెండ్ ఆఫ్ లో ప్రీ క్లైమాక్స్ నుండి పూర్తిగా తన వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు.

క్లైమాక్స్ ఎపిసోడ్ ఎమోషనల్ గా ఉంటూనే తెరపై చూడటం కష్టంగా అనిపిస్తుంది. ఆడియన్స్ ఆ సీన్స్ ని ఫీల్ అయ్యేలా తన పెర్ఫార్మెన్స్ మరో లెవల్ లో ఆకట్టుకుంటుంది. ఇక రష్మిక రోల్ ఉన్నంతలో బాగుండగా ఔరంగజేబు గా చేసిన అక్షయ్ ఖన్నా మెప్పించాడు…
ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మంచి ఇంపాక్ట్ చూపించింది. మనకి తెలియకుండానే మనం ఈ కథలో లీనమైపోయామంటే దానికి కారణం బ్యాగ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి.
శివాజీ ఛత్రపతికి ఓ కొడుకు ఉన్నాడని, శంభాజీ మహారాజ్‌ని ‘ఛావా’ అని పిలుస్తారని కూడా చాలా మంది భారతీయులకు తెలియదని, సినిమాలు రాకపోతే ఇలాంటి మహనీయుల గురించి అస్సలు తెలుసుకునే అవకాశం కూడా ఉండేది కాదంటూ వ్యంగ్యంగా మన విద్యావ్యవస్థకు థ్యాంక్స్ అంటూ అల్లు శిరీష్ ట్వీట్ చేశాడు.
భారతదేశంపై దండెత్తిన ఔరంగజేబు, అక్బర్ గురించి పాఠ్యాంశ్యాల్లో చేర్చిన ప్రభుత్వం, ఛత్రపతి శివాజీ, శంభాజీ వంటి వాళ్ల గురించి ఎందుకు పాఠ్యాంశ్యాల్లో చేర్చలేదనే విషయం మీద ఎప్పటి నుంచే చర్చ జరుగుతూనే ఉంది. ప్రభుత్వం మారినా కూడా హిందూ ఛత్రపతులు, మహారాజ్‌ల చరిత్ర, పిల్లలకు తెలియడం లేదు.
సినిమా చూడకపోతే కచ్చితంగా చూడండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి.
అలెగ్జాండర్ ది గ్రేట్ ని ఓడించిన మహారాజు గురించి కనీసం విన్నారా – A Story of Alexander the Great