ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి – Chenab Rail Bridge Story in Telugu – చీనాబ్ బ్రిడ్జ్
జమ్మూకశ్మీర్‌ను మిగతా భారతదేశంతో అనుసంధానించేందుకు USBRL ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో కీలకమైన చీనాబ్ నదిపై బ్రిడ్జి నిర్మాణంతో సోమవారం(ఏప్రిల్ 5) చారిత్రక మైలురాయిని చేరినట్లయింది. ఈ బ్రిడ్జి కోసం 28,600 టన్నుల స్టీల్,66 వేల టన్నుల కాంక్రీట్ ఉపయోగించారు. దీని మొత్తం బరువు 10,619 మిలియన్ టన్నులు. దీని స్ట్రక్చరల్ డిటైలింగ్ కోసం టెక్లా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన గోల్డెన్ జాయింట్‌ను శనివారం ప్రారంభించారు. స్వాతంత్ర్యం తర్వాత మొట్టమొదటిసారిగా చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సింగిల్-ఆర్చ్ రైల్వే వంతెనపై ఓవర్‌ఆర్చ్ డెక్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ వంతన శ్రీనగర్‌లోని మిగిలిన భారతదేశానికి అనుసంధానించబడుతుంది.
చీనాబ్ నది లోయ రెండు చివరల నుంచి వంపుపై మొదలు.. అది చివరికి వంపు మధ్యలో కలుపుతుంది. ప్రపంచంలోని అద్భుతమైన ఇంజనీరింగ్ శ్రమకు జమ్ము కశ్మీర్ వేదికగా మారుతోంది. ఆ రాష్ట్రంలోని రియాసి జిల్లాలో 1.3 కి.మీ పొడవున్న చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించింది మోదీ సర్కార్.
ఈ వివరాలను కొంకణ్ రైల్వే చైర్మన్, ఎండీ సంజయ్ గుప్తా మీడియాతో తెలిపారు, “ఇది సుదీర్ఘ ప్రయాణం. ‘గోల్డెన్ జాయింట్’ అనే పదాన్ని సివిల్ ఇంజనీర్లు ఉపయోగించారని తెలిపారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన.” చీనాబ్ వంతెన అనేక సవాళ్లను అధిగమించి.. క్లిష్టమైన ఇంజనీరింగ్ ప్రతిభతో నిర్మించారని అన్నారు. ఎన్నో అతర్గత సమస్యలతో ఇబ్బంది పడుతున్న కశ్మిర్‌లో ఈ వంతెన కనెక్టివిటీని పెంచుతుందని వారు నమ్ముతున్నారు. కశ్మీర్ అభివృద్ధిలో ఈ బ్రడ్జి మరో మైలు రాయిగా ఆయన అభివర్ణించారు.
Chenab Rail Bridge Story in Telugu, World’s Highest Rail Bridge in Telugu, చీనాబ్ బ్రిడ్జ్