చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా…
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా…
చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా…
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా…
నా అడుగుల్లో అడుగేస్తూ… నా మదిలోయల్లో చూస్తూ
నా అడుగుల్లో అడుగేస్తూ… నా మదిలోయల్లో చూస్తూ
నా గుండెల్లో చొరబడి పోయావే…
చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా…
నెచ్చెలి పైటకు వెచ్చగ తాకే చిరుగాలినై…
నా చెలి నుదుటికి అందాన్నిచ్చే సింధురమై…
కమ్మని కలగా రమ్మని పిలిచే నా నేస్తమై…
హక్కున చేర్చుకు ఆరాధించే నా ప్రాణమై..
గున్నమావి తోటల్లోన నే ఎదురు చూస్తాలే…
గుప్పెడంత గుండెల్లోన చోటిస్తా రావయ్యో…
నా ప్రేమ రాశివి నువ్వే..ఆహాహా
నా ఊపిరి చిరునామా నువ్వే…
చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా…
మనసా వాచా నీ మదిలోన కొలువుండనా…
నా నిలువెల్లా దాసోహాలే చేసేయ్యనా…
ఎల్లలు లేని ప్రేమకు ద్వారం తెరిచెయ్యనా…
ఏడడుగులతో కొంగు ముడివేస్తా ఏదేమైనా…
నీ వెంటే నడిచొస్తాను ఆ నింగి దాటైనా…
నువ్వంటే పడి చస్తాను రేయైనా పగలైనా…
నా రెండు కన్నులు నువ్వే… ఆహాహా
నా చంటిపాపవు నువ్వే…
చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా…
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా…
నా అడుగుల్లో అడుగేస్తూ… నా మదిలోయల్లో చూస్తూ
నా అడుగుల్లో అడుగేస్తూ… నా మదిలోయల్లో చూస్తూ
నా గుండెల్లో చొరబడి పోయావే…
చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.