అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Beautiful Telugu Stories – ఎన్నో అద్బుతమైన కథలు మీ కోసం
భగవంతుడి కోసం సమయం కేటాయిస్తే మన ఉన్నతి కోసం మనం సమయం కేటాయించినట్టే – Beautiful Telugu Stories
సిద్దార్ధ వయసు 58, ట్రైన్లో TC, టికెట్ టికెట్ అంటూ ట్రైనులో అటు నుండి ఇటు వస్తూ ఉంటే ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది.దానిని పైకి తీశాడు అందులో కొద్దిపాటి చిల్లర నోట్లు ఒక కృష్ణుడి ఫోటో తప్ప ఏమీ లేవు. ఎవరిదో తెలిపే ఆనవాళ్ళు ఏమీ లేవు.ఎలా తిరిగి ఇవ్వడం ? “ఈ పర్స్ ఎవరిదండీ ? ” అంటూ అడిగారు. అందరూ పర్స్ కేసీ చూశారు తమ జేబులు తడుముకున్నారు.

ఇంతలో పక్క బెర్తులో కూర్చున్న ఒక వృద్ధుడు నెమ్మదిగా వచ్చి అది తన పర్స్ అని చెప్పాడు.”మీ పర్సు అని నమ్మకం ఏమిటీ ? ఏదైనా ఆనవాలు చెప్పండి”. “అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండీ” అన్నాడాయన. “ఆ ఒక్క ఆనవాలు చెబితే ఎలాగండీ ? ఇంకా ఏదైనా చెప్పండి. మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా !”అప్పుడు ఆ వృద్ధుడు చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమే.
“బాబూ ! అది నాకు చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన పర్సు అప్పుడు నాకు మా అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను.కాలం గడిచే కొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది. అందుకని నేను అప్పుడు పర్సులో నా ఫోటో పెట్టుకున్నాను.నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది. నా భార్య చాలా అందగత్తె.
Heart Touching Stories in Telugu
Sad Stories in Telugu
Emotional Stories in Telugu
కు ఆమె అంటే చాలా ప్రేమ. అపుడు ఆమె ఫోటో పర్సులో పెట్టుకునే వాడిని.ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి కోసం ఆఫీసు వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని. వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని. వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునే వాడిని. వాడే నా లోకం. అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునే వాడిని. వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు.
నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది. కొడుకు నన్ను మరచిపోయాడు. నా కెవ్వరూ లేరు. ఇపుడు భయం వేస్తోంది. ఈ వయసులోనేగా తోడు కావాలి. అందుకని నాకు తోడుగా కృష్ణుడిని పెట్టుకున్నాను. ఆయనే నాకు ఇపుడు తోడు. నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు. నా విచారానికి ఓదారుస్తాడు.
Love Stories in Telugu
Prema Kathalu, Short Stories

నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో పర్సులో పెట్టుకోవలసిన నేను చాలా ఆలస్యంగా గుర్తించాను. ఇప్పుడు నేను ఆయనతో గడుపుతున్నాను.సిద్దార్ధ మాట్లాడకుండా పర్సు ఆయనకు ఇచ్చేశాడు. పక్క స్టేషనులో రైలు ఆగింది. సిద్ధార్ధ రైలు దిగి బుక్ స్టాలుకి వెళ్ళాడు. దేవుడి ఫోటోలు ఉన్నాయా.. పర్సులో పెట్టుకోడానికి అని అడిగాడు. ఈ లోకం లో ఒక్క భగవంతుడు తప్ప నిన్ను కాపాడే వాడేలేడు నిత్యం మనకు ఎన్ని పనులు వున్న భగవంతునికి కాస్త సమయం కేటాయిస్తే ఆయన మన కోసం జీవితకాలం తోడు వుంటాడు.
Inspiring Telugu Stories
Pitta Kathalu, Neethi Kathalu
Moral Stories in Telugu