Redmi TV జస్ట్ - 8000/-
Samsung Fridge 183 L జస్ట్ - 13000/-
LG వాషింగ్ మెషిన్ - జస్ట్ - 9000/-
Samsung phone at - 10000/-
realme Earbuds జస్ట్ - 900/-
Benefits of Donkey Milk in Telugu – గాడిద పాలు ఉపయోగాలు
గాడిద పాలు తల్లి పాలకు చాలా దగ్గరగా ఉంటాయట. ఒక్కో గాడిద రోజుకు 1 లీటరు పాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అందువల్లే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు గాడిద పాలలో ఔషధ గుణాలతో పాటు సౌందర్యాన్ని పెంచే గుణాలు కూడాడ ఉంటాయట. అవేంటంటే..
గాడిద పాలు మానవ రొమ్ము పాలు, ఆవు పాలతో సమానమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయట. అందుకనే శిశువులకు ఇవి పట్టించడం మంచిదని అంటుంటారు.
వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి తాగడం వల్ల శరీరానికి కేలరీలు, విటమిన్- డి ఎక్కువగా అందుతాయి. ఇవి లాక్టోస్ రూపంలో ఉంటాయి.
దీంట్లోని యాంటీ-మెక్రోబయాల్ లక్షణాలు అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్ల నుంచి దూరం చేసేందుకు సహాయపడతాయి.
ముఖ్యంగా అలెర్జీని దూరం చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఆవు పాలతో పోలిస్తే.. గాడిద పాలలో ఐదు రెట్లు తక్కువ కెసిన్, సమానస్థాయిలో ప్రొటీన్లు కలిగి ఉంటాయి. అందుకనే వీటిని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.
గాడిద పాలలో మరొక ముఖ్యమైన భాగం లాక్టోస్. ఇది మీ శరీరం కాల్షియం గ్రహించడానికి సహాయపడి, ఎముకలను బలంగా మారుస్తుంది.
వీటిలోని ఇతర సమ్మేళనాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే ప్రోటీన్లు సైటోకిన్‌ల విడుదలను ప్రోత్సహించే సామర్థ్యాన్ని గాడిద పాలు కలిగి ఉన్నాయి.
గాడిద పాలు కణాలను నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేయడానికి కారణమవుతాయి. రక్త నాళాలను విడదీసి, నైట్రిక్ ఆక్సైడ్ మీ రక్త నాళాలకు అందించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది.
గాడిద పాలు సౌందర్య ఉత్పత్తులైన స్కిన్ క్రీములు, ఫేస్ మాస్క్‌లు, సబ్బులు మరియు షాంపూల తయారీలో వాడతారు.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.