Business Ideas in Telugu – ఈ పూల సాగుతో నెలకు 30,000 కన్నా ఎక్కువ ఆదాయం
Business Ideas in Telugu: మార్కెట్లో ఒక్కో గెర్బెరా పువ్వు (Gerbera flowers) ఖరీదు రూ.5-6 వరకు ఉంది. నెలరోజుల్లో 7వేల పూల వరకు ఈజీగా వస్తాయి. తద్వారా మీరు 35,000 వరకు ఆదాయం వస్తుంది.
మన దేశంలో రైతుల ఆలోచన విధానంలో ఇప్పుడిప్పడే మార్పు వస్తోంది. వరి, మొక్కొజన్న, జొన్న, మొక్కజొన్న వంటి పంటలనే కాకుండా.. వాణిజ్య పంటలను కూడా పండిస్తున్నారు. మార్కెట్‌లో బాగా డిమాండ్ ఉండి.. రేటు ఎక్కువగా లభించే.. పంటల సాగు వైపు మొగ్గుచూపుతున్నారు.
మీరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ… మంచి లాభాలిచ్చే పంటల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? పూల సాగుతో బాగా ఆదాయంవస్తుంది. అందులోనూ కాస్త వెరైటీ పాలను పండిస్తే.. లాభాలు బాగా వస్తాయి. మనదేశంలో చాలా మంది రైతులు గెర్బెరా పూల (Gerbera Flowers)ను సాగుచేస్తే.. లక్షల్లో డబ్బు సంపాదించవచ్చు.
అనేక రాష్ట్రాలు హార్టికల్చర్ మిషన్ కింద గెర్బెరా పూల సాగు(Gerbera Farming)ను ప్రోత్సహిస్తున్నాయి. గెర్బెరా పూలను సాగుచేసే రైతులకు డ్రిప్, మల్చింగ్, హాఫ్ హెచ్‌పీ మోటార్ పంపు, షేడ్ నెట్ ఉచితంగా అందజేస్తున్నారు. గెర్బెరా పువ్వుకు మార్కెట్‌లో మంచి ధర లభిస్తోంది. అంతేకాదు ఈ పంట సాగుకు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. షేడ్ నెట్‌లో గెర్బెరా పూలను సాగు చేయాల్సి ఉంటుంది.
30X30 మీటర్ల షేడ్ నెట్‌లో 3200-3300 వరకు గెర్బెరా మొక్కలను నాటవచ్చు. ఈ మొక్కలు 90 రోజుల తర్వాత పుష్పించడం ప్రారంభిస్తాయి. ఒక్క పూల దశకు వచ్చాక.. భారీగా ఆదాయం వస్తుంది.ఎందుకంటే ఈ మొక్కలు పెద్ద ఎత్తున పువ్వులను ఇస్తాయి. ఒక నెలలో 10 సార్లు పువ్వును తీయవచ్చు. ప్రతిరోజూ 700-800 పూలను షేడ్ నెట్ నుండి కోయవచ్చు.
మార్కెట్లో ఒక్కో గెర్బెరా పువ్వు (Gerbera flowers) ఖరీదు రూ.5-6 వరకు ఉంది. నెలరోజుల్లో 7వేల పూల వరకు ఈజీగా వస్తాయి. తద్వారా మీరు 35,000 వరకు ఆదాయం వస్తుంది. దీని సాగుకు 5000 రూపాయల వరకు ఖర్చవుతాయి. ఈ ఖర్చుపోగా.. నెలకు 30,000 ఆదాయం వస్తుంది. ఆరు నెలల్లో 1,80,000 రూపాయలు వరకు సంపాదించవచ్చు. గెర్బెరా పూల సాగు చేసే రైతులు..
మొక్కలకు నీటిని పెట్టేందుకు సమయం కేటాయించాలి. షేడ్ నెట్‌కు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ ఉండాలి. వీటి కింద మొక్కలను పెంచడం వల్ల దుమ్మ, ఇతర తెగుళ్ల బాధలు ఉండవు. రైతులు కాస్త శద్ధ పెట్టి..ఈ పూల సాగు చేస్తే.. మంచి లాభాలే వస్తాయి. వీటిని సాగు చేస్తూ.. ఇతర పనులు కూడా చేసుకోవచ్చు.
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.