ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Banana Health Benefits in Telugu – అరటిపండు వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు
ప్రపంచంలో కొన్ని పండ్లు కొన్నిచోట్ల మాత్రమే దొరుకుతాయి కానీ కొన్ని పండ్లు మాత్రం సులువుగా ప్రపంచంలో అన్ని చోట్ల దొరుకుతుంది. అరటి పండు ప్రపంచ వ్యాప్తంగా సులువుగా దొరుకుతుంది, ఒక సీజన్ అని కాకుండా సంవత్సరం మొత్తం మార్కెట్ లో కనిపిస్తూనే ఉంటుంది. ఈ అరటి పండు ధర కూడా ఎక్కువగా ఉండదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరు దీనిని ఇష్ట పడుతారు.
ఒక మీడియం సైజు అరటి పండు లో 100 గ్రామ్ లకు కింద చూపిన విధంగా పోషక విలువలు
పేరు | మొత్తం |
పొటాషియం (Potassium) | 358mg |
శక్తి (Energy) | 89kcal |
నీరు (Water) | 74.9g |
మెగ్నీషియం (Magnesium) | 27mg |
కార్బో హైడ్రేట్ (Carbohydrate) | 22.8g |
ఫాస్ఫరస్ (Phosphorus) | 22mg |
షుగర్ (Sugars) | 12.2g |
ఖోలిన్ (Choline) | 9.8mg |
విటమిన్ సి (Vitamin C) | 8.7mg |
స్టార్చ్ (Starch) | 5.38g |
కాల్షియం (Calcium) | 5mg |
ఫైబర్ (Fiber) | 2.6g |
ప్రోటీన్ (Protein) | 1.09g |
సోడియం (Sodium) | 1mg |
విటమిన్ బీ 6 (Vitamin B-6) | 0.367mg |
కొవ్వు (fat) | 0.33g |
మాంగనీస్ (Manganese) | 0.27mg |
ఐరన్ (Iron) | 0.26mg |
జింక్ (Zinc) | 0.15mg |
అరటిపండు ప్రయోజనాలు
- అరటి పండు లో ముఖ్యమైన విటమిన్ లు మరియు పోషకాలు ఉంటాయి
- అరటి పండు గుండె యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది
- అరటికాయ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది
- అరటి పండు కిడ్నీ యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది
- అరటి పండు మన శరీర బరువు తగ్గించటంలో సహాయపడుతుంది
- అరటిపండు లో అద్భుతమైన ఆంటియాక్సిడెంట్స్ ఉంటాయి
- అరటి పండు వ్యాయామానికి మంచి శక్తి ని ఇస్తుంది
- అరటి పండు ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది
- అరటి కాయ ఇన్సులిన్ రెసిస్టన్స్ కొరకు సహాయపడుతుంది
- అరటిపండు అల్సర్ వ్యాధి చికిత్స లో సహాయపడుతుంది
అరటి పండు గుండె యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది: పైన చూపిన విధంగా అరటి పండులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. పొటాషియం గుండె యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లో సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం పొటాషియం హై బ్లడ్ ప్రెషర్ (BP) ను నియంత్రిస్తుంది.పొటాషియం గుండె పోటు వచ్చే అవకాశాన్ని తగ్గించటానికి కూడా సహాయపడుతుంది.
- Fruits Valla Kalige Arogya Prayojanalu
- Arogya Sutralu
- Health Tips in Telugu
అరటికాయ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది: అరటిపండు, పండని లేదా కాయగా ఉన్నప్పుడు ఇది ఆకుపచ్చ రంగు లో ఉంటుంది. ఈ కాయ గట్టిగా మరియు చేదు గా ఉంటుంది. కాయ పండు గా మారే క్రమంలో ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగు లోకి మారుతుంది.
అరటి కాయ లో రెసిస్టన్స్ స్టార్చ్ (Resistance Starch) ఉంటుంది. ఈ రెసిస్టన్స్ స్టార్చ్ త్వరగా జీర్ణం అవ్వకుండా మన కడుపు లో ఉండే మంచి బాక్టీరియా కు ఆహారం గా మారుతుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థకు సంభందించిన జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది.
