ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
యుక్త వయసులో ప్రేమ విఫలమైతే అనుబవించే బాధ మాటల్లో చెప్పలేనిది…అది జీవితాంతం వేదిస్తుంది.
ఈ సమాజంలో యుక్త వయసులో ప్రేమించుకుని అటు ప్రేమలోను, ఇటు కెరీర్ లోనూ బాగు పడిన వారు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఎందుకంటే ఆలోచనలో పరిపక్వత లేనితనం, బావిష్యత్తు ప్రణాళిక లేకపోవడం. కేవలం ప్రేమలోనే మునిగి తేలడం. అదృష్టం కొద్ధీ ప్రేమలో విజయం పొంది, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న వారికి కొంత సపోర్ట్ వుంటుంది. దురుదృష్టం కొద్ధీ వారి ప్రేమ విఫలమైతే అప్పుడు అనుబవించే బాధ వర్ణనాతీతం. ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు వారి జీవితంలో చాలా మార్పు తీసుకొస్తుంది. తరవాతి కాలంలో వేరొకరిని ప్రేమించలేరు, ప్రేమించిన వారిని మరిచిపోలేరు ఆ జ్ఞాపకాలు జీవితాంతం వేదిస్తాయి.
టీనేజీ ప్రేమల సంగతి పక్కన పెడితే ఈ టీనేజ్ దశ దాటిన తర్వాత కూడా ప్రేమలో పడ్డవారికి పెద్దగా పరిణతి ఉండకపోవడం బాధించే అంశం. ఎందుకంటే, టీనేజీ తర్వాతే అసలు జీవితం మొదలవుతుంది. 19 దాటాక కూడా టినేజీ తాలూకు ఛాయలు మరో రెండు మూడేళ్ళ వరకు అలానే ఉంటాయి. అందరికీ ఉంటుందని కాదు కానీ కొద్ది మందిలో అలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐతే ఇరవైల్లో ప్రేమలో పడేవాళ్ళు కొన్నివిషయాలు తెలుసుకోవాలి. అవేంటో ఇక్కడ చూద్దాం.
మీ తొలిప్రేమ ఇరవైల్లోనే మొదలైతే గనక దానికి అత్యంత తీవ్రత ఉంటుంది. స్కూళ్ళలో క్రష్ సంగతి పక్కన పెడితే ప్రేమ గురించి సరిగ్గా ఆలోచించిన వయసు ఇరవై మొదట్లో ఉంటే గనక ఆ ప్రేమ తాలూకు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఆనందాలూ ఎక్కువే. అనర్థాలూ ఎక్కువే. ఒకవేళ ఇలాంటి ప్రేమలో ఏదైనా చిన్న అపర్థాలు వస్తే గనక అప్పుడున్నంత నరకం ఇంకెప్పుడూ ఉండదు. ప్రేమను ఈజీగా వదులుకోలేరు కాబట్టి ఆ ప్రక్రియలో కాలిపోతూ ఉంటారు.
అటు ప్రేమ, ఇటు కెరియర్.. రెండూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. మీరు నిజంగా చదువులో తోపు అయ్యుండి అటు ప్రేమనీ, ఇటు కెరియర్ ని బ్యాలన్స్ చేసుకునే వాళ్ళయితే తప్ప మిగతా వారు ఈ చిక్కుముడిలో పడి దేన్నో ఒకదాన్ని లైట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే జాగ్రత్త.