Menu Close

Balleilakka Song Lyrics In Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఇందురుడో అరె చందురుడో అరె… ఎవరితడో ఠక్కున చెప్పు
పాపారాయుడి మనవడు ఇతడా… ఇతడా ఇతడా ఠక్కున చెప్పు

మారుడె మారుడె మారుడె ఇతడా… పంజా విసిరిన బెబ్బులి ఇతడా
గారడి చేసెడి గోపుడు ఇతడా… తప్పుని భస్మం చేసే శివుడా

హే… బల్లేలక్కా బల్లేలక్కా… చీరాలక్కా పేరాలక్కా
గుంటూరక్కా పుత్తూరక్కా తిరుపతిక్కా
హే బల్లేలక్కా బల్లేలక్కా… చెక్కాముక్కా తనదేనక్కా
అన్నయ్యొస్తే ఆంధ్రా కాదా అమెరికా

గోదావరి తీరం రాజనాల బియ్యం మరిచిపోవమ్మా
ఓహో ఓహో… మా పల్లె పడుచుల గారడి కన్నులు మరిచిపోనమ్మా
తిమ్మరాయల మిట్ట… సంబరాల ఏటిగట్టు, దుమ్ము తెగ రేగు రోడ్డు
చెడుగుడు చెడుగుడు చెడుగుడు చెడుగుడు చెడుగుడు ||2||
ఆడిన ముచ్చట పడి పడి పెరిగిన పచ్చని పసిరిక
చెడమడ చెడమడ కురిసిన మంచూ
గుడగుడ గుడగుడ ఉడికిన ఇడ్లీ
దడదడ దడదడ అదిరెడు రైలూ… గడగడ గడగడ పరిగిడు కాలువ
బరబర బరబర మడిచిన బీడా… మెరమెర మెరతిప్పిన మీసం
మనసుని వదలవు మిమిమిమిమిమిమిమిమిమి

ఇందురుడో అరె చందురుడో అరె… ఎవరితడో ఠక్కున చెప్పు
పాపారాయుడి మనవడు ఇతడా… ఇతడా ఇతడా ఠక్కున చెప్పు
ఇందురుడో అరె చందురుడో అరె… ఎవరితడో ఠక్కున చెప్పు
పాపారాయుడి మనవడు ఇతడా… ఇతడా ఇతడా

హే… బల్లేలక్కా బల్లేలక్కా… చీరాలక్కా పేరాలక్కా
గుంటూరక్కా పుత్తూరక్కా తిరుపతిక్కా, తిరుపతిక్కా
హే బల్లేలక్కా బల్లేలక్కా… చెక్కాముక్కా తనదేనక్కా
అన్నయ్యొస్తే ఆంధ్రా కాదా అమెరికా
ఠక్కున చెప్పు… ఠక్కున చెప్పు

ఏలేలో గ్రామంలో గుడిసెలోన… కొద్దికాలం ఉండి పొండిరా
తాటాకు కప్పు చిల్లుల్లోంచి… నక్షత్రాన్ని లెక్కపెట్టరా
కూయు సెలఫోన్ నసలన్నీ ఆపి
కొంచెం కీచురాళ్ళ ఇచ్చకాలు విందాం
వట్టి కాళ్ళతో గట్టుమీద నడుస్తూ…
మట్టితో మాటలాడుకుందాం… చిన్నపిల్లలౌదాం
ఆడమర్రికీ జడలు వేసి… మల్లెపూలు పెట్టుదామే
ఊళ్ళోని గ్రామదేవత కత్తి పుచ్చుకొని… పెన్నిల్ చెక్కుదామా

హే… బల్లేలక్కా బల్లేలక్కా… చీరాలక్కా పేరాలక్కా
గుంటూరక్కా పుత్తూరక్కా తిరుపతిక్కా, తిరుపతిక్కా
హే బల్లేలక్కా బల్లేలక్కా… చెక్కాముక్కా తనదేనక్కా
అన్నయ్యొస్తే ఆంధ్రా కాదా అమెరికా
గోదావరి తీరం రాజనాల బియ్యం మరిచిపోవమ్మా
ఓహో ఓహో… మా పల్లె పడుచుల గారడి కన్నులు మరిచిపోనమ్మా

ఏలేలో… పోపుల పెట్టెలో… అమ్మచేతి రుచి ఉండురా
రోటిలో నూరి నూరి వండు… నాటుకోడి ఎంత రుచిరా
ఏలేలో… ఆవు మేక మీద ఉన్న పాశం
మన రేషన్ కార్డ్లో చేర్చాలందాం నేస్తం
నీళ్ళు అడిగితే చల్లనిచ్చు నైజం పల్లెల్లో
మనుషులలోనే ఉన్నదంటా నేస్తం
పంబల ముసల్దిచ్చే పసరు ముందుకూ… దెయ్యాలే పారిపోవా
మజ్జారే పక్కింటి వాళ్ళకీ… వండి వార్చెడీ ప్రేమ మనది నేస్తం, హొయ్

బల్లేలక్కా బల్లేలక్కా… చీరాలక్కా పేరాలక్కా
గుంటూరక్కా పుత్తూరక్కా తిరుపతిక్కా, తిరుపతిక్కా
హే బల్లేలక్కా బల్లేలక్కా… చెక్కాముక్కా తనదేనక్కా
అన్నయ్యొస్తే ఆంధ్రా కాదా అమెరికా
గోదావరి తీరం రాజనాల బియ్యం మరిచిపోవమ్మా
ఓహో ఓహో… మా పల్లె పడుచుల గారడి కన్నులు మరిచిపోనమ్మా

తిమ్మరాయల మిట్ట… సంబరాల ఏటిగట్టు, దుమ్ము తెగ రేగు రోడ్డు
చెడుగుడు చెడుగుడు చెడుగుడు చెడుగుడు చెడుగుడు ||2||
ఆడిన ముచ్చట పడి పడి పెరిగిన పచ్చని పసిరిక
చెడమడ చెడమడ కురిసిన మంచూ
గుడగుడ గుడగుడ ఉడికిన ఇడ్లీ
దడదడ దడదడ అదిరెడు రైలూ… గడగడ గడగడ పరిగిడు కాలువ
బరబర బరబర మడిచిన బీడా… మెరమెర మెరతిప్పిన మీసం
మనసుని వదలవు మిమిమిమిమిమిమిమిమిమి

హే… బల్లేలక్కా బల్లేలక్కా… చీరాలక్కా పేరాలక్కా
గుంటూరక్కా పుత్తూరక్కా తిరుపతిక్కా, తిరుపతిక్కా
హే బల్లేలక్కా బల్లేలక్కా… చెక్కాముక్కా తనదేనక్కా
అన్నయ్యొస్తే ఆంధ్రా కాదా అమెరికా ||2||
కూల్……

Like and Share
+1
4
+1
16
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 ట్రోఫీ ఎవరు గెలవబోతున్నారు?

Subscribe for latest updates

Loading