Nee Style Nakistam Song Lyrics in Telugu
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం
అంతొద్దు లేమ్మ ఈ స్నేహం చాలమ్మ నువు నా బంధం ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే తరముతున్నది నీకేసి
తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నాపేరే

నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుందిరా…
అలగకున్నా సరే నీపై మోజు కలిగెలేరా…
అందరి తీరుగా నేను తెలుగు కుర్రాణ్ణిగా…
ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమా చాలిక…
నీ మగసిరి నడకలలోన తెలియని మత్తేదో ఉందిరా
అది నన్ను తడిపి ముద్ద చేసే…
పగలే కల కంటున్నావో కలవరింతలో ఉన్నావో
ఊహనుండి బయటకు రావమ్మో ఓ ఓ ఓ
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం
నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా…
సుటిగా చెప్పనా నీలో కోపం నచ్చేరా…
ప్రేమనే గుడ్డిది అంటే నమ్మలేదెన్నడూ…
నమ్మక తప్పదు నిన్నే చుశా ఇప్పుడు
నీ కంటిబొమ్మల విరుపు నీచుల పై కొరడా చరుపు అది నీపై వలపె కలిపెరా…
పూవంటి హృదయంలోన తేనంటి మనసే నీది నీ ప్రేమకు ఇదిగో జోహారే…
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం
అంతొద్దు లేమ్మ ఈ స్నేహం చాలమ్మ నువు నా బంధం ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే తరముతున్నది నీకేసి
తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నాపేరే
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం
Nee Style Nakistam Song Lyrics in Telugu
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.