అరటి పండు కిడ్నీ యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది: పొటాషియం మన శరీరానికి చాలా ముఖ్యం, కూరగాయలు మరియు అరటిపండ్లు తినేవారికి పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇవికాకుండా బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ మరియు ప్రొసెస్డ్ ఫుడ్స్ తినే వారికి పొటాషియం సరైన మోతాదులో లభించటానికి అవకాశం ఉండదు. పొటాషియం మన శరీరంలోని కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది.
అరటి పండు మన శరీర బరువు తగ్గించటంలో సహాయపడుతుంది: అరటి పండు తింటే బరువు పెరుగుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు మాత్రం మన శరీర బరువు తగ్గడానికి సహాయపడతాయి. అమెరికా లో 133,468 మగ ఆడవారి ని 24 సంవత్సరాల పాటు పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో వారు తీసుకునే పండ్లు కూరగాయలు వారి శరీర బరువును ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనేది చూడటం జరిగింది. ఈ పరిశోధనలో అరటిపండు కూడా బరువు తగ్గటానికి సహాయపడింది అని తేలింది.
అరటిపండు లో అద్భుతమైన ఆంటియాక్సిడెంట్స్ ఉంటాయి: అరటిపండు లో ఉండే ఆంటియాక్సిడెంట్స్ మన శరీరాన్ని దీర్ఘ కాలిక వ్యాదులైన కాన్సర్ మరియు గుండె కు సంబంచిన జబ్బుల నుంచి కాపాడుతాయి.
అరటి పండు వ్యాయామానికి మంచి శక్తి ని ఇస్తుంది: అరటి పండు మనకు తక్కువ ధర లో మార్కెట్ లో దొరుకుతుంది. దీని వల్ల వ్యాయామం చేసే వారికి మరియు క్రీడాకారులకు మంచి శక్తి ని ఇస్తుంది. అరటి పండు సహన శక్తిని కూడా పెంచటంలో సహాయపడుతుంది. ఒక మీడియం సైజు అరటి పండు (118g) లో 27 g కార్బో హైడ్రేట్లు, 3.1 g ఫైబర్, 105 కెలోరీల శక్తిని ఇస్తుంది.
అరటి పండు ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది: ఆస్టియోపొరాసిస్ అనే ఎముకలకు సంబంధించిన జబ్బు ఎముకలను బలహీన పరుస్తుంది. ఈ వ్యాధి క్రమ క్రమంగా పెరుగతూ ఉంది. అరటి పండు లో ఉండే న్యూట్రిన్లు ఆస్టియోపొరాసిస్ (Osteoporosis) వ్యాధి ని నివారించటంలో సహాయపడుతుంది.
అరటి కాయ ఇన్సులిన్ రెసిస్టన్స్ కొరకు సహాయపడుతుంది: పండు గా మారని అరటి కాయ లో రెసిస్టన్స్ స్టార్చ్ (Resistant starch) 80 నుంచి 90 శాతం ఉంటుంది. అరటి కాయ పండు గా మారే క్రమంలో రెసిస్టన్స్ స్టార్చ్ షుగర్ గా మారుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం రెసిస్టన్స్ స్టార్చ్ ఇన్సులిన్ రెసిస్టన్స్ మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీ ను మెరుగుపరచటంలో సహాయపడుతుంది. అయితే ఈ విషయం పై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. అప్పుడే రెసిస్టన్స్ స్టార్చ్ గురించి ఇంకా తెలిసే అవకాశం ఉంది.
అరటిపండు అల్సర్ వ్యాధి చికిత్స లో సహాయపడుతుంది: అరటిపండు లో ఉండే నూట్రిన్ల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అరటి పండు అల్సర్ వ్యాధి నుంచి బాధపడుతున్న వారికి సహాయపడుతుంది.
Banana Health Benefits in Telugu – అరటిపండు వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు