ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Business Ideas in Telugu – ఈ మసాలా దినుసును పండిస్తే లక్షల్లో ఆదాయం
Business Ideas in Telugu – Black Pepper Farming: మిరియాల సాగు ద్వారా మారక్ కూడా లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. 2019లో తన తోటలో రూ.19 లక్షల విలువైన మిరియాలను ఉత్పత్తి చేశాడు. ఆయన సంపాదన రోజురోజుకూ పెరుగుతోంది.
డబ్బు బాగా రావాలంటే ఏం చేయాలి? ఏదైనా మల్టీ నేషనల్ కంపెనీలో మంచి ఉద్యోగమైనా ఉండాలి? లేదంటే వ్యాపారమైనా చేయాలని చాలా మంది భావిస్తారు. కానీ వ్యవసాయం చేసి కూడా లక్షలు, కోట్లు సంపాదించవచ్చు. సంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా.. సేద్యం చేస్తూ.. ఎంతో మంది రైతులు భారీగా ఆదాయం పొందుతున్నారు. మీ కోసం అలాంటి ఐడియానే తీసుకొచ్చాం.
మనదేశంలో మిరియాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇతర దేశాల్లో కూడా భారీగా ధర పలుకుతోంది. మేఘాలయకు చెందిన నానాద్రో బి. మారక్ అనే రైతు మిరియాలు పండిస్తూ (Black Pepper Farming).. భారీగా ఆదాయం పొందుతున్నారు. 5 ఎకరాల భూమిలో మిరియాలను సాగు చేస్తున్నారు. ఆయన విజయాన్ని చూసి.. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
ఆ తర్వాత క్రమంగా పంటను విస్తరించారు. వీరు పండించే మిరియాలు మంచి నాణ్యతవి కావడంతో.. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. నానాడో మారక్ ఇల్లు ల్లు వెస్ట్ గారో హిల్స్ కొండలలో ఉంది. ఎవరైనా ఈ ప్రాంతానికి వెళ్తే.. నల్ల మిరియాలు వంటి సుగంద ద్రవ్యాల సువాసన వారికి స్వాగతం పలుకుతుంది.
గారో హిల్స్ కొండ కోనలతో కూడిన అటవీ ప్రాంతం. చెట్లను నరకకుండా, పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా… ఇక్కడ మిరియాల సాగు చేస్తున్నారు నానాడో మారక్. మిరియాల సాగుకు రాష్ట్రవ్యవసాయ, ఉద్యానవనశాఖ పూర్తి సహకారం అందించారు. మారక్ మిరియా సాగులో విజయవంతమవడంతో చుట్టుపక్కల ప్రజలు కూడా దీని పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇతర రైతులకు సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు.
నానాద్రో మారక్ చెప్పిన వివరాల ప్రకారం.. పొలంలో 8-8 అడుగుల దూరంలో నల్ల మిరియాలు మొక్కలను నాటాలి. రెండు మొక్కల మధ్య అంత దూరం ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మొక్కలు పెరగడానికి ఉపయుక్తంగా ఉంటుంది.
ఇక చెట్టు నుంచి మిరియాలను తీసిన తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మిరియాల గింజలను నీటిలో కొంతసేపు ముంచి.. ఆ తర్వాత ఎండబెట్టాలి. అప్పుడే గింజలకు మంచి రంగు వస్తుంది. కాస్త శ్రద్ధ పెట్టి.. అంకితభావంతో.. మిరియాల సాగు చేస్తే.. సంప్రదాయ పంటల కంటే.. అనేక రెట్లు అధిక ఆదాయం పొందుతారని తెలిపారు.
మిరియాల సాగు ద్వారా మారక్ కూడా లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. 2019లో తన తోటలో రూ.19 లక్షల విలువైన మిరియాలను ఉత్పత్తి చేశాడు. ఆయన సంపాదన రోజురోజుకూ పెరుగుతోంది. నానాద్రో బి. మారక్ వ్యవసాయ రంగంలో చేస్తున్న కృషి, అంకితభావాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం ఆయన్ను అభినందించింది. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించి దేశంలోని ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలిచినందుకు 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మారక్‌కు పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.