Menu Close

దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు – Devotional Stories in Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు – Devotional Stories in Telugu

ఒక పిల్లాడు దేవుడు ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాడు. బుధ్ధుడిలా ఇంటినుండి బయలుదేరాడు. అయితే ఇంటినుండి బయలుదేరినపుడు ఒక సంచిలో రెండు జతల బట్టలు కొన్ని రొట్టెలు పెట్టుకుని బయలుదేరాడు. నడిచినడిచి అలసిపోవడంతో విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు.

దగ్గరలో ఒక ఉద్యానవనం కనపడింది. వెళ్ళాడు. అక్కడ చక్కని చెట్లు పక్కన ఒక కుర్చీ ఉంది. కుర్చీ మీద కూర్చున్నాడు. ఆ తర్వాత ఆకలిగా అనిపించింది. తినడానికి ఒక రొట్టె తీసాడు. ఆ బాలుడుకి ఎదురుగా ఒక ముసలావిడ ఆకలిగా ఉంది అన్నట్లు చూస్తూ కనబడింది. ఆమె దగ్గరికి వెళ్లి ఒక రొట్టె ముక్క పెట్టాడు.

Devotional Telugu Stories – కల్మషము లేని భక్తి

ఆమె అతని వంక ఆప్యాయంగా చూస్తూ రొట్టె తీసుకుని తిని ప్రేమ పూర్వకంగా ఆ బాబు చల్లగా ఉండాలి అని ఆశీర్వాదంతో నవ్వింది. ఆ నవ్వు ఆ కుర్రాడికి చాలా ఆప్యాయంగా అనిపించింది ఆమె నవ్వు మళ్ళీ చూడాలి అనుకున్నాడు. ఇంకో సారి దగ్గరకి వెళ్లి మళ్ళీ రొట్టె ముక్క ఇచ్చాడు. ఆమె మళ్ళీ రొట్టె ముక్క తీసుకుని కృతజ్ఞతగా ఆప్యాయంగా ప్రేమగా నవ్వింది.

ఆ నవ్వు కుర్రవాడికి చాలా నచ్చింది. ఆమె నవ్వును ఆప్యాయతలను చూస్తూ ఉండాలి అనిపించింది. చాలా సేపు అతను రొట్టెలు అలా ఇస్తున్నాడు. ఆమె తీసుకుంటోంది. నవ్వుతోంది. ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు .

సాయంత్రం అయ్యింది. చీకటి పడుతోంది. లేచి వెళ్లి పోదాం అనుకున్నాడు. వెళ్లేముందు పరుగు పరుగున వెనక్కు వచ్చాడు. ఆమె దగ్గరగా వెళ్లి ఆమెను కౌగలించుకుని ఒక ముద్దు పెట్టాడు. ఆమె కూడా బాలుడిని దగ్గరకు తీసుకుని ఆశీస్సులు దీవెనలతో ముద్దు పెట్టుకుని తన ఆప్యాయతలు నవ్వును బదులు ఇచ్చింది.

బాలుడు ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేశాడు. అతడి ముఖం లో కనబడుతున్న దివ్యమైన ఆనందాన్ని చూసిన వాళ్ళ అమ్మ అడిగింది.
“కన్నా ! ఏమిటిరా ! ఈ రోజు నీ ముఖం లో అంత ఆనందం కనబడుతోంది. ఈ రోజు ఏమి జరిగిందిరా ?” అని “నేను ఇవాళ దేవుడితో కలిసి భోజనం చేశానమ్మా !” అన్నాడు ఆ కుర్రాడు.

ఈ కథ చదివాక మనసంతా ప్రశాంతంగా వుంది – Devotional Telugu Stories

అమ్మ సమాధానం కోసం ఎదురు చూడకుండానే“ నీకు తెలుసా అమ్మా ! నేను ఇప్పటి వరకూ అంత ఆప్యాయంగా అలా నవ్విన వాళ్ళని చూడనే లేదు” అన్నాడు.
ఆ ముసలామె కూడా ఇంటికి సంతోషం గా చేరింది. ఆమె ముఖం లో కనబడుతున్న ప్రశాంతతను చూసి “ఏమిటమ్మా ! ఇవాళ అంత ఆనందం గా ఉన్నావు ?” తన అడిగాడు కొడుకు.

“ఈ రోజు దేవుడిని చూశానురా!” అంది కొడుకుతో. అతడు సమాధానం ఇచ్చే లోపులోనే “ఆయనతో కలిసి ఉద్యానవనం లో రొట్టెలు తిన్నాను” .
“దేవుడు నేను అనుకున్న కంటే చాలా చిన్నవాడేరా!” అంది అమ్మ… ఈ సంఘటన నుండి మనం ఏమి తెలుసుకోగలం?

మనలో ఎవరమూ దేవుడిని చూడలేదు. ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఒక ఆత్మీయ స్పర్శ , ఒక చిన్న చిరునవ్వు, ఒక చిన్న మాట, ఒక చిన్న ఆలకింపు, ఒక చిన్న మెచ్చుకోలు, ఒక చిన్న సహాయం మన చుట్టూ ఉన్న వారిలో ఎంతో మార్పు తీసుకు రాగలదు .

జీవితం లో మనుషులు మనకు ఎదురుకావడం యాదృచ్చికం కాదు, దైవ సంకల్పం …. అది ఒక క్షణం కావచ్చు, కొంత కాలం కావచ్చు, జీవితాంతం కావచ్చు…

దేవుడు ఎక్కడో ఉండడు.
దేవుడు ఎవరో కాదు.
పేమలో,
వాత్సల్యం లో,
కమ్మని పలకరింపులో,
ఆప్యాయతలో,
సహాయంలో,
దయలో,
కరుణలో,
త్యాగం లో,
నిర్మలమైన స్నేహం లో
ఉంటాడు. అంతటా ఉంటాడు.
ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ ఉంటాడు.
ఎవరు దయగలవారో వారే దేవుడు.

రామాయణం కోసం రాలేదు, రాముని కోసం వచ్చా – Devotional Telugu Stories

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading