కాంబోడియా దేశంలోని అంగ్ కోర్ వాట్(Angkor Wat)
భారతీయ సంస్కృతికి చిహ్నంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా వెలుగొందుతోంది కాంబోడియాలోని “అంగ్‌కోర్ వాట్ దేవాలయం”. ప్రపంచ చారిత్రక కట్టడాలలో ఒకటిగా పేరు సంపాదించిన ఈ ఆలయం.. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడి, హిందూ సంస్కృతీ సౌరభాలను వెదజల్లుతోంది. భారతీయ పురాణేతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందర్నీ ఆకర్షిస్తోంది.కాంబోడియ, అలనాటి కాంభోజ రాజ్యము, తర్వాత కంపూచియ, నేటి కంబోడియ.
ఉత్తర కాంబోడియాలో సియమ్‌రీప్ అను పట్టణం దగ్గర 200 చదరపు కిలో మీటర్ల పరిధిలో దేవతలకు నిలయమైన పవిత్రస్థలంలో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సముదాయంగా ప్రసిద్ధి గాంచిన ప్రదేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంగ్‌కోర్ వాట్, బయాన్ అను దేవాలయాలతోబాటు అనేక దేవాలయాలు విలసిల్లు చున్నవి. ఖెమర్ రాజులచే కట్టబడిన ఈ దేవాలయం మన హిందూ నాగరికతకు ఆనవాళ్ళు. మూడవ శతాబ్దం నుండి దాదాపు వేయి సంవత్సరాలకు పైగా హైందవ నాగరికత కంబోడియలో ఉచ్ఛస్థితిలో ఉంది
కాంబోడియలో దాదాపు 1016 దేవాలయాలున్నాయని ప్రసిద్ధి. అందులో అంగ్‌కోర్ ప్రావిన్స్ నందు 294 దేవాలయాలున్నాయి. వీటిలో అంగ్‌కోర్ ప్రాంతంలో 198దేవాలయాలున్నవి. బట్టంబాన్స్ ప్రావిన్స్ ధాయిలాండ్ సరిహద్దులో నున్నది. ఆ ప్రాంతమునందు 340 దేవాలయాలు వున్నవి. సియామ్‌రీప్ పట్టణానికి చుట్టుపక్కల హిందూ దేవాలయాలతో బాటు బౌద్ధ దేవాలయాలు కూడా వున్నాయి.
తొలుత హిందూ దేవాలయ ములతో మొదలైన వారి నాగరికత మధ్యలో 12వ శతాబ్ద మందు ఏడవ జయవర్మన్ అను రాజు కాలమందు బౌద్ధమత వ్యాప్తి జరిగింది. రాజు బౌద్ధమతం అవలంబించుటచే స్వతహాగా, రాజు అనేక బౌద్ధ దేవాలయాలు నిర్మించి నను, ఆ దేవాలయములందు హిందూ దేవతల ప్రతిమలు చెక్కబడివున్నవి. ఆ తర్వాత ఎనిమిదవ జయవర్మన్ రాజు 13వ శతాబ్దమందు అనేక బౌద్ధ దేవాలయములను హిందూ దేవాలయాలుగా మార్పు చేసారు.
దక్షిణవసారా పడమటివైపు రెండవ సూర్యవర్మన్ రాజు పరివారంతో పోవు ఊరేగింపు దృశ్యమున్నది. దక్షిణపువసారా తూర్పువైపు మానవులు మరణించిన తర్వాత స్వర్గం, నరకాలకు పోవుట, అచ్చట వారు ఏ విధంగా వారి యొక్క పుణ్య, పాపఫలాలను అనుభవించు దృశ్యాలు చెక్కివు న్నారు. మూడు వరుసలలో వున్న ఈ దృశ్యంలో పై రెండు వరసలలో పుణ్యం చేసినవారు స్వర్గానికి పోవుట, క్రింది వరుసలోని వారు పాపఫలాలను అనుభవించుటకు నరకమునకు పోవుట వున్నవి. యమధర్మరాజు వృషభముపైన వున్నదృశ్యం, చిత్రగుప్తుడు, మరియు రౌరవాది నరకములలో పాపులను దండిచుట చక్కగా చెక్కారు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.