Menu Close

Bhu Bhu Bhujangam Ditthai Tarangam Song Lyrics In Telugu – భు భు భుజంగం లిరిక్స్

Bhu Bhu Bhujangam Ditthai Tarangam Song Lyrics In Telugu – భు భు భుజంగం లిరిక్స్

భు భు భుజంగం… ధిత్తై తరంగం
మృత్యుర్ మృదంగం… నా అంతరంగం
నాలో జ్వలించె తరంతరంగా… నటనై చలించె నరంనరంగా
పగతో నటించె జతి స్వరంగా… ఓఓ ఓఓ ఓ ఓఓ ఓ

పాడనా విలయ కీర్తన… ఆడనా ప్రళయ నర్తన
కారుమేఘాలు కమ్ముకొస్తున్న… కటిక చీకట్లలో
బానిసత్వాన రాణి వాసాలు… రగిలిన జ్వాలలో
డోలు కొట్టింది రాహువు… మేళమెత్తింది తీతువు
తరుముకొస్తోంది మృత్యువు… తరిగిపోతోంది ఆయువు
చావుతోనే తీరు నాకు వేదన, వేదన… ఆ ఆఆ

ఆడనా ప్రళయ నర్తన… పాడనా విలయ కీర్తన
బ్రహ్మ రాసిన రాతను… ఆ బ్రహ్మయే చెరుపలేడురా
ధర్మ మార్గమే తప్పితే… ఆ దైవమే నీకు కీడురా
ఎదురుకోలేవు విధిని ఈనాడు… ఎరుగరా నిన్ను నీవిక
రమణి సీతనే కోరిన… నాటి రావణుడు నేల కూలెరా
విషయ వాంఛలకు… గెలుపు లేదు ఏనాడు
అమ్మ జాతితో బొమ్మలాటలే కీడు

పడతిగా నేను పలుకుతున్నాను… జన్మకే నీకు చరమ గీతాలు
అసుర ఘాతాలు ఆశనిపాతాలు… దుర్గ హస్తాల ఖడ్గ నాదాలు
భగ భగ సెగలటు… భుగ భుగ పొగలిటు
మగువల తెగువలు… భగలుగా రగలగా
అగ్నిగా రేగిన ఆడతనం… హారతి కోరెను ఈ నిమిషం
నీ దుర్మరణం దుర్మరణం… దుర్మరణం దుర్మరణం.. ..

Bhu Bhu Bhujangam Ditthai Tarangam Song Lyrics In Telugu – భు భు భుజంగం లిరిక్స్

Like and Share
+1
0
+1
3
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading