ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Bhu Bhu Bhujangam Ditthai Tarangam Song Lyrics In Telugu – భు భు భుజంగం లిరిక్స్
భు భు భుజంగం… ధిత్తై తరంగం
మృత్యుర్ మృదంగం… నా అంతరంగం
నాలో జ్వలించె తరంతరంగా… నటనై చలించె నరంనరంగా
పగతో నటించె జతి స్వరంగా… ఓఓ ఓఓ ఓ ఓఓ ఓ
పాడనా విలయ కీర్తన… ఆడనా ప్రళయ నర్తన
కారుమేఘాలు కమ్ముకొస్తున్న… కటిక చీకట్లలో
బానిసత్వాన రాణి వాసాలు… రగిలిన జ్వాలలో
డోలు కొట్టింది రాహువు… మేళమెత్తింది తీతువు
తరుముకొస్తోంది మృత్యువు… తరిగిపోతోంది ఆయువు
చావుతోనే తీరు నాకు వేదన, వేదన… ఆ ఆఆ
పడతిగా నేను పలుకుతున్నాను… జన్మకే నీకు చరమ గీతాలు
అసుర ఘాతాలు ఆశనిపాతాలు… దుర్గ హస్తాల ఖడ్గ నాదాలు
భగ భగ సెగలటు… భుగ భుగ పొగలిటు
మగువల తెగువలు… భగలుగా రగలగా
అగ్నిగా రేగిన ఆడతనం… హారతి కోరెను ఈ నిమిషం
నీ దుర్మరణం దుర్మరణం… దుర్మరణం దుర్మరణం.. ..
Bhu Bhu Bhujangam Ditthai Tarangam Song Lyrics In Telugu – భు భు భుజంగం లిరిక్స్