Business Ideas in Telugu – ఈ మొక్కలతో మలేరియా మందు తయారీ.. రైతులకు భారీగా ఆదాయం
CIMAP శాస్త్రవేత్తలు ఆర్టెమిసియా CIM-సంజీవని రకంలో ఆర్టెమిసినిన్ కంటెంట్ 1.2 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ జాతిలో మెనింజైటిస్‌తో పాటు క్యాన్సర్‌తో సహా ఇతర వ్యాధుల మందుల తయారీలో వినియోగించే మూలకాలు ఉన్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ వ్యవసాయం (Contract Farming) ట్రెండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఔషధ మొక్కల పెంపకానికి ఎన్నో కంపెనీలు ముందుకొస్తున్నాయి. కొందరు రైతులతో ఒప్పందం చేసుకొని.. ఔషధ మొక్కలను పండించి.. వారికి మద్దతు ధర ఇస్తున్నాయి. ఇప్పుడు యాంటీ మలేరియా డ్రగ్ తయారీలో వాడే.. ఆర్టెమిసియా అనే ఔషధ మొక్కలను కూడా పెంచేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి.
తాము అభివృద్ధి చేసిన కొత్త జాతి ఆర్టెమిసియా రకం CIM-సంజీవని మొక్కల పెంపకం కోసం చెన్నైకి చెందిన కంపెనీతో CIMAP ఒప్పందం చేసుకుంది. మన దేశంలోని ఔషధ కంపెనీలు విదేశాల నుంచి మలేరియా మందుకు ముడి సరుకును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఐతే ఇప్పుడు ఆర్టెమిసియా మొక్కలను ఇక్కడే సాగు చేస్తే.. ఔషధ కంపెనీలకు దిగుమతి వ్యయం తగ్గడంతో పాటు రైతులకు మంచి ఆదాయం వస్తుంది.
ఆర్టెమిసియా (Artemisia) మొక్కలో ఆర్టెమిసినిన్ అనే మూలకం ఉంటుంది. దీని నుంచి మలేరియా (Malaria) ఔషధం తయారు చేస్తారు. మలేరియాను కారణమైన ఆర్టెమిసినిన్ ప్లాస్మోడియం ఫాల్సిపరం అనే సూక్ష్మక్రిమిని ఇది చంపుతుంది. ఈ మొక్క సాధారణంగా చైనాలో ఎక్కువగా కనిపిస్తుంది.
అక్కడి నుంచి ఇండియాకు తీసుకొచ్చి కొత్త జాతిని సిద్ధం చేస్తున్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)కు చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ (CIMAP), బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU)తో సహా అనేక సంస్థలు దీనిపై ప్రయోగాలు చేశాయి.
CIMAP శాస్త్రవేత్తలు ఆర్టెమిసియా CIM-సంజీవని రకంలో ఆర్టెమిసినిన్ కంటెంట్ 1.2 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ జాతిలో మెనింజైటిస్‌తో పాటు క్యాన్సర్‌తో సహా ఇతర వ్యాధుల మందుల తయారీలో వినియోగించే మూలకాలుఉన్నాయి. దాని నుంచి ఆహార మాత్రలు, ఇంజెక్షన్లు తయారు చేస్తారు.
CIM-సంజీవని రైతులతో పాటు వ్యవసాయ పరిశ్రమకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని జర్నల్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్ సైన్సెస్‌లో ప్రచురించిన నివేదిక పేర్కొంది. ఈ మొక్కతో ఫార్మాస్యూటికల్ కంపెనీలు దాదాపు 20 శాతం వరకు ఖర్చులను తగ్గించుకోవచ్చని నివేదిక పేర్కొంది.
ఆర్టెమిసియా సాగు ద్వారా రైతులు నాలుగు నెలల వ్యవధిలో హెక్టారుకు సుమారు 65 వేల వరకు లబ్ధి పొందవచ్చు. ఈ ప్లాంట్‌తో కాంట్రాక్టు వ్యవసాయం చేసేందుకు భారతీయ కంపెనీలు ముందుకు రావడానికి ఇదే కారణం.
చెన్నైకి చెందిన సత్త్వ వైడ్ నేచర్స్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక వారం క్రితం CIMAPతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్టెమిసియా కాంట్రాక్టు వ్యవసాయాన్ని ఈ కంపెనీ చేస్తుంది. ప్రాసెసింగ్‌కు సంబంధించిన సాంకేతికత అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుంది.
CIMAP డైరెక్టర్ ప్రబోధ్ కుమార్ త్రివేది సమక్షంలో CSIR-CIMAP అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరేష్ కుమార్, సత్త్వ వైద్ నేచర్స్ గ్లోబల్ ప్రైవేట్ డైరెక్టర్ శ్రేనిక్ మోడీ సంతకం చేశారు. ఈ కంపెనీ రైతుల నుంచి మొక్కలు సేకరించి ఫార్మాసూటికల్ కంపెనీలకు చేరవేస్తుంది. రైతులు పండించిన పంటకు పొలాల్లోనే ధర లభిస్తుంది.
CIMAP డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల పరిశోధనల తర్వాత కొత్త జాతిని అభివృద్ధి చేశామని చెప్పారు. ఇప్పటికే ఉన్న జీవన్ రక్ష, CIM ఆరోగ్య మధ్య పాలీక్రాస్ చేసి దీనిని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CDRI)కూడా ఈ మొక్కను యాంటీ మలేరియా మెడిసిన్‌కి అనువైనదిగా తప పరిశోధనలో వెల్లడించింది.
Subscribe to Our YouTube Channel
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.