రష్యా ఉక్రెయైన్ యుద్ధం మీకు అర్దమయ్యే భాషలో – Russia and Ukraine War in Telugu
ఒక అందమైన భార్య పని అంతా ముగించుకుని బెడ్ రూమ్ లోకి వచ్చేసరికి
అప్పుడే టీవీ లో వస్తున్న వార్తలను చూసి కొంచెం విసుగ్గా ఆ దరిద్రపు రష్యా కు ఏమైంది….⁉️⁉️⁉️
చూడు Ukraine వాళ్ళెంత ఇబ్బంది పడుతున్నారో అంటాడు మొగుడు తన పెళ్లాంతో
సెల్ లో వీడియో చూస్తూ …
ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్లి పక్క సర్దుకుంటూ…
అప్పటికే పడుకున్న పిల్లలకు దుప్పటి బాగా విదిలించి కప్పుతుంది…
అతడి మాటల్ని వినీ విననట్లుగా….
నీకే చెప్పేది …!
వాడలా రెచ్చిపోతుంటే ప్రపంచ దేశాలేమి చేస్తున్నాయి…?
నీవేంది అలా దిబ్బ రొట్టె ముఖం వేసి చూస్తున్నావు ..?
వాడిష్టం వాడు NATO లో చేరుతాడో … లేక ఇంకోదానిలో చేరుతాడో వీడికేమైందట … ⁉️
వీడికేమవసరం …⁉️⁉️⁉️
అలా రెచ్చిపోతాడా …⁉️
అంటూ ఉక్రోష పడతాడు మొగుడు పెళ్ళాం మీద.
నటుడు పృద్విరాజ్ లెవెల్లో…
ఇవేవీ పట్టించుకోకుండా పాపం ఆమె అటు తిరిగి పడుకుంటుంది.
రేపు ఉదయం మళ్లీ తొందరగా లేవాలని, పిల్లలకి బాక్స్ లో ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ……
రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసిన దానికన్నా , తన పెళ్ళాం తనకు సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా పడుకోవడం అస్సలు సహించలేక పోతున్నాడు మొగుడు …
అసలే ఉదయం నుంచి ఎన్నో పేపర్లు, యూట్యూబ్ ఛానళ్లు ,చర్చా వేదికలు వినీ వినీ వినీ తన పాండిత్యాన్ని భార్య దగ్గర చూపించాలని ముచ్చట పడుతుంటే…,
ఆమె అలా సింపుల్ గా అతడి మాటలు పట్టించుకోకుండా పడుకోవడం అతనికి ఎక్కడో బాధించింది …
తనేదో గొప్ప విజ్ఞానఖని అని… సమస్తం అతడికే తెలుసని…
పెళ్ళానికి ఏమీ తెలియని వెర్రి బాగుల్ది అని అతని ప్రగాఢ విశ్వాసం.
కొంతైనా ఆమెను ఎడ్యుకేట్ చేయాలని అతడి తాపత్రయం …
ఆ Frustration లో … అసలు వాడ్ని కాదే నిన్ను…,
నిన్ను అనాలి కనీసం అవగాహన లేకుండా , తిన్నామా, పడుకున్నామా అని కాదే …
మన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకునే పనిలేదా…
అందుకే…,
పేపర్ చదవ్వే కొద్దిగానైనా వార్తలు చూడవే,
నాలాంటి వాడితో అప్పుడప్పుడు చర్చించవే … అని నెత్తీ నోరు కొట్టుకునేది …
వింటేగా…,
ఆమాత్రం పరిజ్ఞానం లేని దాన్ని నాకిచ్చి పెళ్లి చేసావేమయ్యా దేవుడా అని ఒకసారి పైకి చూసి
మళ్లీ ఏదో గొణుక్కుంటూ కూర్చుంటాడు సెల్ తీసుకుని వాట్స్ అప్ ఓపెన్ చేసి …
చూసీ చూసీ చూసీ ….
ఇక తప్పదన్నట్లుగా …,
కోపం వచ్చి విసురుగా లేచి అతడిని సీరియస్ గా చూసి వంటింట్లోకి వెళ్లి పెద్ద కత్తి తెచ్చుకుని,
పక్కన పెట్టుకుని అలా మంచం మీద పడుకొని లైట్ ఆర్పేసి,
అదోలా చూస్తూ వచ్చి పడుకోండి అంటుంది మురిపెంగా …
అదంతా చూసిన మొగుడికి అప్పటికే ముచ్చెమటలు పోసాయి …
ఎక్కడెక్కడో తడిచిపోతుంది …. మెల్లగా టవల్ తో తుడుచుకుంటూ …
అదేంటే …, అంత పెద్ద కత్తి తెచ్చుకుని అలా పెట్టుకుని పడుకుంటే నీ దగ్గర నేను ఎలా పడుకునేది …
అంటాడు భయం భయంగా … అటూ ఇటూ చూస్తూ…,
ఒక్కసారి అతడిని పైకి కిందికి ఎగాదిగా చూసి …!!!
నీ భార్యనైన నేనే…, ఒక కత్తి తెచ్చుకుని పడుకుంటే నీవు ధైర్యంగా పడుకోలేక పోతున్నావే…
మరి అమెరికాకు అమ్ముడుబోయి NATO లో చేరాలని ఉవ్విల్లూరుతూ,
రష్యా కు పక్కలో బల్లెంలా తయారయిన ఉక్రెయిన్ ని పక్కలో పెట్టుకుని రష్యా ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతుంది
అని చెప్పి అటు మల్లి పడుకుంటుంది భార్య …
ఇంకేం గింగిరాలు తిరుగిన భర్త … అప్పుడు తెరిచిన నోరు ఇంకా మూసుకోలేదు.
పాపం భర్త …
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.